బెంగళూరులో ప్రారంభమైన EVeium ఎక్స్‌పీరియన్స్ సెంటర్: పూర్తి వివరాలు

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఎంత డిమాండ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒక వైపు పెట్రోల్ ధరలు పెరిగిపోతుంటే, ఎక్కువమంది కస్టమర్లు పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను భర్తీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సిద్ధమవుతున్నాయి. అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి కస్టమర్లతో ఆసక్తిని పెంచడానికి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను కూడా ప్రారంభిస్తున్నారు.

ఇందులో భాగంగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'ఈవీయం' (EVeium) కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో ఒక ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ ప్రారంభించింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

బెంగళూరులో ప్రారంభమైన EVeium ఎక్స్‌పీరియన్స్ సెంటర్: పూర్తి వివరాలు

'ఈవీయం' (EVeium) కంపెనీ ప్రారభించిన ఈ కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ 'మోటో ఏస్' డీలర్‌షిప్ పేరుతో పూర్తిగా DPS బిజినెస్ అసోసియేట్స్ యాజమాన్యంలో ఉంటుంది. కంపెనీ త్వరలో నగరంలో మరో రెండు డీలర్‌షిప్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

బెంగళూరులో ప్రారంభమైన EVeium ఎక్స్‌పీరియన్స్ సెంటర్: పూర్తి వివరాలు

కంపెనీ ప్రారంభించిన ఈ కొత్త డీలర్‌షిప్ నగరం నడిబొడ్డున ఇందిరానగర్ 16వ మెయిన్, HAL 2వ స్టేజ్ వద్ద ఉంది. ఈ డీలర్‌షిప్ లో కంపెనీ యొక్క కాస్మో, కామెట్ మరియు సీజర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. కొనుగోలుదారులు ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించిన సమాచారం పొందవచ్చు.

బెంగళూరులో ప్రారంభమైన EVeium ఎక్స్‌పీరియన్స్ సెంటర్: పూర్తి వివరాలు

ఈ ఎక్స్‌పీరియన్స్ హబ్ ప్రారంభించిన సందర్భంగా EVeium కో-ఫౌండర్ మరియు పాట్నర్ ఆయిన 'సమీర్ మొయిదిన్' మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహన వినియోగంలో ఎక్కువ అవగాహన ఉన్న దేశంలోని ప్రధాన నగరాలలో ఒకటి బెంగళూరు. కావున ఇప్పుడు ఈ నగరంలో ఈ కొత్త ఎక్స్‌పీరియన్స్ హబ్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. అయితే రానున్న రోజుల్లో ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు మరిన్ని ప్రారభించడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తామన్నారు.

బెంగళూరులో ప్రారంభమైన EVeium ఎక్స్‌పీరియన్స్ సెంటర్: పూర్తి వివరాలు

దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని కస్టమర్ల నుంచి ఇప్పటికే మంచి స్పందన పొందాము, కావున ఇప్పుడు బెంగళూరువంటి అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఈ ఎక్స్‌పీరియన్స్ హబ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

బెంగళూరులో ప్రారంభమైన EVeium ఎక్స్‌పీరియన్స్ సెంటర్: పూర్తి వివరాలు

ఇదిలా ఉండగా EVeium కంపెనీ దేశీయ మార్కెట్లో ఇప్పటికే మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను జూన్ నెలలో విడుదల చేసింది. అవి ఈవియం కాస్మో (EVeium Cosmo), ఈవియం కామెట్ (EVeium Comet) మరియు ఈవియం సీజర్ (EVeium Czar) స్కూటర్లు.

ధరల విషయానికి వస్తే, ఈవియం కాస్మో ధర రూ. 1.44 లక్షలు, ఈవియం కామెట్ ధర రూ. 1.92 లక్షలు మరియు ఈవియం సీజర్ ధర రూ. 2.16 లక్షల వరకు ఉన్నాయి, (ధరలు ఎక్స్-షోరూమ్).

బెంగళూరులో ప్రారంభమైన EVeium ఎక్స్‌పీరియన్స్ సెంటర్: పూర్తి వివరాలు

కాస్మో ఎలక్ట్రిక్ స్కూటర్ లో 72V, 30Ah (2.16kWh) లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఒక ఛార్జ్ తో గరిష్టంగా 80 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అదే సమయంలో దీని టాప్ స్పీడ్ 65 కిలోమీటర్లు. ఇది ఆరు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

బెంగళూరులో ప్రారంభమైన EVeium ఎక్స్‌పీరియన్స్ సెంటర్: పూర్తి వివరాలు

కామెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది 72V, 50ah (3.6kWh) లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక ఫుల్ చార్జ్ పై గరిష్టంగా 150 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లు. ఇది కూడా 6 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

బెంగళూరులో ప్రారంభమైన EVeium ఎక్స్‌పీరియన్స్ సెంటర్: పూర్తి వివరాలు

చివరగా కంపెనీ యొక్క మూడవ స్కూటర్ సీజర్ విషయానికి వస్తే, ఇది 3.02 kWh బ్యాటరీ ప్యాక్‌ పొందుతుంది. ఇది ఒక ఛార్జ్ తో గరిష్టంగా 150 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. ఇది 6 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

బెంగళూరులో ప్రారంభమైన EVeium ఎక్స్‌పీరియన్స్ సెంటర్: పూర్తి వివరాలు

Evium కంపెనీ త్వరలో ఒక తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి రూ. 250 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఉత్పత్తిని ప్రారంభించాలని కూడా యోచిస్తోంది. ఇక్కడ ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్‌లు మరియు ఎలక్ట్రిక్ సైకిల్స్‌ వంటి వాటి యొక్క ఉత్పత్తి జరగనుంది. మొత్తం మీద తమ ఉత్పత్తులను పూర్తిగా దేశీయంగా ఉంచాలనే ఆలోచనతో కంపెనీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. అంతే కాకూండా తన డీలర్ నెట్‌వర్క్‌ను రానున్న రోజుల్లో భారతదేశంలో మొత్తం మీద ప్రారభించడానికి కూడా సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

బెంగళూరులో ప్రారంభమైన EVeium ఎక్స్‌పీరియన్స్ సెంటర్: పూర్తి వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో మంచి పురోగతి సాధిస్తుంది Evium కంపెనీ ఇప్పుడు బెంగళూరులో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించడం వల్ల మరింత ఎక్కువమంది కస్టమర్లకు చేరువలో ఉంటుంది. ఇది రానున్న రోజుల్లో కంపెనీ యొక్క అభివృద్ధికి చాలా దోహదపడుతుంది.

Most Read Articles

English summary
Eveium moto ace experience hub in launched in bengaluru details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X