2022 డాకర్ ర్యాలీ నాలుగవ స్టేజ్ ఫలితాలు: విజేతలు

2022 డాకర్ ర్యాలీలో అత్యంత పొడవైన మరియు కఠినమైన నాలుగవ స్టేజ్ కూడా ముగిసింది. ఇందులో బైక్ విభాగంలో హోండా యొక్క 'జోన్ బారెడా' అద్భుతమైన సాహసం చేసి స్టేజ్ విజేతగా నిలిచాడు. అదే విధంగా కార్ విభాగంలో టయోటా గాజూ డ్రైవర్ 'నాసర్ అల్ అత్తియా' విజయ పతాకం కైవసం చేసుకున్నాడు.

2022 డాకర్ ర్యాలీ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2022 డాకర్ ర్యాలీ నాలుగవ స్టేజ్ ఫలితాలు: విజేతలు

2022 డాకర్ ర్యాలీలో బైక్‌ విభాగం:

2022 డాకర్ ర్యాలీ నాలుగవ స్టేజ్ మొత్తం 464 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. ఇందులో రైడర్లు సౌదీ అరేబియాలోని ఇసుక మీదుగా దేశ రాజధాని రియాద్‌కు సమీపంలో ఉన్న ముగింపు రేఖ మొత్తం 464 కిలోమీటర్లు ఎంతో సాహసాన్ని ప్రదర్శిస్తూ ముగించారు. ఇందులో హోండా జోన్ బారెడా 4 గంటల 6 నిమిషాల 6 సెకన్లతో ప్రయాణాన్ని ముగించుకుని విజేతగా నిలిచాడు.

2022 డాకర్ ర్యాలీ నాలుగవ స్టేజ్ ఫలితాలు: విజేతలు

ఇందులో రెండవ స్థానంలో కెటిఎమ్ రైడర్ అయిన పాబ్లో క్వింటానిల్లా నిలిచాడు, యితడు ఈ మొత్తం పరిధిని జోన్ బారెడా కంటే 4 నిమిషాల 37 సెకన్ల తేడాతో ముగించాడు. మూడవ స్థానంలో రైడర్ ఆఫ్ ది డే, రెండుసార్లు MotoGP రేస్ విజేత మరియు Tech3 KTM రైడర్ పెట్రుచి ఉన్నారు.

2022 డాకర్ ర్యాలీ నాలుగవ స్టేజ్ ఫలితాలు: విజేతలు

ఈ స్టేజ్ లో టీవీఎస్ కూడా మంచి ప్రతిభను కనపరిచింది. ఎందుకంటే రుయి గొన్‌కాల్వ్స్ మరియు లోరెంజో శాంటోలినో డాకర్ యొక్క పొడవైన స్టేజ్‌ని వరుసగా నాలుగు మరియు ఐదవ స్థానాలను పొందారు. చివరి టీవీఎస్ రైడర్, భారత్‌కు చెందిన హరిత్ నోహ్ బర్రెడా కంటే 32వ స్థానంలో నిలిచాడు.

2022 డాకర్ ర్యాలీ నాలుగవ స్టేజ్ ఫలితాలు: విజేతలు

నిన్నటి దశలో గెలిచిన హీరో జోక్విమ్ రోడ్రిగ్స్ సౌదీ ఇసుకలో కఠినమైన రోజును భరించి ఓవరాల్‌గా 38వ స్థానంలో నిలిచాడు. అతని సహచరుడు, ఆరోన్ మేర్ స్టేజ్ విజేత కంటే 24 నిమిషాల వెనుకబడి 23వ స్థానంలో నిలిచాడు. నాల్గవ దశ తర్వాత, బైక్‌ల విభాగంలో సామ్ సుందర్‌ల్యాండ్ డాకర్ ర్యాలీలో ముందంజలో కొనసాగుతోంది.

2022 డాకర్ ర్యాలీ నాలుగవ స్టేజ్ ఫలితాలు: విజేతలు

గ్యాస్‌గ్యాస్ రైడర్ సుందర్‌ల్యాండ్ ఈ స్టేజిలో 7వ స్థానంలో ముగించాడు. యమహా యొక్క అడ్రియన్ వాన్ బెవెరెన్, నిన్నటి దశ తర్వాత సుందర్‌ల్యాండ్‌కు కేవలం 4 సెకన్ల వెనుకబడి ఉన్నాడు, ఇప్పుడు బ్రిటిష్ రైడర్ కంటే దాదాపు ఐదు నిమిషాలు వెనుకబడి ఉన్నాడు. ఈ సంవత్సరం డాకర్ ర్యాలీలో రెండు భారతీయ మార్క్‌లకు ప్రాతినిధ్యం వహించిన వారిలో TVS షెర్కో యొక్క శాంటోలినో అత్యధిక రేక్ చేసిన రైడర్‌గా కొనసాగడం జరిగింది.

2022 డాకర్ ర్యాలీ నాలుగవ స్టేజ్ ఫలితాలు: విజేతలు

ఇందులో రోడ్రిగ్స్ 19వ స్థానంలో, హరిత్ నోహ్ అస్ట్రైడ్ 31వ స్థానంలో నిలిచాడు. అయితే గొన్‌కాల్వ్స్ లీడర్‌బోర్డ్‌లో 38 వ స్థానంలో ఉన్నాడు. మొత్తానికి నిరాఘాటంగా 4 వ స్టేజి ర్యాలీ ముగిసింది.

2022 డాకర్ ర్యాలీ నాలుగవ స్టేజ్ ఫలితాలు: విజేతలు

2022 డాకర్ ర్యాలీలో కార్ల విభాగం:

ఈ నాలుగవ స్టేజ్ 2022 డాకర్ ర్యాలీ కార్ల విభాగంలో ఖతార్ డ్రైవర్ నాసర్ అల్-అత్తియా తన ప్రత్యర్థి కంటే కూడా కేవలం 25 సెకన్ల తేడాతో అగ్రస్థానంలో నిలిచాడు. అయితే 25 సెకన్ల తేడాతో సెబాస్టియన్ లోబ్ రెండవ స్థానాన్ని పొందాడు. డాకర్ 2022 ర్యాలీ యొక్క నాల్గవ దశ ఆధిక్యం అనేకసార్లు మారడంతో ఇద్ చాలా కఠినంగా మారింది.

2022 డాకర్ ర్యాలీ నాలుగవ స్టేజ్ ఫలితాలు: విజేతలు

ఇందులో హెంక్ లాటెగాన్ స్టేజ్‌లో చాలా వరకు ఆధిక్యంలో ఉన్నాడు, అయితే తన కారు యొక్క కుడి వెనుక చక్రంలో సమస్య కారణంగా, 310-కిలోమీటర్ల మార్క్ వద్ద ఆగిపోవాల్సి వచ్చింది. మొదటి రెండు వే పాయింట్ల ద్వారా స్టేజ్ నడిపించిన అల్-అత్తియా అగ్రస్థానంలో ఉన్న ముగింపు రేఖకు ముందు చివరి రెండు వే పాయింట్లను అధిగమించడానికి ముందు ఆధిక్యం కార్లోస్ సైన్జ్ మధ్య మారింది.

2022 డాకర్ ర్యాలీ నాలుగవ స్టేజ్ ఫలితాలు: విజేతలు

సౌదీకి చెందిన యజీద్ అల్ రాజ్హి, చివరి విభాగంలో కేవలం 14 సెకన్ల తేడాతో స్టేజ్ లో విజయం సాధించాడు. ఓవరాల్ స్టాండింగ్స్‌లో, అల్-అత్తియా 38 నిమిషాల 5 సెకన్లతో లోయాబ్‌ కంటే కూడా ముందంజలో ఉన్నాడు. అల్ రాజి ఇప్పుడు పోడియంపై ఉన్నాడు మరియు లోయెబ్ కంటే 11 నిమిషాల 10 సెకన్ల వెనుక ఉన్నాడు.

2022 డాకర్ ర్యాలీ నాలుగవ స్టేజ్ ఫలితాలు: విజేతలు

డాకర్ 2022 స్టేజ్ 4 ఫలితాలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

2022 డకార్ ర్యాలీ యొక్క పొడవైన స్టేజ్ ముఖ్యంగా కార్ల విభాగంలో కేవలం 1 నిమిషం మరియు 46 సెకన్ల తేడాతో మొదటి ఐదుగురు డ్రైవర్లతో విపరీతంగా అలరించింది. ఈ సంవత్సరం డాకర్ ర్యాలీలో నాసర్ అల్-అత్తియా మరియు హోండా యొక్క జోన్ బారెడా మొదటి బహుళ-దశల విజేతలుగా నిలిచారు. అంతే కాకుండా టీవీఎస్ షెర్కో ఇద్దరు రైడర్‌లు టాప్ 5 స్థానాల్లో నిలిచారు. మొత్తానికి ఈ స్టేజ్ చాలా కఠినమైనదైనప్పటికీ ఎంతో ఉత్సాహంతో హోరాహోరీగా ముగించేశారు.

Most Read Articles

English summary
Dakar rally 2022 stage 4 results honda s joan barreda wins stage 4
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X