గ్రేట్ న్యూస్.. కోటి యూనిట్లు సేల్స్: Honda Shine సంచలన రికార్డ్

ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా' భారతీయ మార్కెట్లో తన హోండా షైన్ (Honda Shine) బైక్ ని విడుదల హెసినప్పటినుంచి కూడా ఏకంగా ఇప్పటికి కోటి యూనిట్లను విక్రయించినట్లు అధికారికంగా తెలిపింది. భారతీయ మార్కెట్లో హోదా షైన్ 125 సిఐ విభాగంలో దాదాపు 50 శాతం వాటాలు కలిగి ఉంది. రాబోయే కాలంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

గ్రేట్ న్యూస్.. కోటి యూనిట్లు సేల్స్: హోండా షైన్ సంచలన రికార్డ్

భారత మార్కెట్‌లో 29 శాతం వార్షిక అమ్మకాల వృద్ధితో అగ్రగామిగా ఉన్న హోండా షైన్ 125 సిసి విభాగంలో కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడే 125సీసీ బైక్‌గా మారిందని కంపెనీ తెలిపింది. దేశంలో కోటి అమ్మకాల సంఖ్యను తాకిన తొలి మోటార్‌సైకిల్ బ్రాండ్ హోండా షైన్ 125 కావడం నిజంగా చాలా గొప్ప విషయం.

గ్రేట్ న్యూస్.. కోటి యూనిట్లు సేల్స్: హోండా షైన్ సంచలన రికార్డ్

హోండా షైన్ 125 అమ్మకాల విషయానికి వస్తే, కంపెనీ ఈ మోడల్ ని 2017 వరకు దాదాపు 50 లక్షల యూనిట్లకు విక్రయించింది. ఆ మరుసటి సంవత్సరం ఈ అమ్మకాలు మొత్తం 70 లక్షలకు చేరాయి. కంపెనీ 2019 వ సంవత్సరంలో తన బిఎస్6 హోండా షైన్ 125 విడుదల చేసింది. ఆ సమయంలో కంపేయీ యొక్క ఈ కొత్త బైక్ అమ్మకాలు ఏకంగా 90 లక్షల యూనిట్లకు చేరింది.

గ్రేట్ న్యూస్.. కోటి యూనిట్లు సేల్స్: హోండా షైన్ సంచలన రికార్డ్

హోండా షైన్ 125 అద్భుతమైన డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది. అదే సమయంలో దీని ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 125 సిసి 4-స్ట్రోక్ SI, PGM-FI ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 7.9 బిహెచ్‌పి పవర్ మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 11 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఈ బైక్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కిక్ మరియు సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్‌ను కూడా పొందుతుంది.

గ్రేట్ న్యూస్.. కోటి యూనిట్లు సేల్స్: హోండా షైన్ సంచలన రికార్డ్

హోండా షైన్ 125 వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ పొడవు 2046 మి.మీ, వెడల్పు 737 మి.మీ మరియు ఎత్తు 1116 మి.మీ వరకు ఉంటుంది. అదే సమయంలో ఇది 1285 మి.మీ వీల్ బేస్ మరియు 162 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది.

గ్రేట్ న్యూస్.. కోటి యూనిట్లు సేల్స్: హోండా షైన్ సంచలన రికార్డ్

హోండా షైన్ బైక్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, దీని ముందుభాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుకవైపు డ్యూయల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ యూనిట్ ఉంటుంది. అదే సమయంలో ఈ బైక్ యొక్క ముందు మరియు వెనుక 18 ఇంచెస్ ట్యూబ్‌లెస్ టైర్లు అందుబటులో ఉంటాయి. రెండు టైర్లు ఒకే పరిమాణం మరియు వెడల్పుతో ఉంటాయి.

గ్రేట్ న్యూస్.. కోటి యూనిట్లు సేల్స్: హోండా షైన్ సంచలన రికార్డ్

ఈ బైక్ యొక్క బ్రేకింగ్ సెటప్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో 240 మిమీ డిస్క్ మరియు 130 మిమీ డ్రమ్ బ్రేక్ ఆప్సన్ ఉంటుంది. అయితే వెనుకవైపు డ్రమ్ బ్రేక్ ఇన్‌స్టాల్ చేయబడింది. షైన్ 125 బైక్ 114 కేజీల బరువును కలిగి ఉంటుంది. ఇందులో 10-లీటర్ల సామర్త్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఇంధన ట్యాంక్‌తో అమర్చబడింది.హోండా షైన్ 125 బ్లాక్, గ్రే మెటాలిక్, బ్లూ మెటాలిక్ మరియు రెడ్ మెటాలిక్ వంటి నాలుగు కలర్స్ లో అందుబటులో ఉంటుంది.

గ్రేట్ న్యూస్.. కోటి యూనిట్లు సేల్స్: హోండా షైన్ సంచలన రికార్డ్

ఈ బైక్ రెండు వేరియంట్లలో అందుబటులో ఉంటుంది. ఐ డ్రమ్ వేరియంట్ మరియు డిస్క్ వేరియంట్. డ్రమ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 73,352 కాగా, డిస్క్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 78,147 వరకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంటుంది.

గ్రేట్ న్యూస్.. కోటి యూనిట్లు సేల్స్: హోండా షైన్ సంచలన రికార్డ్

ఇదిలా ఉండగా భారతీయ మార్కెట్లో హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా తన కొత్త 2022 హోండా సిబి300ఆర్ (2022 Honda CB300R) మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ధర రూ. 2.77 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కంపెనీ ఈ కొత్త బైక్‌ కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించింది.

గ్రేట్ న్యూస్.. కోటి యూనిట్లు సేల్స్: హోండా షైన్ సంచలన రికార్డ్

2022 హోండా సిబి300ఆర్ బైక్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. ఇది రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అవి మ్యాట్ స్టీల్ బ్లాక్ మరియు పెరల్ స్పార్టన్ రెడ్ కలర్స్. ఈ బైక్ మొదటి సరి ఇటీవల కాలంలో జరిగిన 2021 ఇండియా బైక్ వీక్ లో ఆవిష్కరించబడింది.

గ్రేట్ న్యూస్.. కోటి యూనిట్లు సేల్స్: హోండా షైన్ సంచలన రికార్డ్

2022 హోండా CB300R పిజిఎమ్-ఎఫ్ఐ టెక్నాలజీతో కూడిన 286 సిసి డిఓహెచ్సి ఫోర్-వాల్వ్ లిక్విడ్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఈ ఇంజన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 30.4 బిహెచ్‌పి పవర్ మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 27.4 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ పొందుతుంది.

గ్రేట్ న్యూస్.. కోటి యూనిట్లు సేల్స్: హోండా షైన్ సంచలన రికార్డ్

కొత్త 2022 హోండా CB300R బైక్‌లో డ్యూయల్ ఛానల్ ABS ఫీచర్‌తో పాటు అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్ స్టాండర్డ్‌గా ఉన్నాయి. ఇవి కాకుండా కంపెనీ ఈ బైక్‌లో ఎలాంటి కొత్త మార్పులు చేయలేదు. హోండా సిబి300ఆర్ భారతదేశంలోని కెటిఎమ్ 390 డ్యూక్, బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్ మరియు బజాజ్ డామినార్ 400 వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Honda shine 125 sales milestone 1 crore units details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X