దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త TVS Jupiter 125; ధర రూ. 73,400

ప్రముఖ వాహన తయారు సంస్థ అయిన TVS కంపెనీ దేశీయ మార్కెట్లో తాజాగా కొత్త Jupiter 125 స్కూటర్ విడుదల చేసింది. భారత మార్కెట్లో విడుదలైన కొత్త TVS Jupiter 125 ధర రూ. 73,400. ఈ కొత్త స్కూటర్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ కొత్త TVS Jupiter 125 గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త TVS Jupiter 125; ధర రూ. 73,400

కొత్త TVS Jupiter 125 మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి డ్రమ్, డ్రమ్ అల్లాయ్ మరియు డిస్క్ వేరియంట్లు. ఈ కొత్త స్కూటర్ 125 సిసి ఇంజిన్, మొబైల్ ఛార్జర్, 33-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్ కెపాసిటీ, TVS IntelliGo టెక్నాలజీ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త TVS Jupiter 125; ధర రూ. 73,400

ఈ కొత్త స్కూటర్ లో ఎల్ ఈడీ హెడ్‌లైట్, ఆకర్షణీయమైన టెయిల్ లైట్ మరియు గ్రాఫ్ రైల్ రిఫ్లెక్టర్ వంటివి ఉన్నాయి. ఇందులో కంపెనీ యొక్క 3D లోగో ఇవ్వబడింది మరియు లోపలి ప్యానెల్‌పై ప్రీమియం పెయింట్ కూడా ఉంది. డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ దాని డిస్క్ వేరియంట్‌లో ఇవ్వబడ్డాయి. ఇవన్నీ కూడా స్కూటర్ యొక్క యొక్క మొత్తం రూపాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త TVS Jupiter 125; ధర రూ. 73,400

ఈ స్కూటర్ ముందు భాగంలో మొబైల్ ఛార్జర్ మరియు ఫ్యూయెల్ ఫిల్లర్ వంటివి ఉన్నాయి. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ స్కూటర్ కి సైడ్ స్టాండ్ ఇండికేటర్ మరియు ఇంజిన్ ఇన్హిబిటర్ ఇవ్వబడింది. దీనితో పాటు, ముందు మంచి లెగ్ స్పేస్ ఇవ్వబడింది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త TVS Jupiter 125; ధర రూ. 73,400

కొత్త జుపీటర్ 125 స్కూటర్ ఈ విభాగంలో అతి పెద్ద సీటుని కలిగి ఉంది. అంతే కాకుండా దీనికి 33 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న సెగ్మెంట్‌లో అత్యధిక స్టోరేజ్ కెపాసిటీ ఇవ్వబడిందని కంపెనీ పేర్కొంది. ఇందులో రెండు హెల్మెట్స్ ఉంచడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ స్కూటర్‌లో ఎకోట్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ ఇవ్వబడింది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త TVS Jupiter 125; ధర రూ. 73,400

TVS జూపిటర్ 125 లో సింగిల్ సిలిండర్ 124.8 సిసి ఇంజిన్ ఉంది, ఇది 6 కిలోవాట్ పవర్ మరియు 10.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది సెమీ డిజిటల్ స్పీడోమీటర్ కలిగి ఉంది, ఇది స్మార్ట్ వార్ణింగ్స్, మైలేజ్, రియల్ టైమ్ మైలేజ్ వంటి సమాచారాన్ని అందిస్తుంది. ఇందులో రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి బాడీ బ్యాలెన్స్ టెక్నాలజీ ఇవ్వబడింది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త TVS Jupiter 125; ధర రూ. 73,400

TVS తన విభాగంలో అత్యంత ఇంధన సామర్థ్యం మరియు వేగవంతమైన స్కూటర్ అని పేర్కొంది. సస్పెన్షన్ కోసం, ఈ స్కూటర్ ముందు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు కాయిల్ స్ప్రింగ్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం, ముందు మరియు వెనుక డ్రమ్ బ్రేకులు ప్రామాణికంగా అందించబడ్డాయి. అయితే వినియోగదారులు డిస్క్ మరియు డ్రమ్ అల్లాయ్స్ కూడా ఎంచుకోవచ్చు. అయితే దీని ధర కాంత్ పెరిగే అవకాశం ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త TVS Jupiter 125; ధర రూ. 73,400

ఇటీవల కంపెనీ తన జుపీటర్ 110 సిసి మోడల్ ధరను పెంచింది. ఈ స్కూటర్ ఐదు వేరియంట్లలో వస్తుంది, కావున ప్రతి వేరియంట్ ధర వేరుగా ఉంటుంది. ఇందులో కంపెనీ తన స్టాండర్డ్ వేరియంట్‌పై రూ. 736 మరియు ZX టాప్ ట్రిమ్‌ వేరియంట్ పై రూ. 2,336 పెంచింది.

జుపిటర్ వేరియంట్ యొక్క కొత్త ధర ఇప్పుడు రూ. 65,673 వద్ద ఉండగా, స్టాండర్డ్ మోడల్ ధర రూ .67,398 కి పెరిగింది. జుపిటర్ ZX డ్రమ్ మరియు ZX డిస్క్ ట్రిమ్‌ల కొత్త ధర వరుసగా రూ. 71,973 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మరియు రూ .75,773, క్లాసిక్ మోడల్ ఇప్పుడు రూ .75,743 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కి అందుబాటులో ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త TVS Jupiter 125; ధర రూ. 73,400

టీవీఎస్ జూపిటర్ 110 సిసి స్కూటర్లలో ఒకటి. ఇది 109.7 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది, ఇది 7.37 బిహెచ్‌పి పవర్ మరియు 8.4 న్యూటన్ మీటర్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టీవీఎస్ జూపిటర్ 110 సిసి మోడల్ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, కంపెనీ కొత్త 125 సిసి మోడల్‌ని విడుదల చేసింది. అయితే ఈ వేరియంట్ దేశీయ మార్కెట్లో ఎటువంటి ఆదరణ పొందుతుందో వెచ్చి చూడాలి.

ఇటీవల మేము TVS Jupiter 125 స్కూటర్ టెస్ట్ రైడ్ చేశాము. దీనికి సంబందించిన మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Tvs jupiter 125 launched in india price rs 73400 features engine details
Story first published: Thursday, October 7, 2021, 19:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X