మీకు తెలుసా.. ఈ బ్యాటరీ కేవలం 90 సెకన్లలో పూర్తిగా ఛార్జ్ చేసుకుంటుంది

ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకి విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే చాలా కంపెనీలు మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు భారతదేశంలో కూడా డిమాండ్ బాగానే ఉంది. అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి.

మీకు తెలుసా.. ఈ బ్యాటరీ కేవలం 90 సెకన్లలో పూర్తిగా ఛార్జ్ చేసుకుంటుంది

ఇది మాత్రమే కాకుండా రోజురోజుకి భారతీయ మార్కెట్లో పెరుగుతున్న ఇంధన ధరలు కూడా ఎక్కువమంది వాహన వినియోగదారులను ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రేరేపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ఇప్పటికి కూడా చాలా దేశాల్లో సరైన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేదు.

మీకు తెలుసా.. ఈ బ్యాటరీ కేవలం 90 సెకన్లలో పూర్తిగా ఛార్జ్ చేసుకుంటుంది

అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ వేసుకోవడానికి కూడా గంటలు తరబడి వేసి ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కావున ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హై-స్పీడ్ బ్యాటరీలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే UK కంపెనీ ఒక హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బ్యాటరీని ఏర్పాటు చేసింది. UK కంపెనీ యొక్క ఈ MAHLE బ్యాటరీ కేవలం 90 సెకన్లలో పూర్తిగా ఛార్జ్ చేసుకోగలదు. అంటే దీని ఛార్జింగ్ సమయం కేవలం ఒక్క నిముషం మాత్రమే.

నివేదికల ప్రకారం ఇంగ్లాండ్‌లో ఉన్న రెండు కంపెనీలు, MAHLE మరియు Allotrope energy ఈ కొత్త హై స్పీడ్ రీఛార్జబుల్ బ్యాటరీని అభివృద్ధి చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి ఈ బ్యాటరీ అభివృద్ధి చేయబడింది. ఈ బ్యాటరీ ప్రస్తుతం కాన్సెప్ట్ మోడల్‌గా మాత్రమే అభివృద్ధి చేయబడింది. అయితే ఈ బ్యాటరీ త్వరలో ఉపయోగానికి ఆసరమైన విధంగా ఉపయోగించడానికి అనుకూలంగా తయారు చేయబడుతుంది.

ఈ నేపథ్యంలోనే ఈ రెండు కంపెనీలు వేగంగా పని చేస్తున్నాయి. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వ్యక్తులకు కొత్త అంచనాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఈ బ్యాటరీ యొక్క నిర్మాణం ఛార్జింగ్ కోసం ఎక్కువసేపు వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తుంది.

మీకు తెలుసా.. ఈ బ్యాటరీ కేవలం 90 సెకన్లలో పూర్తిగా ఛార్జ్ చేసుకుంటుంది

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జ్ చేయడానికి గరిష్టంగా పట్టే సమయం 6 గంటల నుంచి 8 గంటలు. ఇంత సమయం వాహన వినియోగదారులు వేచి ఉండటం చాలా కష్టమైన విషయం, కావున ఈ కొత్త బ్యాటరీ అమలులోకి వస్తే ఛార్జింగ్ సమయం కేవలం ఒక నిముషం మాత్రమే. కావున కొనుగోలుదారులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

ప్రస్తుతం వాహనాలకు ఛార్జింగ్ వేసుకోవడానికి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ లో వాహనాలకు చార్జింగ్ వేసుకోవడానికి 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. ఇది కూడా కొంత ఎక్కువా సమయాన్ని తీసుకుంటుంది.

మీకు తెలుసా.. ఈ బ్యాటరీ కేవలం 90 సెకన్లలో పూర్తిగా ఛార్జ్ చేసుకుంటుంది

అయితే ఇప్పుడు అందుబాటులోకి రానున్న కొత్త సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ, లిథియం కార్బన్‌తో తయారు చేయబడింది. ఈ బ్యాటరీ సాంప్రదాయ బ్యాటరీలను తయారు చేయడానికి ఉపయోగించే ఉత్పత్తుల నుండి తయారు చేయబడిందని కంపెనీ పేర్కొంది. కొత్త హై స్పీడ్ ఛార్జింగ్ బ్యాటరీ సాధారణ బ్యాటరీ లాగానే విక్రయించబడుతుందని భావిస్తున్నారు.

బ్యాటరీ తేలికపాటి ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిందని కంపెనీ పేర్కొంది. యానోడ్ మరియు సూపర్ కెపాసిటర్లు క్యాథోడ్‌లో ఉపయోగించబడతాయి. ఇది సేంద్రీయ ఎలక్ట్రోలైట్‌ల ద్వారా వేరు చేయబడతాయి. కావున వేడి వెంటనే ప్రసారం చేయబడుతుంది. ఇది వేగంగా ఛార్జింగ్ మరియు అధిక పవర్ అవుట్‌పుట్ కోసం అనుమతిస్తుంది. ఇవన్నీ సహజంగా జరిగినవి కావడం గమనార్హం.

మీకు తెలుసా.. ఈ బ్యాటరీ కేవలం 90 సెకన్లలో పూర్తిగా ఛార్జ్ చేసుకుంటుంది

ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత గరిష్టంగా 25 కి.మీ పరిధిని అందిస్తుంది. కానీ కంపెనీ పరిధిలో ఎలాంటి ప్రత్యేకతలు ఇవ్వలేదు. ఈ అల్ట్రాఫాస్ట్ ఛార్జ్డ్ బ్యాటరీ మరింత దూరం కదలగలదని భావిస్తున్నారు. అయితే దీనికి సంబందించిన అధికారిక సమాచారం త్వరలో వెల్లడవుతుంది.

ఇటీవల స్విస్ ఇంజనీరింగ్ కంపెనీ అయిన ABB ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా ఛార్జ్ చేయగల ఎలక్ట్రిక్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఛార్జర్‌తో ఎటువంటి ఎలక్ట్రిక్ కారు అయినా కేవలం 15 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఛార్జర్ సాధారణ ఛార్జర్‌ల కంటే చాలా వేగంగా ఛార్జ్ చేస్తుంది. ఈ ఛార్జర్ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఛార్జర్‌ అని తెలిపారు. ABB కంపెనీ ప్రారంభించిన ఈ ఎలక్ట్రిక్ పాస్ట్ ఛార్జర్ పేరు Terra 360 (టెర్రా 360). ఈ టెర్రా 360 మాడ్యులర్ ఛార్జర్ ఒకేసారి నాలుగు వాహనాలను ఛార్జ్ చేయగల సామర్త్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఛార్జర్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
This battery can charge in 90 seconds charging cycles upto 1 lakh times
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X