Husqvarna నుంచి రానున్న మూడు కొత్త బైకులు, ఇవే.. మీరూ చూడండి

స్వీడన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ హస్క్‌వర్ణ (Husqvarna) అంతర్జాతీయ మార్కెట్‌ కోసం ఎప్పటికప్పుడు తన లైనప్‌ను విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ మూడు నేకెడ్ మోటార్‌సైకిళ్లను వెల్లడించింది. ఇందులో హస్క్‌వర్నా స్వర్ట్‌పిలెన్ 125 (Husqvarna Svartpilen 125), హస్క్‌వర్నా స్వర్ట్‌పిలెన్ 401 (Husqvarna Svartpilen 401) మరియు హస్క్‌వర్నా విట్పిలెన్ 401 (Husqvarna Vitpilen 401) ఉన్నాయి. ఈ కొత్త బైకుల గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Husqvarna నుంచి రానున్న మూడు కొత్త బైకులు, ఇవే.. మీరూ చూడండి

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఇప్పుడు వెల్లడించిన ఈ మూడు మోటార్‌సైకిళ్లను భారతదేశంలో మహారాష్ట్రలోని బజాజ్ ఆటో చకన్‌ ప్లాంట్ వద్ద ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. Husqvarna కంపెనీ స్వీడిష్ బ్రాండ్ అయిన కెటిఎమ్ మోటార్ సైకిల్స్ యొక్క అనుబంధ సంస్థ మరియు ఇది బజాజ్ ఆటో యొక్క భాగస్వామి కూడా. కంపెనీ వీటి ద్వారానే దేశీయ మార్కెట్లో తన అమ్మకాలను జరుపుతుంది.

Husqvarna నుంచి రానున్న మూడు కొత్త బైకులు, ఇవే.. మీరూ చూడండి

Husqvarna కంపెనీ ఇప్పుడు 2022 సంవత్సరానికి గాను ఈ మూడు బైకులలో స్టైలింగ్‌కు సంబంధించి సూక్ష్మమైన అప్‌డేట్‌లను తీసుకువచ్చింది. ఇందులోని అన్ని మోటార్ సైకిల్స్ అన్ని కూడా లేటెస్ట్ బాడీ గ్రాఫిక్ డిజైన్ పొందుతుంది. అంతే కాకూండా ఈ మోడల్‌లు తమ ఇంటీరియర్ మరియు రన్నింగ్ గేర్‌లన్నీ కూడా KTM మోటార్‌సైకిల్ మాదిరిగా ఉంటాయి.

Husqvarna నుంచి రానున్న మూడు కొత్త బైకులు, ఇవే.. మీరూ చూడండి

2022 హస్క్‌వర్నా స్వర్ట్‌పిలెన్ 125 (Husqvarna Svartpilen 125):

కంపెనీ మూడు మోటార్ సైకిల్స్ లో ఒకటైన 2022 హస్క్‌వర్నా స్వర్ట్‌పిలెన్ 125 విషయానికి వస్తే, ఇది కెటిఎమ్ శ్రేణి నుంచి RC 125 మరియు డ్యూక్ 125 వంటి భాగాలను తీసుకుంటుంది. అంతే కాకుండా.. ఇందులో అదే 125సిసి సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ ను పొందుతుంది. ఇది 14.3 బిహెచ్‌పి పవర్ మరియు 12 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

Husqvarna నుంచి రానున్న మూడు కొత్త బైకులు, ఇవే.. మీరూ చూడండి

Husqvarna Svartpilen 125 బైక్ లోని చాలా పరికరాలు కెటిఎమ్ బ్రాండ్ యొక్క కెటిఎమ్ 125 నుంచి తీసుకోబడ్డాయి. ఇది అప్సైడ్డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్‌తో ట్రేల్లిస్ ఫ్రేమ్‌ను మరియు వెనుక వైపున మోనో-షాక్ సస్పెన్షన్‌ వంటి వాటిని ఉపయోగిస్తుంది. కావున ఇది మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. బ్రేకింగ్ పరంగా సింగిల్-ఛానల్ ఏబీఎస్ తో కూడిన రియర్ డిస్క్ బ్రేకింగ్ సిస్టం పొందుతుంది.

Husqvarna నుంచి రానున్న మూడు కొత్త బైకులు, ఇవే.. మీరూ చూడండి

2022 హస్క్‌వర్నా స్వర్ట్‌పిలెన్ 401 & 2022 హస్క్‌వర్నా విట్పిలెన్ 401:

2022 Husqvarna Vitpilen 401 మరియు Svartpilen 401 విషయానికి వస్తే, ఇవి కెటిఎమ్ బ్రాండ్ కి చాలా వరకు భిన్నంగా ఉంటాయి. ఇందులో స్టైలింగ్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇది పూర్తిగా నేక్డ్ బాడీ స్టైల్‌ను ప్రదర్శిస్తుంది. 2022 హస్క్‌వర్నా స్వర్ట్‌పిలెన్ 401 & 2022 హస్క్‌వర్నా విట్పిలెన్ 401 రెండూ కూడా చాలా వరకు చూడటానికి ఒకే విధంగా ఉంటాయి. ఈ కారణంగానే వీటిని చూసినవెంటనే గుర్తించడం కొంత కష్టతరం అవుతుంది.

Husqvarna నుంచి రానున్న మూడు కొత్త బైకులు, ఇవే.. మీరూ చూడండి

అయితే కొన్ని చిన్న చిన్న తేడాలతో వీటిని తప్పకుండా వేరుగా గుర్తించవచ్చు. Svartpilen నేరుగా మరియు పొడవైన హ్యాండిల్‌బార్‌ను కలిగి ఉంది, అయితే Vitpilen తక్కువ-సెట్ క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్‌ను పొందుతుంది. అదే విధంగా Vitpilen బైక్ దాని Svartpilen బైక్ కంటే మంచి రైడింగ్ పొజిషన్ కలిగి ఉంటుంది. ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

Husqvarna నుంచి రానున్న మూడు కొత్త బైకులు, ఇవే.. మీరూ చూడండి

Svartpilen నాబీ డ్యూయల్-పర్పస్ పైరెల్లీ స్కార్పియన్ ర్యాలీ STR టైర్‌లను కలిగి ఉంటుంది. అదే విధంగా విట్పిలెన్ బైక్ రోడ్-బయాస్డ్ టైర్లను కలిగి ఉంటుంది. ఈ కారణంగా స్వర్ట్‌పిలెన్‌ను స్క్రాంబ్లర్ అని పిలుస్తారు, అయితే విట్‌పిలెన్‌ను స్ట్రీట్ నేకెడ్ కేఫ్ రేసర్‌గా పరిగణిస్తారు.

Husqvarna నుంచి రానున్న మూడు కొత్త బైకులు, ఇవే.. మీరూ చూడండి

ఇక 2022 హస్క్‌వర్నా స్వర్ట్‌పిలెన్ 401 & 2022 హస్క్‌వర్నా విట్పిలెన్ 401 యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఈ రెండూ కూడా 373 సిసి సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను పొందుతాయి. ఇవి 43 బిహెచ్‌పి పవర్ మరియు 37 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

Husqvarna నుంచి రానున్న మూడు కొత్త బైకులు, ఇవే.. మీరూ చూడండి

ఈ బైకుల యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, వీటి ముందు వైపు ఇన్వర్టెడ్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో-షాక్ సెటప్ ఉంటాయి. బ్రేకింగ్ సెటప్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. అదే విధంగా డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఇందులో అందుబటులో ఉంటుంది. రెండు మోటార్‌సైకిళ్లకు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు రైడ్-బై-వైర్ త్రాటల్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.

Husqvarna నుంచి రానున్న మూడు కొత్త బైకులు, ఇవే.. మీరూ చూడండి

మొత్తానికి హస్క్‌వర్నా యొక్క ఈ మూడు బైకులు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ఆధునిక డిజైన్ మరియు పరికరాలతో నిండి ఉండి, వాహన వినియోగదారులకు చాలా మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. అయితే ఇవి దేశీయ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతాయి మరియు ఎలాంటి ఆదరణ పొందుతాయి అనే విషయాలన్నీ కూడా త్వరలో తెలుస్తాయి.

Most Read Articles

English summary
2022 husqvarna svartpilen 125 svartpilen 401 and vitpilen 401 motorcycle debuts details
Story first published: Friday, February 4, 2022, 19:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X