కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌ను పేటెంట్ చేసిన హోండా.. ఇక ఈవీ యుద్ధానికి సిద్ధమైనట్లేనా..?

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు పెరుగుతున్న ఆదరణను చూసి ఇప్పటికే అనేక కొత్త కంపెనీలు ఈ విభాగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసినదే. కేవలం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తయారు చేసే కంపెనీలు మాత్రమే కాకుండా, పెట్రోల్ టూవీలర్లను విక్రయించే కంపెనీలు కూడా ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే, బజాజ్ ఆటో మరియు టీవీఎస్ కంపెనీలు తమ పోర్ట్‌ఫోలియో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నాయి. కాగా, హీరో మోటోకార్ప్ మరియు హోండా టూవీలర్ కంపెనీలు కూడా ఇప్పుడు ఈ విభాగంలోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

Recommended Video

Mahindra Scorpio-N ఆటోమేటిక్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్స్ ధరలు | వివరాలు

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన దిగ్గజం హోండా చాలా కాలంగా ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీపై పనిచేస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించి కొన్ని పేర్లను కూడా ట్రేడ్‌మార్క్ చేసిన హోండా, తాజాగా దాని డిజైన్‌ కోసం ట్రేడ్‌మార్క్ ఫైల్ చేసింది. హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పేటెంట్ డిజైన్ మరియు ఇతర వివరాలను ఆటోకార్ ఇండియా మ్యాగజైన్ ఆన్‌లైన్‌లో లీక్ చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌ను పేటెంట్ చేసిన హోండా.. ఇక ఈవీ యుద్ధానికి సిద్ధమైనట్లేనా..?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ (HMSI) ఈ ఏడాది ఇప్పటికే భారతదేశంలో రెండు పేర్లను ట్రేడ్‌మార్క్ చేసింది. వీటిలో హోండా యు-గో, హోండా స్కూపీ అనే పేర్లు ఉన్నాయి. హోండా యూ-గో పేరుతో కంపెనీ ఇప్పటికే చైనాలో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో, భారత్‌లో ట్రేడ్‌మార్క్ చేయబడిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కూడా ఇదే పేరుతో విక్రయించే ఆస్కారం ఉంది.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌ను పేటెంట్ చేసిన హోండా.. ఇక ఈవీ యుద్ధానికి సిద్ధమైనట్లేనా..?

హోండా పేటెంట్ చేసిన ఇ-స్కూటర్ డిజైన్‌ను గమనిస్తే, దాని హ్యాండిల్‌బార్ మరియు హెడ్‌లైట్ భాగం చూడటానికి ప్రస్తుత యాక్టివా మోడల్ మాదిరిగా కనిపిస్తుంది. మిగిలిన బాడీవర్క్ అంతా లేటెస్ట్‌గా ఉంటుంది. మొత్తంమీద, ఈ లేటెస్ట్ పేటెంట్ డిజైన్ చూస్తే, హోండా తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో యుటిలిటీ అంశంపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పేటెంట్‌తో పాటుగా హోండా తమ హబ్-మౌంటెడ్ మోటార్ యొక్క డిజైన్ కోసం కూడా పేటెంట్ ధరఖాస్తు చేసుకుంది.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌ను పేటెంట్ చేసిన హోండా.. ఇక ఈవీ యుద్ధానికి సిద్ధమైనట్లేనా..?

ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న అనేక ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగానే, హోండా ఇ-స్కూటర్ కూడా హబ్-మౌంటెడ్ మోటారుతో అమర్చబడి ఉంటుంది. ఈ డిజైన్ ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిచ్చే బ్యాటరీతో పాటు, స్కూటర్‌లోని ఇతర భాగాలకు శక్తినిచ్చే 12 వోల్ట్ బ్యాటరీ యూనిట్‌ను కూడా చూపుతుంది. లీకైన చిత్రాల ప్రకారం, హోండా ఇ-స్కూటర్ సంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు సింగిల్ రియర్ స్ప్రింగ్‌తో అమర్చబడి సస్పెన్షన్ సెటప్ ను కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌ను పేటెంట్ చేసిన హోండా.. ఇక ఈవీ యుద్ధానికి సిద్ధమైనట్లేనా..?

అంతేకాకుండా, ఇది డ్రమ్ బ్రేక్‌ లతో కూడిన 10 ఇంచ్ వీల్స్ ను కలిగి ఉన్నట్లు సమాచారం. హోండా ఇ-స్కూటర్ అధిక-వోల్టేజ్ బ్యాటరీని కలిగి ఉండనుంది (వోల్టేజ్ వివరాలు పేర్కొనబడలేదు), ఇది వెనుక చక్రంలో అమర్చిన ఇన్-వీల్ మోటార్‌కు ఇన్వర్టర్ ద్వారా శక్తినిస్తుంది. కానీ ఇది మోటారు కంట్రోలర్ మరియు స్కూటర్‌లోని అనేక ఇతర ఎలక్ట్రికల్ సిస్టమ్‌లకు శక్తినిచ్చే సాంప్రదాయ 12 వోల్ట్ బ్యాటరీని కూడా కలిగి ఉంది. హోండా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌ను పేటెంట్ చేసిన హోండా.. ఇక ఈవీ యుద్ధానికి సిద్ధమైనట్లేనా..?

హోండా తమ ఇ-స్కూటర్ తయారీ ఖర్చును తక్కువగా ఉంచేందుకు హబ్-మౌంటెడ్ మోటార్‌ సెటప్‌ను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా, ఎలక్ట్రిక్ టూవీలర్స్‌లో హబ్ మోటార్ అనేది తక్కువ-ధర మరియు తక్కువ-అవుట్‌పుట్ కలిగిన ఆప్షన్. ఈ డ్రాయింగ్‌లలోని అంశాలను బట్టి చూస్తుంటే, హోండా తమ లేటెస్ట్ ఇ-స్కూటర్ ను పెర్ఫార్మెన్స్ ఇ-స్కూటర్ మాదిరిగా కాకుండా, రోజూవారీ ప్రయాణం కోసం ఉద్దేశించిన అధిక రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌ను పేటెంట్ చేసిన హోండా.. ఇక ఈవీ యుద్ధానికి సిద్ధమైనట్లేనా..?

హోండా భారతదేశంలో డిజైన్ పేటెంట్‌ను దాఖలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. ఈ జపనీస్ కంపెనీ గతంలో ఓ మ్యాక్సీ-స్కూటర్, ఇ-స్కూటర్, ఆఫ్-రోడ్ మ్యాక్సీ-స్కూటర్ వంటి చాలా ఉత్పత్తుల కోసం పేటెంట్‌లను దాఖలు చేసింది. హోండా గతంలో దాఖలు చేసిన పేటెంట్లలో పోర్టబుల్ బ్యాటరీలు మరియు ఛార్జర్‌లకు సంబంధించినవి కూడా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో హోండాకు ఇప్పటికే ఈ రంగంలో చాలా నైపుణ్యం ఉంది. హోండా పిసిఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ విదేశాలలో అత్యధికంగా విక్రయించబడుతోంది. ఈ మోడల్ కూడా భారతదేశంలో పేటెంట్ పొందింది.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌ను పేటెంట్ చేసిన హోండా.. ఇక ఈవీ యుద్ధానికి సిద్ధమైనట్లేనా..?

హోండా అంతర్జాతీయ మార్కెట్లలో బెన్లీ అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తోంది. సమాచారం ప్రకారం, హోండా టూవీలర్స్ భారతదేశంలో కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను విస్తృతంగా పరీక్షిస్తోంది మరియు ఈ స్కూటర్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI)లో కూడా గుర్తించబడినట్లు తెలుస్తోంది. జపాన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో హోండా బెన్లీ కూడా ఒకటి. అక్కడి మార్కెట్లో హోండా తమ బెన్లీ సిరీస్ లో 4 రకాల ఎలక్ట్రిక్ స్కూటర్‌లను అందిస్తోంది.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌ను పేటెంట్ చేసిన హోండా.. ఇక ఈవీ యుద్ధానికి సిద్ధమైనట్లేనా..?

అంతర్జాతీయ మార్కెట్లలో హోండా ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా విక్రయిస్తోంది. వీటిలో హోండా పిసిఎక్స్ ఎలక్ట్రిక్, హోండా గైరో ఇ, హోండా గైరో కానోపీ ఇ వంటి మరెన్నో పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లు ఉన్నాయి. హోండా ఇప్పటికే ఈవీ సెక్టార్‌లో పెద్ద ప్లాన్‌లను కలిగి ఉంది మరియు కంపెనీ ఇటీవలే బ్యాటరీ ప్యాక్‌లను తయారు చేయడానికి కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. దాదాపు 133 కోట్ల మూలధనంతో ఈ కొత్త అనుబంధ సంస్థ ఏర్పడింది.

ఫొటో మూలం: ACI

Most Read Articles

English summary
Honda motorcycle india patents new electric scooter design details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X