మ్యాటర్ (Matter e-Bike) ఇ-బైక్‌లో చాలా మ్యాటర్ ఉంది.. నవంబర్ 2022లో విడుదలకు రెడీ..

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల స్వీకరణ వేగంగా పెరుగుతోంది. ఈ వృద్ధిలో భాగమయ్యేందుకు అనేక కొత్త కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే, భారత ఈవీ మార్కెట్లో అనేక కొత్త మరియు పాత కంపెనీలు విజయవంతంగా వ్యాపారం చేస్తుండగా, ఇప్పుడు ఈ మార్కెట్లోకి కొత్తగా మరొక కంపెనీ ప్రవేశించింది. అహ్మాదాబ్‌కు చెందిన మ్యాటర్ (Matter) అనే ఈవీ-స్టార్టప్ కంపెనీ త్వరలోనే తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

మ్యాటర్ (Matter e-Bike) ఇ-బైక్‌లో చాలా మ్యాటర్ ఉంది.. నవంబర్ 2022లో విడుదలకు రెడీ..

టెక్నాలజీ స్టార్టప్ అయిన మేటర్, ఐఐఎమ్ అహ్మదాబాద్ క్యాంపస్‌లో జరిగిన క్యాపిటల్ ఇంక్యుబేషన్ ఇన్‌సైట్స్ ఎవ్రీథింగ్ (CIIE.Co)లో, భారతదేశం మరియు ప్రపంచ మార్కెట్ల కోసం అంతర్గతంగా నిర్మించిన సాంకేతికతను ప్రదర్శించే మొదటి టెక్‌డేని నిర్వహించింది. మ్యాటర్ ప్రదర్శించిన సాంకేతికత మరియు ఆవిష్కరణలు తమ రాబోయే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ గురించి తెలియజేస్తాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్ ను కంపెనీ నవంబర్ 2022లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

మ్యాటర్ (Matter e-Bike) ఇ-బైక్‌లో చాలా మ్యాటర్ ఉంది.. నవంబర్ 2022లో విడుదలకు రెడీ..

భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మ్యాటర్ డ్రైవ్ 1.0 (లిక్విడ్-కూల్డ్ ఎలక్ట్రిక్ మోటార్) మరియు మ్యాటర్ ఛార్జ్ 1.0 (డ్యూయల్ మోడ్ కన్వర్టర్ చార్జర్) కోసం మంజూరు చేయబడిన పేటెంట్‌లు మరియు IP రేటెడ్ సర్టిఫికెట్లను మ్యాటర్ ప్రదర్శించింది. ఈ సందర్భంగా, తమ బ్రాండ్ యొక్క కొత్త ఎలిమెంటల్ లోగోను కూడా ఆవిష్కరించింది. మ్యాటర్, గత మూడు సంవత్సరాలుగా ఈవీ డ్రైవ్‌ట్రెయిన్, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ సిస్టమ్‌లు, ఛార్జర్‌లు మరియు కనెక్ట్ చేయబడిన అనుభవాలు వంటి ప్రధాన భాగాలపై దృష్టి సారించి, అంతర్గత హైపర్ స్కేలబుల్ టెక్ స్టాక్‌ను నిర్మించింది.

మ్యాటర్ 35 కి పైగా పేటెంట్ అప్లికేషన్‌లు, 15 కు పైగా ఇండస్ట్రియల్ డిజైన్ అప్లికేషన్‌లు మరియు 60 కి పైగా ట్రేడ్‌మార్క్‌లను కలిగి ఉన్న 100 కు పైగా IPలను సృష్టించింది. పవర్‌ట్రెయిన్, కంట్రోల్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ మరియు వెహికల్ ఇంజనీరింగ్‌తో సహా అన్ని వాహన డొమైన్‌లలో కంపెనీ బలమైన పేటెంట్ పైప్‌లైన్‌ను కలిగి ఉందని ఈ పేటెంట్లు తెలియజేస్తున్నాయి. మ్యాటర్ యొక్క నిలువుగా సమీకృత విధానం (వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్) ఫలితంగా రెండు పేటెంట్లు మంజూరు చేయబడ్డాయి.

మ్యాటర్ (Matter e-Bike) ఇ-బైక్‌లో చాలా మ్యాటర్ ఉంది.. నవంబర్ 2022లో విడుదలకు రెడీ..

ఈ రెండు పేటెంట్లలో ఒకటి మ్యాటర్ డ్రైవ్ 1.0 (లిక్విడ్-కూల్డ్ మోటార్) మరియు రెండవది డ్యూయల్ మోడ్ కన్వర్టర్. ఈ మంజూరు చేయబడిన పేటెంట్‌లతో పాటుగా మ్యాటర్ డ్రైవ్ 1.0, పవర్ ప్యాక్, ఛార్జర్, కంట్రోల్స్ మరియు ఇతర సంబంధిత సాంకేతికతల కోసం బహుళ పేటెంట్ అప్లికేషన్‌లు కూడా పైప్‌లైన్‌లో ఉన్నాయి. ఈ టెక్నాలజీతో పాటుగా కంపెనీ తమ తన కొత్త లోగో మరియు బ్రాండ్ గుర్తింపును ఆవిష్కరించింది

మ్యాటర్ (Matter e-Bike) ఇ-బైక్‌లో చాలా మ్యాటర్ ఉంది.. నవంబర్ 2022లో విడుదలకు రెడీ..

కొత్త లోగో ప్రధాన విలువలు, వృద్ధి సామర్థ్యం, పురోగతి మరియు సాంకేతికంగా మరియు పర్యావరణపరంగా బాధ్యతాయుతమైన భవిష్యత్తును నిర్మించాలనే కోరికను ప్రతిభింభిస్తాయని కంపెనీ తెలిపింది. మ్యాటర్ యొక్క లోగోలో M అనే అక్షరం ప్రధానంగా హైలైట్ చేయబడి ఉంటుంది, ఇది 4 చేతుల మధ్య ఉన్న మార్గాన్ని సూచిస్తున్నట్లుగా ఉంటుంది. ఈ నాలుగు అంశాలు అధునాతన సాంకేతికత, జీవితాలను సరళీకృతం చేసే ఆవిష్కరణ, మోడ్రన్ డిజైన్ మరియు అత్యుత్తమ శక్తిని సూచిస్తాయని మ్యాటర్ తెలిపింది.

మ్యాటర్ (Matter e-Bike) ఇ-బైక్‌లో చాలా మ్యాటర్ ఉంది.. నవంబర్ 2022లో విడుదలకు రెడీ..

మ్యాటర్ డ్రైవ్ 1.0 (లిక్విడ్ కూల్డ్ మోటార్):

మ్యాటర్ డ్రైవ్ 1.0 అనేది రేడియల్ ఫ్లక్స్ మోటార్, ఇది తేలికపాటి డ్రైవ్‌ట్రెయిన్‌ను సాధించడానికి వాంఛనీయ టార్క్ డెలివరీ మరియు అధునాతన పదార్థాల కోసం ఫ్లక్స్ గైడ్ యొక్క బలమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఇది ఈవీ డ్రైవ్‌ట్రెయిన్ ప్లాట్‌ఫారమ్ లిక్విడ్ కూలింగ్‌తో ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను కూడా హోస్ట్ చేస్తుంది.

సాధారణంగా, ఇలాంటి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ అనే టెక్నాలజీని మనం ఎక్కువగా సాంప్రదాయ పెట్రోల్ టూవీలర్లలో వింటూ ఉంటూ ఉంటాయి. అయితే, మ్యాటర్ ఈ తరహా టెక్నాలజీని తమ ఎలక్ట్రిక్ మోటారులో కూడా పరిచయం చేసింది. ఈ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇ-బైక్ లోని ఎలక్ట్రిక్ మోటారు యొక్క బహుళ భాగాలను ఏకకాలంలో చల్లబరచడానికి అనుమతిస్తుంది. ఇది ఒక స్టేటర్ మరియు రోటర్, ఒకే ఇన్‌లెట్ మరియు ఒకే అవుట్‌లెట్‌ని ఉపయోగిస్తుంది. ఈ అమరిక ఎలక్ట్రిక్ మోటారు నుండి వేగవంతమైన ఉష్ణ ఉపసంహరణను (వేడిని తగ్గించడానికి) అనుమతిస్తుంది.

మ్యాటర్ (Matter e-Bike) ఇ-బైక్‌లో చాలా మ్యాటర్ ఉంది.. నవంబర్ 2022లో విడుదలకు రెడీ..

మేటర్ ఛార్జ్ 1.0 (డ్యూయల్ మోడ్ కన్వర్టర్):

మ్యాటర్ ప్రదర్శించిన మరొక అద్భుతమైన ఆవిష్కరణ మేటర్ ఛార్జ్ 1.0. తక్కువ కాంపోనెంట్లను ఉపయోగిస్తున్నప్పుడు ఏదైనా సింగిల్-ఫేజ్ లేదా త్రీ-ఫేజ్ AC పవర్ సోర్స్‌ని ఉపయోగించి ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడానికి ఈ సాంకేతికత అనుమతిస్తుంది. ఇది వాహనం యొక్క మొత్తం బరువును తగ్గిస్తుంది మరియు తయారీ ఖర్చులను కూడా తక్కువగా ఉంచుతూ, బ్యాటరీ శక్తి సాంద్రత మరియు సామర్థ్యాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. మ్యాటర్ మొదటి ఇ-బైక్‌ను చూడాలంటే వచ్చే నవంబర్ 2022 వరకూ ఆగాల్సిందే. అప్పటి వరకూ లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Ev start up matter reveals its new technologies and plans to launch its first e bike in november 202
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X