భారత్‌లో రూ. 21.40 లక్షల బైక్ విడుదల: పుల్ డీటైల్స్

ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ (Triumph Motorcycles) భారతీయ మార్కెట్లో తన కొత్త రాకెట్ 3 జిటి 221 స్పెషల్ ఎడిషన్‌ (Rocket 3 GT 221 Special Edition) విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ధర దేశీయ మార్కెట్లో రూ. 21.40 లక్షలు (ఎక్స్-షోరూమ్). కొత్త ట్రయంఫ్ రాకెట్ 3 జిటి 221 స్పెషల్ ఎడిషన్‌ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో రూ. 21.40 లక్షల బైక్ విడుదల: పుల్ డీటైల్స్

ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ యొక్క ఈ స్పెషల్ ఎడిషన్‌ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతే కాకూండా ఇది కొత్త కలర్ స్కీమ్ కూడా పొందుతుంది, కావున ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కావున కొనుగోలుదారులను ఆకర్శించడంలో గొప్ప విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఈ కొత్త బైక్ కేవలం ఒక సంవత్సరం పాటు మాత్రమే అమ్మకానికి ఉంటుంది.

భారత్‌లో రూ. 21.40 లక్షల బైక్ విడుదల: పుల్ డీటైల్స్

కంపెనీ విడుదల చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ మంచి పనితీరుని అందిస్తుంది. ఇది 221 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ చాలా దూకుడుగా ఉంటుందని చూడగానే చెప్పవచ్చు.

ట్రయంఫ్ రాకెట్ 3 జిటి 221 స్పెషల్ ఎడిషన్ ఫ్యూయల్ ట్యాంక్ మరియు ఫ్రంట్ మడ్‌గార్డ్‌పై రెడ్ హాప్పర్ కలర్ పొందుతుంది. అంతే కాకుండా సఫైర్ బ్లాక్ మడ్‌గార్డ్ బ్రాకెట్‌లు, హెడ్‌లైట్ బౌల్స్, ఫ్లైస్క్రీన్, సైడ్ ప్యానెల్‌లు, రియర్ బాడీవర్క్ మరియు రేడియేటర్ కౌల్స్‌తో చక్కని కాంట్రాస్ట్‌ను కలిగి ఉంది.

భారత్‌లో రూ. 21.40 లక్షల బైక్ విడుదల: పుల్ డీటైల్స్

ఈ కొత్త ఎడిషన్ లో క్నీ ప్యాడ్ గ్రాఫిక్స్ మరియు ట్యాంక్-టాప్ గ్రాఫిక్స్ మరింత మెరుగుపరచబడ్డాయి. కానీ ఇందులోని సింగిల్-సైడెడ్ స్వింగ్‌ఆర్మ్ మరియు హిడెన్ పిలియన్ ఫుట్‌రెస్ట్‌లు అన్ని కూడా దాని స్టాక్ వెర్షన్ వలే అలాగే ఉంచబడ్డాయి. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో రూ. 21.40 లక్షల బైక్ విడుదల: పుల్ డీటైల్స్

కొత్త ట్రయంఫ్ రాకెట్ 3 జిటి 221 స్పెషల్ ఎడిషన్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2,458 సిసి త్రీ-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 165 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 221 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది నిజంగా అత్యధిక టార్క్ ఉత్పత్తి చేసే మోటార్‌సైకిల్‌. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

భారత్‌లో రూ. 21.40 లక్షల బైక్ విడుదల: పుల్ డీటైల్స్

ట్రయంఫ్ రాకెట్ 3 జిటి 221 స్పెషల్ ఎడిషన్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ఎనుక భాగంలో ఫుల్లీ అడ్జస్టబుల్ మోనోషాక్ మరియు ముందు భాగంలో USD షోవా కాట్రిడ్జ్ ఫోర్క్‌యూ ఉంటాయి.

భారత్‌లో రూ. 21.40 లక్షల బైక్ విడుదల: పుల్ డీటైల్స్

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, బ్రెంబో స్టైల్మా ఫోర్-పిస్టన్ రేడియల్ మోనోబ్లాక్ కాలిపర్‌లు ముందు భాగంలో ట్విన్ 320 మిమీ ఫ్లోటింగ్ డిస్క్‌లు మరియు వెనుకవైపు 300 మిమీ సింగిల్ డిస్క్‌ బ్రెంబో M4.32 ఫోర్-పిస్టన్ మోనోబ్లాక్ కాలిపర్‌ల ఉంటాయి. అదే సమయంలో వీల్స్ తేలికైన కాస్ట్ అల్యూమినియం మరియు అవాన్ కోబ్రా క్రోమ్ టైర్‌లతో అమర్చబడి ఉంటాయి. ఈ బైక్ లో కార్నరింగ్ ఏబీఎస్ మరియు కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉన్నాయి.

భారత్‌లో రూ. 21.40 లక్షల బైక్ విడుదల: పుల్ డీటైల్స్

ట్రయంఫ్ రాకెట్ 3 జిటి 221 స్పెషల్ ఎడిషన్ నాలుగు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి రోడ్, రెయిన్, స్పోర్ట్ మరియు రైడర్ మోడ్. ఈ బైక్‌లో TFT స్క్రీన్, హిల్ హోల్డ్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఇగ్నిషన్ మరియు కీలెస్ స్టీరింగ్ లాక్, అలాగే సీటు కింద USB ఛార్జింగ్ సాకెట్ వంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా బైక్ రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటాయి.

భారత్‌లో రూ. 21.40 లక్షల బైక్ విడుదల: పుల్ డీటైల్స్

ఇదిలా ఉండగా కంపెనీ ట్రైయంప్ ఎట్టకేలకు తన కొత్త ట్రైయంప్ బోన్‌విల్ గోల్డ్ లైన్ ఎడిషన్ విడుదల చేసింది. ఇది మొత్తం 5 మోడల్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి 'బోన్‌విల్ టి100, బోన్‌విల్ టి120, బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్, బోన్‌విల్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ మరియు బోన్‌విల్ బాబర్' మోడల్స్. ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. కావున వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని ఇస్తాయి.

Most Read Articles

English summary
Triumph motorcycles launched new rocket 3 221 special edition in india details
Story first published: Tuesday, December 21, 2021, 16:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X