రోజురోజుకి పెరుగుతున్న Simple One Electric Scooter క్రేజ్; అప్పుడే 30,000 దాటిన బుకింగ్స్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో చాలామంది వాహన తయారీదారులు దేశీయ మార్కెట్లో కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే భారతీయ మార్కెట్లో భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు Simple Energy తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన Simple One Electric Scooter విడుదల చేసింది.

Simple One Electric Scooter క్రేజ్ మామూలుగా లేదు; అప్పుడే 30,000 దాటిన బుకింగ్స్

దేశీయ మార్కెట్లో Simple One Electric Scooter విడుదలైనప్పటినుంచి బుకింగ్స్ కూడా ప్రారంభయ్యాయి. ఈ స్కూటర్ బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు 1947 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రారంభంలోనే తెలిపింది. ఇప్పుడు కర్ణాటక రాజధాని నగరమైన బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కొత్త సమాచారాన్ని విడుదల చేసింది.

Simple One Electric Scooter క్రేజ్ మామూలుగా లేదు; అప్పుడే 30,000 దాటిన బుకింగ్స్

Simple Energy విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, Simple One Electric Scooter ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 30,000 యూనిట్లకు పైగా బుకింగ్ లను స్వీకరించినట్లు తెలిపింది. సింపుల్ ఎనర్జీ సింపుల్ వన్ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత కస్టమర్ల నుండి ఇంత గొప్ప ఫీడ్‌బ్యాక్ అందుకోవడం చాలా అద్భుతం.

Simple One Electric Scooter క్రేజ్ మామూలుగా లేదు; అప్పుడే 30,000 దాటిన బుకింగ్స్

Simple One Electric Scooter కి ఎలాంటి మార్కెటింగ్ లేకుండా ఇంత భారీ బుకింగ్‌లను స్వీకరించిందని కంపెనీ స్పష్టం చేసింది. దీని గురించి మాట్లాడుతూ, Simple Energy వ్యవస్థాపకుడు మరియు CEO Mr Suhas Rajkumar అధికారికంగా సమాచారం అందించారు. ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభించినప్పటి నుంచి అద్భుతమైన స్పందనను పొందింది.

Simple One Electric Scooter క్రేజ్ మామూలుగా లేదు; అప్పుడే 30,000 దాటిన బుకింగ్స్

ఇప్పటి వరకు ఈ స్కూటర్ బుక్ చేసుకున్న కస్టమర్లకు మా ఉత్పత్తిపై పెంచుకున్న నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అంతే కాకుండా కంపెనీ వెబ్‌సైట్ భారీ మొత్తంలో ట్రాఫిక్‌ను చూస్తోంది, దీని వలన కస్టమర్ ప్రీ-ఆర్డర్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్‌లో కూడా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. అయితే మా టీమ్ ప్రీకి సంబంధించిన అన్ని సమస్యలను చూసుకుంది. అదేవిధంగా ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తుంది.

Simple One Electric Scooter క్రేజ్ మామూలుగా లేదు; అప్పుడే 30,000 దాటిన బుకింగ్స్

Simple Energy కంపెనీ త్వరలో ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త Simple One Electric Scooter మొత్తం నాలుగు కలర్ ఆప్సన్లలో ప్రవేశపెట్టింది. ఇందులో నమ్మ రెడ్, అజూర్ బ్లూ, గ్రేస్ వైట్ మరియు బ్రెజెన్ బ్లాక్ కలర్స్ ఉన్నాయి.

Simple One Electric Scooter క్రేజ్ మామూలుగా లేదు; అప్పుడే 30,000 దాటిన బుకింగ్స్

Simple One Electric Scooter డిజైన్ విషయానికి వస్తే, ఇది త్రిభుజాకార ఎల్ఈడీ డిఆర్ఎల్ లు, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు టర్న్-సిగ్నల్ ఇండికేటర్స్ వంటి వాటిని కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఎల్ఈడీ టెయిల్-లాంప్, సింగిల్-పీస్ సీట్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, 30-లీటర్స్ అండర్-సీట్ స్టోరేజ్, అల్లాయ్ వీల్స్, రియర్ గ్రాబ్ రైల్స్ మరియు కాంటూర్డ్ రియర్ వ్యూ మిర్రర్స్ వంటివి ఉన్నాయి.

Simple One Electric Scooter స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు మోనో షాక్ సెటప్ ఉంటుంది. అదే విధముగా ఇందులో అద్భుతమైన బ్రేకింగ్ సిస్టం ఉంటుంది. ఈ స్కూటర్ ముందు మరియు వెనుక భాగంలో 90 మిమీ డ్రమ్ బ్రేకులు ఉంటాయి. ఈ స్కూటర్ యొక్క టైర్ పరిమాణం 12 ఇంచెస్ ఉంటుంది. ఈ స్కూటర్ బరువు 110 కేజీలు.

Simple One Electric Scooter క్రేజ్ మామూలుగా లేదు; అప్పుడే 30,000 దాటిన బుకింగ్స్

Simple One Electric Scooter ధర భారతీయ మార్కెట్లో రూ. 1.09 లక్షల ధరతో విడుదల చేయబడింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 75 నగరాల్లో డెలివరీ కోసం డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయడానికి కంపెనీ కృషి చేస్తోంది. Simple One Electric Scooter ఎకో మోడ్‌లో 236 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

Simple One Electric Scooter క్రేజ్ మామూలుగా లేదు; అప్పుడే 30,000 దాటిన బుకింగ్స్

ఛార్జర్ సింపుల్ లూప్ సహాయంతో, Simple One Electric Scooter కేవలం 60 సెకన్లలో 2.5 కిమీ రేంజ్ వరకు ఛార్జ్ అవుతుంది. దీని అంతర్నిర్మిత బ్యాటరీని హోమ్ ఛార్జర్ తో 2.75 గంటలలో 0 నుంచి 100 శాతం నుండి ఛార్జ్ చేయబడుతుంది. అయితే రిమూవబుల్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి అదనంగా 75 నిమిషాలు పడుతుంది. ఈ సందర్భంలో, రెండు బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి మొత్తం 4 గంటలు పడుతుంది.

Most Read Articles

English summary
Simple energy gets 30000 pre booking for simple one electric scooter details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X