కొత్త ఫీచర్‌తో విడుదలైన టీవీఎస్ జుపిటర్ ; పూర్తి వివరాలు

భారత మార్కెట్లో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్, తన బ్రాండ్ యొక్క అత్యధిక అమ్మకాలు చేపడుతున్న మోడల్ జుపిటర్ స్కూటర్‌ను ఇంటెల్లిగో ఫీచర్‌తో విడుదల చేసింది. ఇప్పుడు టీవీఎస్ జుపిటర్ ఇంటెల్లిగోను 72,347 రూపాయల (ఎక్స్-షోరూమ్) ధరతో ప్రవేశపెట్టారు. ఈ ఫీచర్ టీవీఎస్ జుపిటర్ యొక్క టాప్ డిస్క్ వేరియంట్ అయిన జెడ్ఎక్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

కొత్త ఫీచర్‌తో విడుదలైన టీవీఎస్ జుపిటర్ ; పూర్తి వివరాలు

టీవీఎస్ ఇంటెల్లిగో అనేది స్కూటర్ స్టార్ట్ లో ఉన్నప్పుడు ఇంజిన్‌ను ఆపివేసి క్లచ్ నొక్కిన వెంటనే దాన్ని ప్రారంభించే స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్. ఈ ఫీచర్‌తో స్కూటర్ ఇంధనాన్ని ఆదా చేస్తుందని, లాంగ్ ట్రిప్స్‌లో చాలా ఇంధనాన్ని ఆదా చేయడం ద్వారా మైలేజ్ కూడా పెరుగుతుందని టీవీఎస్ తెలిపింది.

కొత్త ఫీచర్‌తో విడుదలైన టీవీఎస్ జుపిటర్ ; పూర్తి వివరాలు

స్టార్ లైట్ మరియు రాయల్ వైన్ కలర్ ఆప్షన్లలో జుపిటర్ ఇంటెలిగో ప్రవేశపెట్టబడింది. ఈ ఫీచర్‌ను ఆన్ మరియు ఆఫ్ చేసే సౌకర్యం కూడా స్కూటర్‌లో ఉంది. టీవీఎస్ ఇంటెల్లిగోలో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, మొబైల్ ఛార్జర్, 2-లీటర్ గ్లోవ్ బాక్స్, 21-లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ మరియు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటివి ఉన్నాయి.

MOST READ:ఆటోమొబైల్ పరిశ్రమపై కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్ ; ఎలా ఉందో తెలుసా..!

కొత్త ఫీచర్‌తో విడుదలైన టీవీఎస్ జుపిటర్ ; పూర్తి వివరాలు

ఈ స్కూటర్ సస్పెన్షన్ సెటప్‌ను అడ్జస్టబుల్ చేసే ఫీచర్ కూడా కలిగి ఉంది, ఇది మీ ఇష్టానుసారంగా అడ్జస్ట్ చేయవచ్చు. ఈ ఫీచర్ వాహనదారులకు చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్స్ ప్రవేశపెట్టిన తర్వాత మునుపటిలాగే మంచి అమ్మకాలను కొనసాగించే అవకాశం ఉంది.

కొత్త ఫీచర్‌తో విడుదలైన టీవీఎస్ జుపిటర్ ; పూర్తి వివరాలు

టీవీఎస్ జుపిటర్ ఇంటెల్లిగో 110 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 8.4 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పాత మోడల్ కంటే బిఎస్ 6 టివిఎస్ జుపిటర్ 15 శాతం ఎక్కువ ఇంధనాన్ని ఆదా చేస్తుందని, ఇంకా ఇది మునుపటి కంటే మరింత స్థిరంగా మరియు బలంగా ఉందని కంపెనీ పేర్కొంది.

MOST READ:2021 కేంద్ర బడ్జెట్‌లో చేరిన వెహికల్ స్క్రాపింగ్ సిస్టం ; పూర్తి వివరాలు

కొత్త ఫీచర్‌తో విడుదలైన టీవీఎస్ జుపిటర్ ; పూర్తి వివరాలు

టీవీఎస్ మోటార్స్ ఇటీవల 2021 జనవరి అమ్మకాల నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2021 జనవరి నెలలో 2,94,596 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. ఇది జనవరి 2020 అమ్మకాల కంటే 34 శాతం ఎక్కువ. 2020 జనవరిలో కంపెనీ 2,20,439 యూనిట్ల ద్విచక్ర వాహనాన్ని మాత్రమే విక్రయించింది.

కొత్త ఫీచర్‌తో విడుదలైన టీవీఎస్ జుపిటర్ ; పూర్తి వివరాలు

టీవీఎస్ త్రీ వీలర్ సెగ్మెంట్ విషయానికి వస్తే, జనవరి 2021 లో కంపెనీ 12,553 యూనిట్ల వాహనాలను విక్రయించింది. గత ఏడాది జనవరిలో 14,481 మూడు చక్రాల అమ్మకాలు జరిగాయి. వార్షిక గణాంకాలను పరిశీలిస్తే, త్రీ వీలర్ అమ్మకాలు మునుపటికంటే ఇప్పుడు 13.3 శాతం తగ్గాయి.

MOST READ:పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలకు చెక్ పెట్టాలంటే, ఇలా చేయండి

కొత్త ఫీచర్‌తో విడుదలైన టీవీఎస్ జుపిటర్ ; పూర్తి వివరాలు

టీవీఎస్ ఇటీవల తన అపాచీ సిరీస్ బైక్‌ల ధరలను పెంచినట్లు ప్రకటించింది. కంపెనీ తన అపాచీ సిరీస్ ధరను ఇప్పుడు రూ. 1,520 నుండి రూ. 3 వేల వరకు పెంచింది. అపాచీ సిరీస్‌లో అపాచీ ఆర్టీఆర్ 160, అపాచీ ఆర్టీఆర్ 180, అపాచీ ఆర్టీఆర్ 160 4 వి, అపాచీ ఆర్టీఆర్ 200 4 వి, అపాచీ ఆర్టీఆర్ 310 ను కంపెనీ విక్రయిస్తోంది.

కొత్త ఫీచర్‌తో విడుదలైన టీవీఎస్ జుపిటర్ ; పూర్తి వివరాలు

టీవీఎస్ ఇటీవల తన ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్‌ను బెంగళూరు నుంచి విడుదల చేసింది. సంస్థ త్వరలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో టీవీఎస్ ఐక్యూబ్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. టీవీఎస్ ఐక్యూబ్ జనవరి 2020 లో ప్రారంభించబడింది. ఇది సంస్థ యొక్క మొదటి పర్ఫామెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్. భారతదేశంలో, ఈ స్కూటర్ బజాజ్ చేతక్ మరియు ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది.

MOST READ:ఒకప్పుడు చరిత్ర సృష్టించిన జాగ్వార్ సి-టైప్, మళ్ళీ రానుందా..?

Most Read Articles

English summary
TVS Jupiter Launched With IntelliGO Feature. Read in Telugu.
Story first published: Wednesday, February 3, 2021, 9:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X