భారత్‌లో సూపర్ సోకో క్యుమినీ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల ఖరారు!

భారత్‌లోకి మరొక చైనీస్ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ప్రవేశించనుంది. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ 'సూపర్ సోకో' ఇటీవలే మూడు సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఇందులో క్యుమినీ మరియు క్యుక్స్ అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత్‌లో లాంచ్ చేయనున్నారు.

భారత్‌లో సూపర్ సోకో క్యుమినీ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల ఖరారు!

ఆస్ట్రేలియాకి చెందిన టూవీలర్ కంపెనీ వి-మోటో గత ఏడాది చైనా బ్రాండ్ సూపర్ సోకోతో ఓ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసుకుంది. వి-మోటో ఇప్పుడు తాజాగా భారతీయ కంపెనీ అయిన బర్డ్ గ్రూపుతో ఓ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా, వి-మోటో ద్వారా క్యుమినీ మరియు క్యుక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లు భారత మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి.

భారత్‌లో సూపర్ సోకో క్యుమినీ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల ఖరారు!

బర్డ్ గ్రూప్ మార్కెట్ అధ్యయనం ప్రకారం, సూపర్ సోకో క్యుమినీ మరియు క్యుక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు భారత మార్కెట్లో మంచి డిమాండ్ లభించవచ్చని పేర్కొంది. బర్డ్ గ్రూప్ ఈ నెలలో 20 సూపర్ సోకో క్యుమినీ స్కూటర్లను ట్రయల్ రన్ కోసం కొనుగోలు చేస్తోంది. ప్రారంభంలో వీటిని న్యూ ఢిల్లీలో రైడ్-షేరింగ్ ప్రాజెక్ట్ కోసం ఉపయోగించవచ్చని సమాచారం.

MOST READ:ఔరా.. ఇదేమి సిత్రం.. ట్రక్ డ్రైవర్‌కి హెల్మెట్ లేదని ఫైన్.. ఎక్కడో తెలుసా

భారత్‌లో సూపర్ సోకో క్యుమినీ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల ఖరారు!

సూపర్ సోకో క్యుక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను చిన్నపాటి నగర ప్రయాణాల కోసం రూపొందించారు. ఈ లైట్ స్కూటర్‌ను ప్రారంభకులు కూడా సులువుగా నడపగలరు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 0.6 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ మరియు 0.96 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది.

భారత్‌లో సూపర్ సోకో క్యుమినీ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల ఖరారు!

ఎన్‌సిఎమ్ టెక్నాలజీతో పనిచేసే ఈ స్కూటర్ ఎఫ్‌ఓసి 3.3 కంట్రోల్ యూనిట్ ద్వారా నియంత్రించబడుతుంది. అపార్ట్‌మెంట్లు లేదా కార్యాలయంలో ఛార్జింగ్ చేసుకునేందుకు వీలుగా ఇందులో తొలగించగల 7.2 కిలోల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయడానికి ఏడు గంటల సమయం పడుతుంది. పూర్తి ఛార్జ్‌పై ఇది 60-70 కి.మీ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

MOST READ:ట్రాఫిక్ సిగ్నల్ పోల్‌కి సెలబ్రేషన్ చేసిన బెంగళూరు పోలీసులు.. ఎందుకో తెలుసా?

భారత్‌లో సూపర్ సోకో క్యుమినీ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల ఖరారు!

సూపర్ సోకో క్యుమినీ ఇ-స్కూటర్ విషయానికి వస్తే, ఇది బేసిక్ డిజైన్ ఎలిమెంట్స్‌తో చాలా సింపుల్‌గా కనిపించే ఎలక్ట్రిక్ స్కూటర్. ప్రత్యేకించి అర్బన్ మొబిలిటీ కోసం ఈ స్కూటర్‌ను రూపొందించారు. ఇందులో 12 ఇంచ్ టైర్లు ఉంటాయి.

భారత్‌లో సూపర్ సోకో క్యుమినీ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల ఖరారు!

క్యుమిని ఎలక్ట్రిక్ స్కూటర్ 600 వాట్ కంటిన్యూస్ మోటార్‌తో పనిచేస్తుంది. ఇందులో తొలగించగలిగిన 20 ఆంపియర్ బ్యాటరీ ఉంటుంది, ఈ బ్యాటరీ బరువు కేవలం 7.8 కిలోలు మాత్రమే ఉంటుంది. పూర్తి చార్జ్‌పై ఈ స్కూటర్ గరిష్టంగా 60-70 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

MOST READ:సుజుకి హయాబుసా సూపర్‌బైక్‌పై ట్రాఫిక్ పోలీస్ [వీడియో]

భారత్‌లో సూపర్ సోకో క్యుమినీ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల ఖరారు!

ఇంకా ఇందులో పూర్తి ఎల్ఈడి లైటింగ్ మరియు కీలెస్ స్టార్టప్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులోని స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సాయంతో అలారం, జిపిఎస్ మరియు బ్యాటరీ చార్జ్ వంటి పలు అంశాలను సులువుగా తెలుసుకోవచ్చు. ఇది ఈ విభాగంలో ఆంపియర్ మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Super Soco CUmini Electric Scooter India Launch Confirmed. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X