మీరు ఇప్పుడూ చూడని కొత్త రకం 'బజాజ్ అవెంజర్'.. ఇక్కడ చూడండి

దేశీయ మార్కెట్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో భాగంగానే దాదాపు చాలా వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. అంతే కాకుండా కొన్ని సాధారణ బైకులు ఎలక్ట్రిక్ బైకులుగా మారుతున్నాయి. ఇలాంటి వాటికి సంబంధించిన చాలా విషయాలు మునుపటి కథనాల్లో చాలానే తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు బజాజ్ అవెంజర్ బ్యాటరీతో నడిచే ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

బజాజ్ అవెంజర్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్‌గా మారింది.. ఎలా అనుకుంటున్నారా..?

నివేదికల ప్రకారం, పెట్రోల్‌తో నడిచే ఒక బజాజ్ అవెంజర్ 220 క్రూయిజ్‌ బైక్ ఇప్పుడు బ్యాటరీతో నడిచే బైక్ గా రూపాంతరం చెందింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అందుబాటులో ఉంది. ఈ EV కన్వర్షన్ కిట్ GoGoA1 నుండి సేకరించబడింది, దీని ధర రూ. 27,760 మరియు ఆన్‌లైన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది.

బజాజ్ అవెంజర్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్‌గా మారింది.. ఎలా అనుకుంటున్నారా..?

ఈ బైక్ లో ఉపయోగించబడిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కన్వర్షన్ కిట్ 2000W, 17-ఇంచెస్ బ్రష్‌లెస్ హబ్ మోటార్‌ను ఉపయోగిస్తుంది. ఇది రీజెనరేటివ్ కంట్రోలర్, డిస్క్ విత్ క్యాచర్, మౌంటు ప్లేట్ మరియు కప్లర్ వంటి అంశాలతో వస్తుంది. ఈ బజాజ్ అవెంజర్‌లో చాలా తక్కువ మార్పులు చేయబడ్డాయి. ఇందులో 17-ఇంచెస్ ఫ్రంట్ వీల్ మినహా చాలా భాగాలు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉన్నాయి.

బజాజ్ అవెంజర్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్‌గా మారింది.. ఎలా అనుకుంటున్నారా..?

బ్రష్‌లెస్ హబ్ ఎలక్ట్రిక్ మోటార్ ఈ మోటార్‌సైకిల్‌లో అమర్చబడిన 17-ఇంచెస్ చక్రాలలో ఉపయోగించబడింది. అంతే కాకూండా బ్యాటరీ ప్యాక్‌ని తీసుకువెళ్లడానికి రియర్ ఫెండర్‌పై కొత్త మౌంటింగ్‌లు ఇన్‌స్టాల్ చేయబడ్డాయి. దీనితోపాటు హ్యాండిల్‌బార్‌కు కుడి వైపున ఒక చిన్న స్విచ్ ఉంది. ఇది రైడర్ పవర్‌ను ఆన్ చేయడానికి అనుమతిస్తుంది.

బజాజ్ అవెంజర్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్‌గా మారింది.. ఎలా అనుకుంటున్నారా..?

ఇందులో కొన్ని మాడిఫైడ్ చేయబడ్డాయి. ఇందులో హబ్ మోటార్‌తో పాటు కొత్త ఫ్రంట్ వీల్‌ను పొందుపరిచేలా ఫ్రంట్ ఫోర్క్‌లు పునరుద్ధరించబడ్డాయి. అంతే కాకుండా ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు కొత్త ఫ్రంట్ వీల్‌తో విజయవంతంగా సహకరించడానికి అనుకూలంగా మార్చారు.

బజాజ్ అవెంజర్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్‌గా మారింది.. ఎలా అనుకుంటున్నారా..?

ఇందులోని బ్యాటరీ ప్యాక్‌ను చిన్న మెటల్ బాక్స్‌లో సీల్ చేసి, దానిని కటింగ్ మరియు వెల్డింగ్ ద్వారా పొందుపరచడం జరిగింది. బ్యాటరీ రియర్ ఫెండర్ యొక్క మౌంట్‌పై అమర్చబడుతుంది. అలా చేయడానికి బైక్ యొక్క వెనుక మలుపు సూచికలను మళ్లీ ఇన్‌స్టాల్ చేయాలి.

బజాజ్ అవెంజర్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్‌గా మారింది.. ఎలా అనుకుంటున్నారా..?

ఇందులో ఇన్‌స్టాల్ చేయబడిన బ్యాటరీ విషయానికి వస్తే, ఈ మోటార్‌సైకిల్‌లో 72 వాట్ 35 యాంపియర్ లిథియం-అయాన్ ప్యాక్ ఉపయోగించబడింది. ఎలక్ట్రికల్ సిస్టమ్‌లో కొన్ని చిన్న మార్పులతో కంట్రోలర్‌ను అమర్చారు. చివరగా ఎలక్ట్రిక్ మోటారును నిమగ్నం చేయడానికి మరియు ఆఫ్ చేయడానికి అసలు స్విచ్ గేర్ దగ్గర ఒక స్విచ్ జోడించబడుతుంది.

బజాజ్ అవెంజర్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్‌గా మారింది.. ఎలా అనుకుంటున్నారా..?

మరోవైపు, ఈ బైక్ లో ఎలక్ట్రిక్ హబ్ మోటార్ ఫ్రంట్ వీల్‌లో అమర్చబడి ఉంటుంది. ఎలక్ట్రిక్ మోడ్‌లో, బజాజ్ అవెంజర్ 220 గరిష్టంగా 60 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. ఇందులో అమర్చిన బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసిన తరువాత గరిష్టంగా 40 నుండి 50 కిమీల పరిధిని అందిస్తుంది.

ప్రస్తుతం దేశంలో పెట్రోల్ మరోయు డీజిల్ ధరలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువమంది వాహన వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున ఒక వైపు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తే, మరో వైపు కొన్ని సాధారణ బైకులు ఎలక్ట్రిక్ బైకులుగా పురుడు పోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పుట్టుకొచ్చిన బైక్ ఈ బజాజ్ అవెంజర్ 220.

బజాజ్ అవెంజర్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్‌గా మారింది.. ఎలా అనుకుంటున్నారా..?

ఇది ఒక చార్జితో 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది, అయితే ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్న బైకులు ఎక్కువ మైలేజ్ అందిస్తున్నాయి. వాటితో పోలిస్తే ఈ బైక్ యొక్క పరిధి చాలా తక్కువ అని స్పష్టమవుతుంది. అయితే దీని యొక్క నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది.

Most Read Articles

English summary
Bajaj avenger motorcycle modified with electric hybrid system details
Story first published: Tuesday, February 22, 2022, 15:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X