Suzuki Burgman ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీ వెల్లడి.. చేతక్, ఐక్యూబ్ గుండెల్లో గుబుల్..

జపాన్‌కి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా లిమిటెడ్ (Suzuki Motorcycle India), గత కొంత కాలంగా భారత మార్కెట్లో పట్టు కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. భారత మార్కెట్ కోసం ఈ బ్రాండ్ ప్రత్యేకంగా రూపొందించబడిన మరియు అభివృద్ధి చేయబడిన ఉత్పత్తులు ఇక్కడి మార్కెట్లో అద్భుతమైన విజయాన్ని సాధిస్తున్నాయి.

Suzuki Burgman ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీ వెల్లడి.. చేతక్, ఐక్యూబ్ గుండెల్లో గుబుల్..

సుజుకి దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టిన అప్‌డేటెడ్ జిక్సర్ సిరీస్ తో భారతదేశంలో ఈ జపనీస్ టూవీలర్ బ్రాండ్ ఓ కొత్త శకానికి నాంది పలికింది. దాని తర్వాత, ఇండియా-స్పెక్ సుజుకి యాక్సెస్, బర్గ్‌మ్యాన్ మరియు ఇంట్రూడర్‌ వంటి మోడళ్లు వాటి సంబంధిత విభాగాలలో అతి త్కకువ సమయంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందాయి.

Suzuki Burgman ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీ వెల్లడి.. చేతక్, ఐక్యూబ్ గుండెల్లో గుబుల్..

సుజుకి తమ బర్గ్‌మ్యాన్ (Suzuki Burgman) స్కూటర్ ను తొలిసారిగా జులై 2018లో భారత మార్కెట్లో విడుదల చేసి, మాక్సీ స్కూటర్ (Maxi Scooter) అనే ఓ కొత్త టూవీలర్ విభాగాన్ని దేశీయ వినియోగదారులకు పరిచయం చేసింది. తాజాగా, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ కూడా ఈ విభాగంలోకి ప్రవేశించడానికి సిద్ధమైంది.

Suzuki Burgman ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీ వెల్లడి.. చేతక్, ఐక్యూబ్ గుండెల్లో గుబుల్..

భారతదేశంలోని అగ్ర ద్విచక్ర వాహన బ్రాండ్లలో ఒకటైన బజాజ్ ఆటో మరియు టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ విభాగంలో విక్రయిస్తున్న బజాజ్ చేతక్ (Bajaja Chetak EV) మరియు టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా సుజుకి కూడా ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ విక్రయిస్తున్న సుజుకి బర్గ్‌మ్యాన్ మాక్సీ స్కూటర్ ను ఆధారంగా చేసుకొని రూపొందించనున్నారు.

Suzuki Burgman ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీ వెల్లడి.. చేతక్, ఐక్యూబ్ గుండెల్లో గుబుల్..

సుజుకి బర్గ్‌మ్యాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కంపెనీ ఇప్పటికే భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షించింది. ఇప్పుడు ఈ పరీక్షలు ముగిసి, ఉత్పత్తి తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, సుజుకి బర్గ్‌మ్యాన్ ఆధారిత ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ఏడాది నవంబర్ 18 మార్కెట్లో విడుదల కానుంది. సుజుకి మోటార్‌సైకిల్ ఈ మేరకు మీడియా ఆహ్వానాలను కూడా జారీ చేసింది.

Suzuki Burgman ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీ వెల్లడి.. చేతక్, ఐక్యూబ్ గుండెల్లో గుబుల్..

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ పరంగా సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ 125 మాదిరిగానే అదే డిజైన్‌ను పంచుకుంటుంది. ఇదివరకు పరీక్షా సమయంలో లీకైన స్పై చిత్రాలు కూడా ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. బర్గ్‌మాన్ స్ట్రీట్ స్కూటర్ లోని పెద్ద హెడ్‌లైట్ యూనిట్ మరియు ఫ్రంట్ ఆప్రాన్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కనిపిస్తాయి. సమాచారం ప్రకారం, సుజుకి బర్గ్‌మాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపున స్ప్రింగ్‌లోడెడ్ డ్యూయల్ సస్పెన్షన్ సెటప్ ఉంటుందని సమాచారం.

Suzuki Burgman ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీ వెల్లడి.. చేతక్, ఐక్యూబ్ గుండెల్లో గుబుల్..

అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 5 స్పోక్ అల్లాయ్ వీల్స్ మరియు వెనుక టైర్ మడ్‌గార్డ్ కూడా ఉన్నాయి. ఇంకా ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఎల్‌ఈడి హెడ్‌లైట్, ఎల్‌ఈడి టెయిల్‌లైట్, యూఎస్‌బి ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది. గతంలో లీకైన స్పై చిత్రాల ప్రకారం, ఈ స్కూటర్ పూర్తిగా తెలుపు రంగులో ఉంటుంది మరియు ఇది ఎలక్ట్రిక్ వెర్షన్ అని హైలైట్ చేయడానికి సైడ్ ప్రొఫైల్‌లో బ్లూ కలర్ యాక్సెంట్స్ ఉంటాయని తెలుస్తోంది.

Suzuki Burgman ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీ వెల్లడి.. చేతక్, ఐక్యూబ్ గుండెల్లో గుబుల్..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్, స్టాండర్డ్ పెట్రోల్ వెర్షన్ సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్ మాదిరిగానే పెద్దదిగా మరియు విశాలంగా ఉండనుంది. సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బర్గ్‌మన్ స్ట్రీట్ 110 సిసి మెరుగైన పనితీరును కలిగి ఉంటుంది. ఈ స్కూటర్‌లో బెల్ట్ డ్రైవ్ ఉపయోగించే అవకాశం ఉంది. నివేదిక ప్రకారం, సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 100-120 కి.మీల ఏఆర్ఏఐ సర్టిఫైడ్ రేంజ్ ను ఆఫర్ చేయవచ్చు.

Suzuki Burgman ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీ వెల్లడి.. చేతక్, ఐక్యూబ్ గుండెల్లో గుబుల్..

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రస్తుతానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారాన్ని అందించలేదు. అయితే, ఈ కొత్త సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఈ విభాగంలో లభిస్తున్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగానే అధునాతన ఫీచర్లు, మెరుగైన రేంజ్, సాటిలేని పెర్ఫార్మెన్స్ వంటి అంశాలను ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కంపెనీ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన పూర్తి-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా అందించే అవకాశం ఉంది.

Suzuki Burgman ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీ వెల్లడి.. చేతక్, ఐక్యూబ్ గుండెల్లో గుబుల్..

సుజుకి నుండి రాబోయే బర్గ్‌మ్యాన్ ఆధారిత కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లో పూర్తి ఎల్‌ఈడి లైటింగ్, పెద్ద బూట్ స్పేస్, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు విశాలమైన మరియు సౌకర్యవంతమైన సీట్లు మొదలైన ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది. ధర విషయానికి వస్తే, ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్ వెర్షన్ సుజుకి బర్గ్‌మ్యాన్ 125 స్కూటర్ ధర రూ.86,100 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ వెర్షన్ సుజుకి బర్గ్‌మ్యాన్ స్కూటర్ ధర సుమారు రూ. 1.20 లక్షల (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా. - తెలుగులో ఆటోమొబైల్స్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ పొందడం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Suzuki burgman electric scooter india launch date revealed details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X