ఫేమ్ II ఇన్సెంటివ్ రివిజన్: రూ.11,250 తగ్గిన టీవీఎస్ ఐక్యూబ్ ఈవీ ధర

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఐక్యూబ్' ధరను భారీగా తగ్గించింది. ఫేమ్ II ఇన్సెంటివ్ రివిజన్‌లో భాగంగా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను రూ.11,250 మేర తగ్గించారు.

ఫేమ్ II ఇన్సెంటివ్ రివిజన్: రూ.11,250 తగ్గిన టీవీఎస్ ఐక్యూబ్ ఈవీ ధర

తాజా ధరల తగ్గింపు అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.01 లక్షలు (ఆన్-రోడ్)గా ఉంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గానూ భారత సర్కార్ ఫేమ్ ( ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (హైబ్రిడ్) ఎలక్ట్రిక్) అనే పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఫేమ్ II ఇన్సెంటివ్ రివిజన్: రూ.11,250 తగ్గిన టీవీఎస్ ఐక్యూబ్ ఈవీ ధర

ప్రస్తుతం దేశంలో ఫేమ్ ప్రాజెక్ట్ యొక్క రెండవ దశ కొనసాగుతోంది. ఈ ఫేమ్ IIలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లకు భారత ప్రభుత్వం ఆయా వాహనాల ధరలో సబ్సిడీని అందిస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్ ప్రస్తుతం బెంగుళూరు మరియు ఢిల్లీ నగరాల్లో మాత్రమే అమ్ముడవుతోంది. ఈ రెండు నగరాల్లా దీని ధరలు ఇలా ఉన్నాయి:

-> ఢిల్లీలో టీవీఎస్ ఐక్యూబ్ ధర : రూ.1.01 లక్షలు

-> బెంగుళూరులో టీవీఎస్ ఐక్యూబ్ ధర : రూ.1.10 లక్షలు

(*పైన పేర్కొన్న రెండు ధరలు ఆయా నగరాల్లో ఆన్-రోడ్ ధరలు)

ఫేమ్ II ఇన్సెంటివ్ రివిజన్: రూ.11,250 తగ్గిన టీవీఎస్ ఐక్యూబ్ ఈవీ ధర

ఈ ధరలో 3-సంవత్సరాల లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ (ఏది ముందు ముగిస్తే అది), లైఫ్‌టైంస్మార్ట్‌కనెక్ట్ బేసిక్ ఫీచర్లు, 1 సంవత్సరం రోడ్-సైడ్ అసిస్టెన్స్, స్టాండర్డ్ యాక్ససరీలు, ఆన్-బోర్డు ఛార్జర్ మరియు 1 సంవత్సరం స్మార్ట్‌కనెక్ట్ అడ్వాన్స్ చందా కలిసి ఉన్నాయి. సులభంగా తిరిగి చెల్లించే ఈఎమ్ఐ ఆప్షన్లతో కూడా కంపెనీ ఈ స్కూటర్‌ను అందిస్తోంది.

ఫేమ్ II ఇన్సెంటివ్ రివిజన్: రూ.11,250 తగ్గిన టీవీఎస్ ఐక్యూబ్ ఈవీ ధర

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇందులో 4.4 కిలోవాట్ల హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. స్కూటర్‌లో అమర్చిన 3 లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ల సాయంతో ఈ ఎలక్ట్రిక్ మోటార్ పనిచేస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. పూర్తి చార్జ్‌పై ఈ స్కూటర్ 80 కిలోమీటర్ల రేంజ్‌ను (ఎకో మోడ్‌లో) ఆఫర్ చేస్తుంది.

ఫేమ్ II ఇన్సెంటివ్ రివిజన్: రూ.11,250 తగ్గిన టీవీఎస్ ఐక్యూబ్ ఈవీ ధర

ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 4.2 సెకన్లలో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఇందులోని బ్యాటరీలను 0 నుండి 75 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయటానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతుంది.

ఫేమ్ II ఇన్సెంటివ్ రివిజన్: రూ.11,250 తగ్గిన టీవీఎస్ ఐక్యూబ్ ఈవీ ధర

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడి టైయిల్ లైట్స్, పెద్ద టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, క్యూ-పార్క్ అసిస్ట్, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను జత చేయడానికి బ్రాండ్ యొక్క స్మార్ట్ కనెక్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది.

ఫేమ్ II ఇన్సెంటివ్ రివిజన్: రూ.11,250 తగ్గిన టీవీఎస్ ఐక్యూబ్ ఈవీ ధర

మొబైల్ యాప్ సాయంతో స్కూటర్‌కు సంబంధించిన అనేక విషయాలను స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకోవటం మరియు వాటిని కంట్రోల్ చేయటం చేయవచ్చు. ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ప్రవేశించిన టీవీఎస్ ఐక్యూబ్, ఈ విభాగంలో ఏథర్ 450ఎక్స్, బజాజ్ చేతక్ ఈవీ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

ఫేమ్ II ఇన్సెంటివ్ రివిజన్: రూ.11,250 తగ్గిన టీవీఎస్ ఐక్యూబ్ ఈవీ ధర

ఇదివరకు చెప్పుకున్నట్లుగా టీవీఎస్ ఐక్యూబ్ ప్రస్తుతం బెంగుళూరు, ఢిల్లీ నగరాల్లో మాత్రమే లభిస్తోంది. కాగా, ఈ మోడల్ అమ్మకాలను దేశవ్యాప్తంగా 20 నగరాలకు విస్తరించడానికి టీవీఎస్ సన్నద్ధమవుతోంది. ఇందులో ముంబై, చెన్నై, పూణే, హైదరాబాద్, అహ్మదాబాద్ మరియు కోల్‌కతా నగరాలు కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
TVS iQube Electric Scooter Price Reduced By Rs 11,250 After Fame II Subsidy, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X