హోరాహోరీగా సాగిన 2022 డాకర్ ర్యాలీ స్టేజ్ 6; ఫలితాలు ఇవే

ఎట్టకేలకు 2022 డాకర్ ర్యాలీ యొక్క 6 వ దశ ఎంతో అట్టహాసంగా ముగిసింది. ఇందులో గ్యాస్‌గ్యాస్ రైడర్ డేనియల్ సాండర్స్ మరియు బహ్రెయిన్ రైడ్ ఎక్స్‌ట్రీమ్ యొక్క ఓర్లాండో టెర్రానోవా విజయం సాధించారు. అయితే ఈ రోజు విశ్రాంతి దినంగా డాకర్ ర్యాలీ ప్రకటిచడం వల్ల, గ్యాస్‌గ్యాస్ రైడర్ సామ్ సుందర్‌ల్యాండ్ బైక్ విభాగానికి మరియు టయోటా డ్రైవర్ నాజర్ అల్-అత్తియా కార్ విభాగానికి నాయకత్వం వహిస్తారు. అయితే మనం ఈ ఆర్టికల్ లో 6 దశ యొక్క డాకర్ ర్యాలీ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

హోరాహోరీగా సాగిన 2022 డాకర్ ర్యాలీ స్టేజ్ 6; ఫలితాలు ఇవే

2022 డాకర్ ర్యాలీలో బైక్‌ విభాగం:

నిన్నటి రోజు ఎంతో ఉత్సాహంగా జరిగిన 2022 డాకర్ ర్యాలీ యొక్క ఆరవ దశ మొత్తం 101 కిలోమీటర్ల పరిధిలో జరిగింది. పరిధిని తగ్గించడానికి ప్రధాన కారణం మార్గం యొక్క భూభాగం దృష్టిలో ఉంచుకుని భద్రతా కారణాల వల్ల తగ్గించబడింది. 421 కిలోమీటర్ల లూప్‌ను ఇంతకు ముందు దశలో ఉపయోగించారు. కానీ ప్రస్తుతం ఇది కూడా వర్షం కారణంగా మరింత తగ్గించబడ్డాయి.

హోరాహోరీగా సాగిన 2022 డాకర్ ర్యాలీ స్టేజ్ 6; ఫలితాలు ఇవే

ఆస్ట్రేలియన్ గ్యాస్‌గ్యాస్ రైడర్ డేనియల్ సాండర్స్ సౌదీ అరేబియా ఇసుకలో 51 నిమిషాల 43 సెకన్ల సమయంతో తన సహచరుడు సామ్ సుందర్‌ల్యాండ్‌పై 2 నిమిషాల 26 సెకన్ల తేడాతో ఈ 6 వ స్టేజీని విజయవంతంగా పూర్తి చేసాడు. కావున ఇందులో మొదటి స్థానంలో డేనియల్ సాండర్స్ నిలువగా, రెండవ స్థానంలో సామ్ సుందర్‌ల్యాండ్‌ నిలిచాడు. అదే విధంగా మూడవ స్థానంలో కెటిఎమ్ రైడర్ మాథియాస్ వాక్నర్.

హోరాహోరీగా సాగిన 2022 డాకర్ ర్యాలీ స్టేజ్ 6; ఫలితాలు ఇవే

ఈ 6 వ స్టేజిలో రైడర్ హీరో జోక్విమ్ రోడ్రిగ్స్ 10వ స్థానంలో నిలిచాడు. అదే విధంగా 13 వ స్థానంలో TVS షెర్కో రైడర్‌ లోరెంజో శాంటోలినో నిలిచాడు. తరువాత హీరో మోటార్‌స్పోర్ట్స్ బైక్‌పై ఆరోన్ మేర్ 26వ స్థానంలో నిలిచాడు మరియు TVS షెర్కో యొక్క భారతీయ రైడర్ హరిత్ నోహ్ 35వ స్థానంలో నిలిచాడు.

హోరాహోరీగా సాగిన 2022 డాకర్ ర్యాలీ స్టేజ్ 6; ఫలితాలు ఇవే

ఓవరాల్ స్టాండింగ్స్‌లో, బ్రిటిష్ గ్యాస్‌గ్యాస్ రైడర్ సామ్ సుందర్‌ల్యాండ్ ఈ దశలో 2వ స్థానంలో నిలిచిన తర్వాత డాకర్ ర్యాలీలో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. చివరి పోడియం స్థానాన్ని నేటి స్టేజి విజేత డేనియల్ సాండర్స్ ఆక్రమించారు, అతను సుందర్‌ల్యాండ్ కంటే 5 నిమిషాల 35 సెకన్ల వెనుక ఉన్నాడు.

హోరాహోరీగా సాగిన 2022 డాకర్ ర్యాలీ స్టేజ్ 6; ఫలితాలు ఇవే

ఈ 6 వ స్టేజిలో టీవీఎస్ షెర్కో రైడర్ శాంటోలినో ప్రస్తుతం 18 నిమిషాల 22 సెకన్ల ఆధిక్యంలో 6 వ స్థానంలో నిలిచాడు. హీరో యొక్క ఆరోన్ మేర్ శాంటోలినో యొక్క TVS కంటే 10 స్థానాలు వెనుకబడి 16వ స్థానంలో ఉన్నారు. మేర్ సహచరుడు రోడ్రిగ్స్ 17వ స్థానంలో ఉన్నాడు. రోడ్రిగ్స్ మొత్తం స్టాండింగ్‌లలో అతని సహచరుడి కంటే దాదాపు 10 నిమిషాలు వెనుకబడి ఉన్నాడు.

TVS షెర్కో యొక్క భారతీయ రైడర్ హరిత్ నోహ్ ఇప్పుడు 28 వ స్థానంలో ఉన్నాడు, గోన్‌కాల్వ్స్ 31 వ స్థానంలో నిలిచాడు. మొత్తానికి 6 వ దశలో అందరూ కూడా చాలా అద్బుతంగా తమదైన శైలిలో ప్రతిభను చూపారు.

హోరాహోరీగా సాగిన 2022 డాకర్ ర్యాలీ స్టేజ్ 6; ఫలితాలు ఇవే

2022 డాకర్ ర్యాలీలో కార్ విభాగం:

ఇప్పుడు కార్ల విభాగానికి వస్తే, డకార్ ర్యాలీ యొక్క ఆరవ దశలో సౌదీ అరేబియా రాజధాని రియాద్ చుట్టూ మొత్తం 348 కిలోమీటర్ల పొడవైన లూప్‌ను చుట్టవలసి వచ్చింది. ఈ స్టేజిలో ఆధిక్యం చాలాసార్లు చేతులు మారింది. కాలం స్టేజి చివరికి విజేతగా బహ్రెయిన్ రైడ్ ఎక్స్‌ట్రీమ్ యొక్క ఓర్లాండో టెర్రానోవా నిలిచాడు.

హోరాహోరీగా సాగిన 2022 డాకర్ ర్యాలీ స్టేజ్ 6; ఫలితాలు ఇవే

మొత్తం మీద టయోటా డ్రైవర్, యజీద్ అల్ రాజ్హి చివరి పోడియం స్థానాన్ని క్లెయిమ్ చేశాడు, అతను టెర్రానోవా కంటే 1 నిమిషం మరియు 49 సెకన్ల వెనుకబడి మొత్తం స్టాండింగ్‌లలో రెండవ స్థానానికి చేరుకున్నాడు. సెబాస్టియన్ లోబ్ 31 వ స్థానంలో నిలిచారు. ఈ స్టేజిని 10వ స్థానంలో ముగించినప్పటికీ, టొయోటా యొక్క ఖతారీ డ్రైవర్ నాసర్ అల్-అత్తియా ర్యాలీకి నాయకత్వం వహిస్తున్నాడు.

హోరాహోరీగా సాగిన 2022 డాకర్ ర్యాలీ స్టేజ్ 6; ఫలితాలు ఇవే

అల్-అత్తియా ఇప్పుడు సౌదీ అరేబియాకు చెందిన యజీద్ అల్ రాజ్హీ కంటే 48 నిమిషాల 54 సెకన్లు ముందు ఉన్నాడు, సెబాస్టియన్ లోబ్ మరో నిమిషంన్నర వెనుకబడి మూడో స్థానంలో ఉన్నాడు. మొత్తానికి నిరాఘాటంగా పూర్తయ్యింది.

హోరాహోరీగా సాగిన 2022 డాకర్ ర్యాలీ స్టేజ్ 6; ఫలితాలు ఇవే

డాకర్ 2022 స్టేజ్ 6 పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మొత్తానికి ఎంతో పోటాపోటీగా జరుగుతున్న 2022 డాకర్ ర్యాలీ యొక్క 6 వ దశ ముగిసింది. అయితే ఇందులో రైడర్లు చాలా క్లిష్టపరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. బైక్‌ల విభాగంలో, ఆసీస్ రైడర్ డేనియల్ సాండర్స్ ఈ సంవత్సరం డాకర్‌లో తన రెండవ పూర్తి దశ విజయాన్ని సాధించాడు.

హోరాహోరీగా సాగిన 2022 డాకర్ ర్యాలీ స్టేజ్ 6; ఫలితాలు ఇవే

కార్ల విభాగంలో, ఓర్లాండో టెర్రానోవా కేవలం 66 సెకన్ల తేడాతో అల్ రాజ్‌హీని పోస్టింగ్‌కు పంపే ముందు ఆధిక్యం చాలాసార్లు చేతులు మారింది. అయితే కార్ల విభాగం ఆల్-అత్తియా కూడా అసాధ్యమైన స్థితిలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు తరువాత స్టేజిలో ఎవరు ముందు ఉంటారు అనేది ఇక్కడ ఆసక్తి కరమైన విషయం. దీనికి సంబంధిచిన సమచారం త్వరలోనే వెల్లడవుతుంది.

Most Read Articles

English summary
Dakar 2022 stage 6 results daniel sanders orlando terranova claim victory details
Story first published: Saturday, January 8, 2022, 11:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X