Speed Triple 1200 RR ఆవిష్కరించిన Triumph; డిజైన్ & వివరాలు

బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ Triumph Motorcycle (ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్) సరికొత్త 2022 Triumph Speed Triple 1200 RR (ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఆర్) బైక్ ఆవిష్కరించింది. కంపెనీ ఈ కొత్త బైక్ వెల్లడించడంతో తన స్పీడ్ ట్రిపుల్ ఫ్యామిలీని మరింత విస్తరించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ బైక్ త్వరలో విడుదలకు సిద్ధం కానుంది. ఈ కొత్త లగ్జరీ బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Speed Triple 1200 RR ఆవిష్కరించిన Triumph; డిజైన్ & వివరాలు

కొత్త Speed Triple 1200 RR బైక్ ప్రస్తుతం ఉన్న న్యాక్డ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్‌ఎస్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా మరియు చాలా స్టైలిష్ గా ఉంటుంది. కంపెనీ ఈ బైక్‌లో చాలా మార్పులు చేసింది మరియు దీనికి పూర్తిగా భిన్నమైన రూపాన్ని ఇచ్చింది.

Speed Triple 1200 RR ఆవిష్కరించిన Triumph; డిజైన్ & వివరాలు

Speed Triple 1200 RR బైక్ లో Speed Triple 1200 RS బైక్ లోని 160 సిసి, ఇన్‌లైన్ 3-సిలిండర్ ఇంజిన్ ఉపయోగించబడింది. ఈ ఇంజిన్ 178 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. కావున ఈ బైక్ మంచి పర్ఫామెన్స్ అందించేలా తయారుచేయబడింది.

Speed Triple 1200 RR ఆవిష్కరించిన Triumph; డిజైన్ & వివరాలు

ఈ కొత్త Triumph Speed Triple 1200 RR బైక్ కంపెనీ లేటెస్ట్ కేఫ్ రేసర్‌గా డిజైన్ చేసింది, కావున ఇది చాలా దూకుడుగా కనిపిస్తుంది. కంపెనీ యొక్క స్పీడ్ ట్రిపుల్ 1200 RS బైక్ తో పోలిస్తే కొత్త Speed Triple 1200 RR బైక్ చాలా అధునాతనంగా కనిపిస్తుంది.

Speed Triple 1200 RR ఆవిష్కరించిన Triumph; డిజైన్ & వివరాలు

ఈ కొత్త Triple 1200 RR బైక్ లో సింగిల్ రౌండ్ హెడ్‌లైట్ ఉంది ఇది బైక్ కి ఒక కొత్త రూపాన్ని అందిస్తుంది. దీనిని స్పీడ్ ట్రిపుల్ 1200 RS యొక్క ట్విన్ హెడ్‌ల్యాంప్స్ యూనిట్ ద్వారా భర్తీ చేసింది. ఇది కాకుండా, బైక్ క్లియర్-ఆన్ హ్యాండిల్‌బార్లు మరియు స్పోర్టియర్ మరియు మరింత ఫార్వర్డ్ లీనింగ్ రైడింగ్ పొజిషన్ కోసం రియర్ ఫుట్‌పెగ్‌లను కూడా పొందుతుంది.

Speed Triple 1200 RR ఆవిష్కరించిన Triumph; డిజైన్ & వివరాలు

Speed Triple 1200 RR బైక్ లో కంపెనీ ఓహ్లిన్స్ స్మార్ట్ EC 2.0 ఎలక్ట్రానిక్‌ అడ్జస్టబుల్ సెమీ యాక్టివ్ సిస్టమ్‌తో సస్పెన్షన్‌ను అప్‌గ్రేడ్ చేసింది. కావున ముందు మరియు వెనుక సస్పెన్షన్ రెండూ కూడా పూర్తిగా సర్దుబాటు చేయబడతాయి. అంతే కాకుండా సెమీ యాక్టివ్ సిస్టమ్ రైడింగ్ స్టైల్, స్పీడ్ మరియు యాక్సిలరేషన్‌కి సరిపోయేలా కంప్రెషన్ మరియు రీబౌండ్ డంపింగ్‌ను అడ్జస్ట్ చేస్తుంది.

Speed Triple 1200 RR ఆవిష్కరించిన Triumph; డిజైన్ & వివరాలు

ఈ కొత్త బైక్ లోని 17 ఇంచెస్ కాస్ట్ అల్యూమినియం వీల్స్ దీనిని Speed Triple 1200 RS బైక్ లాగా చూపిస్తాయి. కానీ ఈ కొత్త బైక్ ఇప్పుడు పిరెల్లి డయాబ్లో సూపర్‌కోర్సా SP V3 టైర్‌లను ఉపయోగిస్తుంది. కావున ఇది రోడ్డుపై మంచి పట్టును అందిస్తుంది, కావున బైక్ రైడర్ కి మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

Speed Triple 1200 RR ఆవిష్కరించిన Triumph; డిజైన్ & వివరాలు

Speed Triple 1200 RR బైక్ లోని బ్రేకింగ్ సిస్టం విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో 320 మిమీ ట్విన్ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 220 మిమీ సింగిల్ డిస్క్ బ్రేక్ కలిగి ఉంది. ఇది వేగంలో కూడా ఈ బైక్ ను కంట్రోల్ చేయవచ్చు. Speed Triple 1200 RR యొక్క సీటు ఎత్తు 830 మి.మీ వద్ద ఉంచబడింది.

Speed Triple 1200 RR ఆవిష్కరించిన Triumph; డిజైన్ & వివరాలు

ఈ కొత్త బైక్ లోని 1160 సిసి ఇంజిన్ 10,750 ఆర్‌పిఎమ్ వద్ద 178 బిహెచ్‌పి పవర్ మరియు 9,250 ఆర్‌పిఎమ్ వద్ద 125 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు బైకుల ఎగ్సాస్ట్ సిస్టమ్ ఒకటే, అయితే స్పీడ్ ట్రిపుల్ 1200 RR బ్రష్ చేసిన స్టెయిన్ లెస్ స్టీల్ సైలెన్సర్ మరియు బ్లాక్ ఎండ్ క్యాప్స్ తో వస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ మరియు స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో జతచేయబడింది.

Speed Triple 1200 RR ఆవిష్కరించిన Triumph; డిజైన్ & వివరాలు

స్పీడ్ ట్రిపుల్ 1200 RR ఐదు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది IMU ని కూడా పొందుతుంది. ఇందులో ఏబీఎస్ స్విచబుల్ కార్నర్ ట్రాక్షన్ కంట్రోల్, అధునాతన ఫ్రంట్ వీల్ లిఫ్ట్ కంట్రోల్ మరియు ఫుల్లీ అడ్జస్టబుల్ క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.

Speed Triple 1200 RR ఆవిష్కరించిన Triumph; డిజైన్ & వివరాలు

Triumph Motorcycle ఈ కొత్త బైక్ ని భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం లేదు. కానీ కంపెనీ దేశంలో అనేక మోడళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దేశంలో అనేక మోడళ్లను విడుదల చేయడం ద్వారా కంపెనీ తన ఉనికిని విస్తరించనుంది.

Most Read Articles

English summary
Triumph motorcycles unveiled speed triple 1200 rr find here all details
Story first published: Wednesday, September 15, 2021, 16:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X