హీరో మోటోకార్ప్ యొక్క మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్‌లో విడుదల - ధర ఎంతో తెలుసా?

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) దేశీయ విఫణిలో తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు 'హీరో విడా' (Hero Vida). దీనిని కంపెనీ వి1 అని పిలుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటరు గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

హీరో మోటోకార్ప్ యొక్క మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్‌లో విడుదల - ధర ఎంతో తెలుసా?

హీరో మోటోకార్ప్ యొక్క 'విడా' ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి 'వి1 ప్రో' (V1 Pro) మరియు 'వి1 ప్లస్' (V1 Plus). వీటి ధరలు వరుసగా రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్).

  • హీరో విడా వి1 ప్రో (Hero Vida V1 Pro): రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • హీరో విడా వి1 ప్లస్ (Hero Vida V1 Plus): రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • హీరో మోటోకార్ప్ యొక్క మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్‌లో విడుదల - ధర ఎంతో తెలుసా?

    హీరో మోటోకార్ప్ యొక్క ఈ వి1 ఎలక్ట్రిక్ స్కూటర్ మొదటి ఢిల్లీ, జైపూర్ మరియు బెంగళూరు నగరాల్లో లాంచ్ చేస్తుంది, ఆ తరువాత మిగిలిన నగరాల్లో లాంచ్ చేస్తుంది. అయితే డెలివరీలు డిసెంబర్ రెండవ వారం నుంచి ప్రారంభమవుతాయి. కావున ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కొనుగోలుదారులు ఎక్కువ కాలం ఎదురుచూడాల్సిన అవసరం లేదు.

    హీరో మోటోకార్ప్ యొక్క మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్‌లో విడుదల - ధర ఎంతో తెలుసా?

    హీరో మోటోకార్ప్ యొక్క మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ లైటింగ్, ఫాలో-మీ హోమ్ హెడ్లాంప్, కీలెస్ ఎంట్రీ, ఎస్ఓఎస్ అలర్ట్ వంటివి వాటితో పాటు 7 ఇంచెస్ TFT స్క్రీన్ ఉంటుంది. దీనిని స్మార్ట్ ఫోన్ కి కనెక్ట్ చేసుకోవచ్చు.

    హీరో మోటోకార్ప్ యొక్క మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్‌లో విడుదల - ధర ఎంతో తెలుసా?

    విడా ఎలక్ట్రిక్ స్కూటర్ పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ కూడా పొందుతుంది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ మరియు ఫీచర్స్ చాలా అధునాతనంగా ఉంటాయి. కావున తప్పకుండా వాహన వినియోగదారులను ఆకర్శించనుంది.

    హీరో మోటోకార్ప్ యొక్క మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్‌లో విడుదల - ధర ఎంతో తెలుసా?

    హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి రేంజ్ అందించేలా రూపొందించబడ్డాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లలో కంపెనీ రిమూవబుల్ బ్యాటరీ ఉపయోగించింది. ఇది పూర్తిగా కంపెనీ తయారు చేసినట్లు తెలుస్తోంది, అయితే రెండు వేరియంట్స్ అందించే పరిధి ఒకేలా ఉండదు. కావున Vida V1 Plus ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 143 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ. అదే సమయంలో ఇది కేవలం 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

    హీరో మోటోకార్ప్ యొక్క మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్‌లో విడుదల - ధర ఎంతో తెలుసా?

    ఇక Vida V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 165 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ వరకు ఉంటుంది. కాగా ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవతం అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి రేంజ్ అందిస్తాయని స్పష్టమవుతోంది.

    హీరో మోటోకార్ప్ యొక్క మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్‌లో విడుదల - ధర ఎంతో తెలుసా?

    హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం అక్టోబర్ 10నుంచి బుకింగ్స్ స్వీకరించే అవకాశం ఉంది. ఆసక్తి కలిగిన కస్టమర్లు రూ. 2,499 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు డిసెంబర్ రెండవ వారంలో ప్రారంభమవుతాయి. కావున వచ్చే 2023 నాటికి హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ భారతీయ రోడ్లమీద తిరగనుంది.

    హీరో మోటోకార్ప్ యొక్క మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్‌లో విడుదల - ధర ఎంతో తెలుసా?

    డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

    ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ భారతీయ మార్కెట్లో ఆకర్షణీయమైన ధర వద్ద విడుదలైంది. ఈ పండుగ సీజన్లో ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తప్పకుండా మంచి అమమకాలు పొందే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు ఏథర్ 450ఎక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Hero vida launched in india price features and details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X