2022 డాకర్ ర్యాలీ యొక్క 7 వ రోజు ఫలితాలు: లీడ్‌లో ఉన్నది వీరే

ఎంతో అట్టహాసంగా జరుగుతున్న 2022 డాకర్ ర్యాలీ యొక్క 7 వ స్టేజ్ కూడా ముగిసింది. ఈ స్టేజిలో బైక్ విభాగంలో చిలీకి చెందిన హోండా రైడర్ జోస్ ఇగ్నాసియో కార్నెజో ఫ్లోరిమో విజయాన్ని సాధించారు. అదేవిధంగా కార్ విభాగంలో సెబాస్టియన్ లోయెబ్ విజయం సాధించారు. 7 వ స్టేజి యొక్క మొత్తమ్ ఫలితాలు గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

2022 డాకర్ ర్యాలీ యొక్క 7 వ రోజు ఫలితాలు: లీడ్‌లో ఉన్నది వీరే

2022 డాకర్ ర్యాలీలో బైక్‌ విభాగం:

2022 డాకర్ ర్యాలీ యొక్క 7 వ దశ సౌదీ అరేబియాలోని 'రియాద్ మరియు అల్-దవాడిమి' మధ్య ఉన్న దాదాపు 402-కిలోమీటర్ల ప్రత్యేక స్టేజ్. ఇందులో రైడర్లు తమ సాహసాలు చూపించాల్సి వచ్చింది. అయితే ఇందులో ఇంతకు ముందు 6 వ స్టేజ్ లో విజయం సాధించిన డేనియల్ సాండర్స్ ప్రమాదానికి గురయ్యాడు, యితడు లైన్‌కు వెళ్లే మార్గంలో కిందపడటంతో అతని ఎడమ చేతికి గాయమైంది. ఈ కారణంగా ఇతడు ఈ ర్యాలీ నుంచి వైదొలగాల్సి వచ్చింది.

2022 డాకర్ ర్యాలీ యొక్క 7 వ రోజు ఫలితాలు: లీడ్‌లో ఉన్నది వీరే

7 వ స్టేజ్ ఎట్టకేలకు ప్రారంభం కావడంతో, ఇందులో పాల్గొన్న దాదాపు అందరూ కూడా ఎక్కువ శ్రమిచాల్సి వచ్చింది. ఇందులో మొదటి స్థానంలో కార్నెజో ఫ్లోరిమో నిలిచాడు. యితడు తన మొత్తం పరిధిని కేవలం 3 గంటల 48 నిమిషాల 26 సెకన్లలో పూర్తి చేసాడు. తర్వాత స్థానాల్లో కెటిఎమ్ రైడర్ కెవిన్ బెనవిడెస్ మరియు హోండా యొక్క జోన్ బారెడా నిలిచారు.

2022 డాకర్ ర్యాలీ యొక్క 7 వ రోజు ఫలితాలు: లీడ్‌లో ఉన్నది వీరే

ఈ 7 వ స్టేజ్ లో టీవీఎస్ రైడర్ చిలీకి చెందిన లోరెంజో శాంటోలినో 5 వ స్థానంలో నిలిచాడు. ఆ తరువాత టీవీఎస్ శాంటోలినో తరువాత హీరో యొక్క జోక్విమ్ రోడ్రిగ్స్ నిలిచారు. జోక్విమ్ రోడ్రిగ్స్ శాంటోలినో కంటే కేవలం 28 సెకన్ల వెనుక దీనిని ముగించాడు. తర్వాతి స్థానంలో టీవీఎస్ షెర్కో రైడర్ రూయి గోన్‌కాల్వ్స్ 16వ స్థానంలో నిలిచాడు.

2022 డాకర్ ర్యాలీ యొక్క 7 వ రోజు ఫలితాలు: లీడ్‌లో ఉన్నది వీరే

ఇందులో భారతదేశానికి చెందిన హరిత్ నోహ్ 23 వ స్థానంలో తరువాత కేవలం 11 సెకన్లు వెనుకబడి మారేస్ ఉన్నారు. ఓవరాల్ స్టాండింగ్‌లలో, యమహా యొక్క ఫ్రెంచ్ రైడర్ అడ్రియన్ వాన్ బెవెరెన్ డాకర్ ర్యాలీని మాథియాస్ వాక్‌నర్ యొక్క KTM నుండి 5 నిమిషాల 12 సెకన్లలో ఆధిక్యంలో నిలిచాడు.

2022 డాకర్ ర్యాలీ యొక్క 7 వ రోజు ఫలితాలు: లీడ్‌లో ఉన్నది వీరే

శాంటోలినో సౌదీ ఎడారిలో ఇండియన్ మెటల్ రైడింగ్ అత్యున్నత స్థాయి రైడర్‌గా కొనసాగుతున్నాడు. శాంటోలినో ప్రస్తుతం మొత్తం మీద 5 వ స్థానంలో ఉన్నాడు. హీరో యొక్క ఇద్దరు రైడర్లు జోక్విమ్ రోడ్రిగ్స్ మరియు ఆరోన్ మేర్ ప్రస్తుతం 16వ మరియు 17వ స్థానాల్లో ఉన్నారు. భారత్‌కు చెందిన హరిత్ నోహ్ ప్రస్తుతం టీవీఎస్ సహచరుడు రుయి గొన్‌కాల్వ్స్ కంటే 3 స్థానాలు ఆధిక్యంలో 27వ స్థానంలో ఉన్నాడు. మొత్తానికి భారతీయ రైడర్లు కూడా ఎంతో సాహసాలు ప్రదర్శించి ఇందులో తమ ప్రతిభను చాటుకుంటున్నారు.

2022 డాకర్ ర్యాలీ యొక్క 7 వ రోజు ఫలితాలు: లీడ్‌లో ఉన్నది వీరే

2022 డాకర్ ర్యాలీలో కార్ విభాగం:

ఇప్పుడు 7 వ స్టేజీలోని కార్ల విభాగానికి వస్తే, ఇందులో ఫ్రెంచ్ WRC లెజెండ్ సెబాస్టియన్ లోయెబ్ ఈ సంవత్సరం డాకర్ ర్యాలీలో విజయాన్ని సాధించారు. బహ్రెయిన్ రైడ్ ఎక్స్‌ట్రీమ్ హంటర్‌ లోయెబ్ 402 కిలోమీటర్ల పొడవైన స్టేజ్‌ను కేవలం 3 గంటల 9 నిమిషాల 32 సెకన్లలో మెరుపుదాడి చేశాడు.

2022 డాకర్ ర్యాలీ యొక్క 7 వ రోజు ఫలితాలు: లీడ్‌లో ఉన్నది వీరే

సెబాస్టియన్ లోయెబ్ టైమింగ్ చార్ట్‌లలో అతని ప్రధాన ప్రత్యర్థి టయోటా యొక్క నాజర్ అల్-అత్తియాను 5 నిమిషాల 26 సెకన్ల తేడాతో ఓడించాడు. అతని ఆల్-ఎలక్ట్రిక్ ఛాలెంజర్‌లో ఆడి యొక్క కార్లోస్ సైన్జ్ మూడవ మరియు చివరి పోడియం స్థానాన్ని క్లెయిమ్ చేశాడు. సైంజ్ జట్టు సహచరుడు మరియు డిఫెండింగ్ ఛాంపియన్ స్టెఫాన్ పీటర్‌హాన్సెల్‌ను దాదాపు 2 నిమిషాల వ్యవధిలో ఫైనల్ పోడియం స్థానానికి చేరుకున్నాడు.

2022 డాకర్ ర్యాలీ యొక్క 7 వ రోజు ఫలితాలు: లీడ్‌లో ఉన్నది వీరే

ఏడవ దశ ఫలితాలు సౌదీ డ్రైవర్ అల్ రాజ్హి నుండి మొత్తం ర్యాంకింగ్స్‌లో సెబాస్టియన్ లోయెబ్ రెండవ స్థానాన్ని తిరిగి పొందాడు. సెబాస్టియన్ లోయెబ్ ప్రస్తుతం రాజ్హీ కంటే తొమ్మిదిన్నర నిమిషాలు ముందున్నాడు. ఈరోజు సెబాస్టియన్ లోయెబ్ తన సాహసంతో ముందువరుసలో నిలిచాడు.

2022 డాకర్ ర్యాలీ యొక్క 7 వ రోజు ఫలితాలు: లీడ్‌లో ఉన్నది వీరే

డాకర్ ర్యాలీ 2022 స్టేజ్ 7 పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

డాకర్ ర్యాలీ 2022 స్టేజ్ 7 స్టేజిలో బైక్ విభాగంలో చిలీకి చెందిన హోండా రైడర్ జోస్ ఇగ్నాసియో కార్నెజో ఫ్లోరిమో విజయాన్ని సాధించారు. అదేవిధంగా కార్ విభాగంలో సెబాస్టియన్ లోయెబ్ విజయం సాధించారు. అయితే ఈ స్టేజిలో సాండర్స్ నిష్క్రమిచాల్సి వచ్చింది. కార్ల విభాగంలో, టయోటా డ్రైవర్ నాజర్ అల్-అత్తియా 45 నిమిషాల ఆధిక్యంతో టాప్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు.

Most Read Articles

English summary
Dakar rally 2022 stage 7 results cornejo loeb win
Story first published: Monday, January 10, 2022, 9:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X