OXO బైక్ డెలివరీలు ప్రారంభించిన HOP.. న్యూ ఇయర్‌కి ముందే కస్టమర్ల దిల్‌ కుష్

భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న జైపూర్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'HOP ఎలక్ట్రిక్' OXO ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీలను ఎట్టకేలకు ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

HOP ఎలక్ట్రిక్ గత నవంబర్ నెలలోనే టెస్ట్ రైడ్స్ కూడా ప్రారంభించింది. అయితే ఇప్పటి వరకు కంపెనీ ఈ OXO ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ కోసం 10,000 బుకింగ్‌లను పొందింది. కాగా ఇప్పుడు రాజస్థాన్‌లోని జైపూర్‌లో తన మొదటి బ్యాచ్ డెలివరీలను ప్రారంభించింది. కంపెనీ ఈ మొదటి బ్యాచ్ లో మొత్తం 2,500 యూనిట్ల HOP OXO ఎలక్ట్రిక్ బైకులను డెలివరీ చేయనున్నట్లు సమాచారం.

OXO బైక్ డెలివరీలు ప్రారంభించిన HOP

మార్కెట్లో విడుదలైన 'హోప్ ఆక్సో' (HOP OXO) రెండు వేరియంట్లలో విడుదలైంది. అవి హోప్ ఓక్సో (HOP OXO) మరియు హోప్ ఓక్సో ఎక్స్ (HOP OXO X) వేరియంట్లు. వీటి ధరల విషయానికి వస్తే హోప్ ఓక్సో ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 1,24,999 కాగా, హోప్ ఓక్సో ఎక్స్ ధర రూ. 1,39,999 (ధరలు, ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 150 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని ధృవీకరించబడింది.

Hop OXO ఎలక్ట్రిక్ బైక్ 3.75kWh బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులో ఉంటుంది. ఇది 6.9 బిహెచ్‌పి పవర్ మరియు 185 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. Hop OXO X విషయానికి వస్తే, ఇది 8.31బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ కేవలం 4 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో దీని గరిష్ట వేగం గంటకు 90 కిమీ వరకు ఉంటుంది.

Hop OXO ఎలక్ట్రిక్ బైక్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్. కావున మంచి రేంజ్ అందించడమే కాకుండా బ్యాటరీ మరియు మోటార్ రెండూ డస్ట్ అండ్ వాటర్ ఫ్రూఫ్ కోసం IP67 రేట్ పొందాయి. ఇది 16A ఛార్జర్‌ సాయంతో కేవలం నాలుగు గంటల సమయంలో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డిజిటల్ డిస్‌ప్లే, 4G కనెక్టివిటీ వంటివి అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి OXO యాప్ ద్వారా స్పీడ్ కంట్రోల్, జియో-ఫెన్సింగ్, యాంటీ-థెఫ్ట్ సిస్టమ్ వంటి అనేక ఫీచర్స్ యాక్సెన్స్ చేయవచ్చు. ఇవన్నీ బైక్ రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటాయి. Hop OXO ఎలక్ట్రిక్ బైక్ రెడ్ అండ్ బ్లూ అనే రెండు కలర్ ఆప్సన్స్ పొందుతుంది. కాగా Hop OXO X బైక్ గ్రీన్ మరియు గ్రే కలర్ ఆప్సన్స్ పొందుతుంది.

కొత్త HOP OXO ఎలక్ట్రిక్ బైక్ చాలా స్టైలిష్ డిజైన్ కలిగి ఉంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్‌, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ మరియు సింగిల్ పీస్ సీట్ మొదలైన ఉంటాయి. ఈ బైక్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ యూనిట్లు మరియు వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్‌ ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు మరియు వెనుక వైపు డిస్క్ బ్రేక్‌లను పొందుతాయి.

HOP ఎలక్ట్రిక్ బైక్ డెలివరి సందర్భంగా కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ 'రజనీష్ సింగ్' మాట్లాడుతూ.. మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మంచి కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ బైకుల మీద ఆసక్తి చూపడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇక ఫస్ట్ బైక్ డెలివెరీ పొందిన జైపూర్‌కు చెందిన 'విశాల్ శర్మ' కూడా ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా రానున్న రోజుల్లో ఈ బైక్ డెలివరీలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Hop oxo e bike delivery begins in india details
Story first published: Thursday, December 15, 2022, 10:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X