ప్రపంచంలోనే ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఛార్జర్; ఏ కారుకైన కేవలం 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్

ప్రపంచ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల ఆధిక్యత క్రమంగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దాదాపు అన్ని కంపెనీలు ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి విక్రయిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరిగికొద్దీ వాటికి కావలసిన ఛార్జింగ్ స్టేటన్స్ అందుబాటులో ఉండాలి. కావున ఇటీవల స్విట్జర్లాండ్ ఇంజనీరింగ్ కంపెనీ ABB ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్ ఛార్జర్‌ని విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ప్రపంచంలోనే ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఛార్జర్; కేవలం 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్

స్విట్జర్లాండ్ ఇంజనీరింగ్ కంపెనీ ABB ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఛార్జర్‌ని ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ ఫాస్ట్ ఛార్జర్ ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా సమయాన్ని ఎక్కువ అదా చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కంపెనీ దీనిని ప్రారంభించడానికి దాదాపు $ 3 బిలియన్లు వెచ్చించింది.

ప్రపంచంలోనే ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఛార్జర్; కేవలం 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్

ABB కంపెనీ ప్రారంభించిన ఈ ఎలక్ట్రిక్ పాస్ట్ ఛార్జర్ పేరు Terra 360 (టెర్రా 360). ఈ టెర్రా 360 మాడ్యులర్ ఛార్జర్ ఒకేసారి నాలుగు వాహనాలను ఛార్జ్ చేయగల సామర్త్యాన్ని కలిగి ఉంటుంది. అంతే కాదు, ఈ ఫాస్ట్ ఛార్జర్ ఈ ఎలక్ట్రిక్ కారునైనా కేవలం 15 నిముషాల్లో పూర్తిగా చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే దీని సామర్థ్యం ఏమిటో అర్థమవుతుంది. ఈ ఛార్జర్ వాహనదారుల సమయాన్ని చాలా ఆదా చేయడంలో సహాయపడుతుంది.

ప్రపంచంలోనే ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఛార్జర్; కేవలం 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్

ABB కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ కార్ ఫాస్ట్ ఛార్జర్ 'టెర్రా 360' కేవలం 3 నిమిషాల్లోపు 100 కిలోమీటర్లు ప్రయాణించడానికి కావసిన ఛార్జింగ్ చేస్తుంది. నిజంగా ఇది చాలా అద్భుతం. ప్రస్తుతం ఇది స్విజ్జర్లాండ్ లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఈ సంవత్సరం చివరి నాటికి ఈ ఎలక్ట్రిక్ కార్ ఫాస్ట్ ఛార్జర్ యూరప్ మరియు యునైటెడ్ స్టేట్స్‌లో అందుబాటులోకి వస్తుందని కంపెనీ చెబుతోంది.

కంపెనీ 2022 నాటికి ఈ Terra 360 ఫాస్ట్ ఛార్జర్ ని లాటిన్ అమెరికా మరియు ఆసియా పసిఫిక్ దేశాలకు అందించే అవకాశం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫాస్ట్ చార్జర్ అందుబాటులోకి వస్తే, వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు.

ప్రపంచంలోనే ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఛార్జర్; కేవలం 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్

ఈ సందర్భంగా, ABB కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'Bjorn Rosengren' (జార్న్ రోసెన్‌గ్రెన్) మాట్లాడుతూ, ఈ సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో తమ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ బిజినెస్ స్పిన్-ఆఫ్ కోసం ఇన్వెస్టర్ మెటీరియల్ సిద్ధంగా ఉంటుంది అని చెప్పారు. అంతే కాకుండా పొటెన్షియల్ ఫ్లోటేషన్ 2022 ప్రారంభానికి లక్ష్యంగా ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా ABB ఛార్జర్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 2010 లో ఈ-మొబిలిటీ వ్యాపారంలోకి ప్రవేశించినప్పటి నుండి 88 కి పైగా మార్కెట్లలో 4,60,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జర్‌లను విక్రయించినట్లు కూడా కంపెనీ తెలిపింది.

ప్రపంచంలోనే ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఛార్జర్; కేవలం 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్

ఎలక్ట్రో ఛార్జింగ్ బిజినెస్ లో కంపెనీ తన ఉనికిని మరింత విస్తరించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తుంది. అంతే కాకుండా సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్ కంపెనీల సముపార్జనకు సహాయపడటానికి మరియు వేగవంతమైన వృద్ధికి మూలధనాన్ని పెంచడానికి స్పిన్-ఆఫ్ కోసం ప్రయత్నిస్తోంది.

ప్రపంచంలోనే ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఛార్జర్; కేవలం 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్

ABB వాహన ఛార్జింగ్ బిజినెస్ గురించి వ్యాపారం గురించి ప్రముఖ మీడియా కంపెనీ నివేదించింది. కంపెనీ 2020 సంవత్సరంలో $ 220 మిలియన్ల అమ్మకాలను కలిగి ఉంది. అంటే ఒక ఫ్లోట్‌లో సుమారు 3 బిలియన్ US డాలర్ల విలువను పొందవచ్చు. ఇది రానున్న కాలంలో మరింత వృద్ధి చెందుతుందని భావిస్తున్నాము.

ప్రపంచంలోనే ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఛార్జర్; కేవలం 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్

భారతదేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగానే ఉంది, కానీ ఎలక్ట్రిక్ వాహనాలను కావాలసిన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేదు, కావున ఆశించిన స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడు పోవడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభ్హుత్వం కూడా ఛార్జింగ్ వంటి సదుపాయాలను కల్పించడానికి తగిన సన్నాహాలు తీసుకుంటోంది. దీనితహా పాటు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును పెంచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభ్హుత్వాలు అనేక రాయితీలను కూడా అందిస్తున్నాయి. అయితే భారతదేశంలో కూడా త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ సంఖ్యలో వినియోగించబడతాయి.

ఇందులో భాగంగానే దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ దిగ్గజం హీరో ఎలక్ట్రిక్ భారీ ఎత్తున ఎలక్ట్రిక్‌ ఛార‍్జింగ్‌ స‍్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఢిల‍్లీకి చెందిన ఓ స్టార్టప్‌ భాగస్వామ్యంలో దేశం మొత్తం మీద ఈ ఏడాది చివరి నాటికి 10వేల ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు హీరో ఎలక్ట్రిక్‌ సీఈఓ సోహిందర్‌ గిల్‌ తెలిపారు. ఇది కూడా ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Swiss engineering company abb launched world fastest electric car charger details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X