సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్: ధర, ఫీచర్లు, రేంజ్, బ్యాటరీ & వివరాలు

పెట్రోల్ ధరలు నిరంతరాయంగా పెరిగిపోతున్న నేపథ్యంలో, ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రత్యేకించి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు కొత్త మరియు ప్రస్తుత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్: ధర, ఫీచర్లు, రేంజ్, బ్యాటరీ & వివరాలు

తాజాగా, బెంగుళూరుకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ, తమ అధునాతన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ, సెగ్మెంట్లో కెల్లా అత్యధిక రేంజ్‌తో కంపెనీ ఈ స్కూటర్‌ను రూపొందించింది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్: ధర, ఫీచర్లు, రేంజ్, బ్యాటరీ & వివరాలు

మరి ఈ కథనంలో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విశిష్టతలు మరియు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర

సింపుల్ ఎనర్జీ ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను రూ.1.09 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఇది ఒకే ఒక్క వేరియంట్‌లో లభ్యం కానుంది. ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్‌లో రూ.1947 టోకెన్ అమౌంట్‌ను చెల్లించి ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్: ధర, ఫీచర్లు, రేంజ్, బ్యాటరీ & వివరాలు

ఒకవేళ కస్టమర్లు మనసు మార్చుకుని, ఈ స్కూటర్‌ను వద్దునుకుంటే, కంపెనీ వారికి ఈ మొత్తాన్ని పూర్తిగా వాపసు ఇస్తుంది. సింపుల్ వన్ ఎలక్రిక్ స్కూటర్ డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. ఇందుకోసం, కంపెనీ 13 రాష్ట్రాల్లోని 75 నగరాల్లో డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయడంలో నిమగ్నమై ఉంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్: ధర, ఫీచర్లు, రేంజ్, బ్యాటరీ & వివరాలు

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రధానమైన ప్రత్యేకత దీని రేంజ్. ఈ స్కూటర్ ఎకో మోడ్‌లో పూర్తి చార్జ్‌పై 236 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. దీని రేంజ్ విషయంలో కంపెనీ చేసిన పరీక్షల ఆధారంగా ఇది నిర్ధారించబడింది. ఇందులో ఎకో, రైడ్, డాష్, సోనిక్ రైడ్ మోడ్‌లు ఉంటాయి. రైడర్ ఎంచుకునే మోడ్‌ని బట్టి రేంజ్ మారుతూ ఉంటుంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్: ధర, ఫీచర్లు, రేంజ్, బ్యాటరీ & వివరాలు

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా గంటకు 105 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఈ స్కూటర్ కేవలం 2.95 సెకన్లలోనే గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని మరియు 3.6 సెకన్లలోనే గంటకు 0 నుండి 50 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఈ సెగ్మెంట్‌లోనే ఇది అత్యంత వేగవంతమైన 0 - 40 కిమీ/గం వేగాన్ని సాధించినట్లు కంపెనీ పేర్కొంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్: ధర, ఫీచర్లు, రేంజ్, బ్యాటరీ & వివరాలు

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ

ఈ స్కటర్‌లో 7 KW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, ఇది 4.8kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ తొలగించదగినది మరియు ఇది సుమారు 7 కిలోల బరువు ఉంటుంది. స్కూటర్ నుండి ఈ బ్యాటరీని తొలగించి ప్రత్యేకంగా చార్జ్ చేసుకోవచ్చు. ఈ మోటర్ గరిష్టంగా ఇది 72 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్: ధర, ఫీచర్లు, రేంజ్, బ్యాటరీ & వివరాలు

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ సమయం

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీలను సపోర్ట్ చేస్తుంది. స్టాండర్డ్ 15A సాకెట్ సాయంతో దీనిని 0-80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 2.45 గంటల సమయం పడుతుంది. ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 60 సెకన్లలో 2.5 కిమీ రేంజ్‌కు సరిపడా ఛార్జ్ చేసుకోవచ్చు.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్: ధర, ఫీచర్లు, రేంజ్, బ్యాటరీ & వివరాలు

సింపుల్ ఎనర్జీ ఇటీవల పబ్లిక్ ఛార్జింగ్ మరియు హోమ్ ఛార్జింగ్ కోసం సింపుల్ లూప్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టింది. వచ్చే ఏడు నెలల్లో 13 రాష్ట్రాల్లో 300 కి పైగా ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్: ధర, ఫీచర్లు, రేంజ్, బ్యాటరీ & వివరాలు

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కలర్ ఆప్షన్స్

 • బ్రేజెన్ బ్లాక్
 • నమ్మ రెడ్
 • అజుల్ బ్లూ
 • గ్రేస్ వైట్
 • సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు, టెక్నాలజీ

  • 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే
  • స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, మొబైల్ యాప్
  • ఆన్-బోర్డ్ నావిగేషన్
  • బ్లూటూత్
  • జియో ఫెన్సింగ్
  • 4G ఎల్‌టిఈ
  • ఓటిఏ (ఓవర్ ది ఎయిర్) అప్‌డేట్స్
  • ఫాస్ట్ చార్జర్ లొకేషన్
  • టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్
  • కాల్, మ్యూజిక్ కంట్రోల్
  • వెహికల్ ట్రాకింగ్
  • డాక్యుమెంట్ స్టోరేజ్
Most Read Articles

English summary
Simple one electric scooter price specs features range all other details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X