టీవీఎస్ ఎక్స్ఎల్100 కొత్త పేమెంట్ ప్లాన్; రోజుకి కేవలం రూ.49 మాత్రమే!

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోపెడ్ 'టీవీఎస్ ఎక్స్‌ఎల్100' కోసం కంపెనీ ఓ ప్రత్యేకమైన పేమెంట్ స్కీమ్‌ను ప్రకటించింది. ఆసక్తిగల కస్టమర్లు ఇప్పుడు ఈ మోపెడ్‌ను కేవలం రోజుకు రూ.49 ఖర్చుతో సొంతం చేసుకోవచ్చు.

టీవీఎస్ ఎక్స్ఎల్100 కొత్త పేమెంట్ ప్లాన్; రోజుకి కేవలం రూ.49 మాత్రమే!

టీవీఎస్ ఎక్స్‌ఎల్100 మల్టీ-యుటిలిటీ వెహికల్‌ను కంపెనీ వీలైనంత ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ చేసేందుకు గానూ తక్కువ ఖర్చుతో కూడిన పథకాన్ని ప్రారంభించింది. సరసమైన మొబిలిటీ సొల్యూషన్స్‌ను అందించే దిశగా టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది.

టీవీఎస్ ఎక్స్ఎల్100 కొత్త పేమెంట్ ప్లాన్; రోజుకి కేవలం రూ.49 మాత్రమే!

వినియోగదారులు ఇప్పుడు టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 ఐ-టచ్‌స్టార్ట్ వేరియంట్‌ను రోజుకు రూ.49 ఖర్చుతో సొంతం చేసుకోవచ్చు. అంటే, వినియోగదారులు సగటున రోజుకి రూ.49 చొప్పున, 30 రోజులకు గానూ నామమాత్రపు ధర వద్ద ప్రతినెలా రూ.1,470 ఈఎంఐతో ఈ మోపెడ్‌ను సొంతం చేసుకోవచ్చు.

టీవీఎస్ ఎక్స్ఎల్100 కొత్త పేమెంట్ ప్లాన్; రోజుకి కేవలం రూ.49 మాత్రమే!

రోజుకి రూ.49 అనేది ఈ మోపెడ్ కోస్ అయ్యే ఖర్చు మాత్రమే. ఇది రోజువారీ సేకరణ లేదా తిరిగి చెల్లించడం కలిగి ఉండదు, ఎందుకంటే వినియోగదారులు నెలవారీ ఈఎంఐని మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. టీవీఎస్ తమ కస్టమర్ల కోసం సరసమైన ధరకే పర్సనల్ మొబిలిటీని అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

టీవీఎస్ ఎక్స్ఎల్100 కొత్త పేమెంట్ ప్లాన్; రోజుకి కేవలం రూ.49 మాత్రమే!

కంపెనీ ఇందుకోసం టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టి మరియు ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ వంటి ఫైనాన్షియర్లతో కంపెనీ సహకరిస్తోంది మరియు ఇదే ఇఎమ్ఐని నాలుగు వేర్వేరు పదవీకాలంలో పొందవచ్చు. టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 కస్టమర్-ఫ్రెండ్లీ పథకాలైన ‘ఇప్పుడు కొనండి తర్వాత చెల్లించండి', ‘తక్కువ డౌన్ పేమెంట్ రూ. 7,999' మరియు ‘తక్కువ వడ్డీ రేటు రూ. 7.99% '.

టీవీఎస్ ఎక్స్ఎల్100 కొత్త పేమెంట్ ప్లాన్; రోజుకి కేవలం రూ.49 మాత్రమే!

గత కొన్ని సంవత్సరాలుగా, టీవీఎస్ ఎక్స్‌ఎల్100 బలమైన నిర్మాణం కలిగిన మరియు మల్టీ-యుటిలిటీ సామర్ధ్యంతో పాటుగా డబ్బుకు తగిన విలువను కలిగిన ఉన్న మోపెడ్‌గా మార్కెట్లో కొనసాగుతోంది. చిన్న తరహా వ్యాపార యజమానులు, వ్యాపారులు మరియు రైతులకు ఇది అనువైన ద్విచక్ర వాహనంగా మారింది.

టీవీఎస్ ఎక్స్ఎల్100 కొత్త పేమెంట్ ప్లాన్; రోజుకి కేవలం రూ.49 మాత్రమే!

ఈ కొత్త తరం టీవీఎస్ ఎక్స్ఎల్100 ఈజీ ఆన్-ఆఫ్ స్విచ్, ఆప్షనల్ యుఎస్‌బి ఛార్జర్ మరియు సౌకర్యవంతమైన రైడ్ అనుభవం వంటి కస్టమర్ ఫ్రెండ్లీ ఫీచర్ల కారణంగా ఈ వాహనం ఆఫీసులకు వెళ్ళేవారు, మహిళా రైడర్లు మరియు సీనియర్ వ్యక్తులకు అనుకూలంగా ఉంది.

టీవీఎస్ ఎక్స్ఎల్100 కొత్త పేమెంట్ ప్లాన్; రోజుకి కేవలం రూ.49 మాత్రమే!

టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (ఇటి-ఫై) టెక్నాలజీతో వస్తుంది, ఇది 15 శాతం ఎక్కువ మైలేజీని ఆఫఱ్ చేస్తుంది. ఇందులోని ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ఐఎస్‌జి) వ్యవస్థ కారణంగా సున్నితమైన మరియు నిశ్శబ్దమైన ఇంజన్ స్టార్ట్ లభిస్తుంది.

టీవీఎస్ ఎక్స్ఎల్100 కొత్త పేమెంట్ ప్లాన్; రోజుకి కేవలం రూ.49 మాత్రమే!

ఈ మోపెడ్‌లో ఉపయోగించిన 99.7 సిసి ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 3.20 కిలోవాట్ (4.3 బిహెచ్‌పి) శక్తిని మరియు 3500 ఆర్‌పిఎమ్ వద్ద 6.5 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇదొక ఆటోమేటిక్ మోపెడ్, ఇందులో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉండదు.

టీవీఎస్ ఎక్స్ఎల్100 కొత్త పేమెంట్ ప్లాన్; రోజుకి కేవలం రూ.49 మాత్రమే!

ప్రస్తుతం మార్కెట్లో టీవీఎస్ ఎక్స్‌ఎల్100 ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అవి: టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 హెవీ డ్యూటీ కిక్‌స్టార్ట్, టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 హెవీ డ్యూటీ ఐ-టచ్‌స్టార్ట్, టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 హెవీ డ్యూటీ ఐ-టచ్‌స్టార్ట్* విన్ ఎడిషన్, టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 కంఫర్ట్ కిక్‌స్టార్ట్ మరియు టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 కంఫర్ట్ ఐ-టచ్‌స్టార్ట్*.

టీవీఎస్ ఎక్స్ఎల్100 కొత్త పేమెంట్ ప్లాన్; రోజుకి కేవలం రూ.49 మాత్రమే!

ఇటీవల ప్రారంభించిన టీవీఎస్ ఎక్స్‌ఎల్100 హెవీ డ్యూటీ ఐ-టచ్‌స్టార్ట్* విన్ ఎడిషన్ డిలైట్ బ్లూ మరియు బీవర్ బ్రౌన్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో టీవీఎస్ ఎక్స్ఎల్100 ప్రారంభ ధర రూ.41,220 (చెన్నై ఎక్స్ షోరూమ్)గా ఉంది.

Most Read Articles

English summary
TVS Motor Company Announced New Payment Plan For XL100, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X