టెస్ట్ రైడ్‌లకు HOP OXO ఎలక్ట్రిక్ బైక్ సిద్ధం.. ఇక ఆ రోజు నుంచి షురూ..!!

దేశీయ మార్కెట్లో జైపూర్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'హోప్' ఎలక్ట్రిక్ తన కొత్త 'ఆక్సో' బైక్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు టెస్ట్ రైడ్ డేట్ వెల్లడించింది.

కంపెనీ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే మంచి బుకింగ్స్ పొందింది, కావున టెస్ట్ రైడ్స్ ఆలస్యం చేసే అవకాశం లేదు. టెస్ట్ రైడ్స్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

టెస్ట్ రైడ్‌లకు HOP OXO ఎలక్ట్రిక్ బైక్ సిద్ధం

HOP ఎలక్ట్రిక్ తన ఆక్సో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కోసం ఇప్పటికే 6,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది, రానున్న రోజుల్లో ఈ బుకింగ్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. కావున టెస్ట్ రైడ్స్ ఈ నెల 25 నుంచి (2022 నవంబర్ 25) ప్రారభించడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కావున ఈ బైక్ టెస్ట్ రైడ్ చేయాలనుకునే కస్టమర్లు టెస్ట్ రైడ్ చేయవచ్చు.

మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి ఆదరణ పొందుతున్న 'హోప్ ఆక్సో' (HOP OXO) రెండు వేరియంట్లలో విడుదలైంది. అవి హోప్ ఓక్సో (HOP OXO) మరియు హోప్ ఓక్సో ఎక్స్ (HOP OXO X) వేరియంట్లు. వీటి ధరల విషయానికి వస్తే హోప్ ఓక్సో ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 1,24,999 కాగా, హోప్ ఓక్సో ఎక్స్ ధర రూ. 1,39,999.

HOP OXO ఎలక్ట్రిక్ బైక్

హోప్ ఓక్సో (HOP OXO) ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకునే కస్టమర్లు ఆన్‌లైన్ లో లేదా సమీపంలో ఉండే కంపెనీ ఎక్స్పీరియన్స్ సెంటర్ నుంచి కొనుగోలు చేయవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఈ బైక్ ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 150 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని ధృవీకరించబడింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ దేశీయ మార్కెట్లో విడుదల కాకముందే దాదాపు 5000 ఫ్రీ బుకింగ్స్ పొందినట్లు సమాచారం.

Hop OXO ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ 3.75kWh బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులో ఉంటుంది. ఇది 811 NMC సెల్‌లను ఉపయోగిస్తుంది. ఇది 6.9 బిహెచ్‌పి పవర్ మరియు 185 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. Hop OXO X విషయానికి వస్తే, ఇది 8.31బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ కేవలం 4 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో దీని గరిష్ట వేగం గంటకు 90 కిమీ వరకు ఉంటుంది.

Hop OXO ఎలక్ట్రిక్ బైక్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్. కావున మంచి రేంజ్ అందించడమే కాకుండా బ్యాటరీ మరియు మోటార్ రెండూ డస్ట్ అండ్ వాటర్ ఫ్రూఫ్ కోసం IP67 రేట్ పొందాయి. ఇది 16A ఛార్జర్‌ సాయంతో కేవలం నాలుగు గంటల సమయంలో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు.

Hop OXO ఎలక్ట్రిక్ బైక్ రెడ్ అండ్ బ్లూ అనే రెండు కలర్ ఆప్సన్స్ పొందుతుంది. కాగా Hop OXO X బైక్ గ్రీన్ మరియు గ్రే కలర్ ఆప్సన్స్ పొందుతుంది. ఇది బైక్ రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందించడానికి గొప్పగా రూపొందించబడింది. కావున దీని పొడవు 2,100 మిమీ, వెడల్పు 793 మిమీ, ఎత్తు 1,085 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్‌ 180 మిమీ వరకు ఉంటుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డిజిటల్ డిస్‌ప్లే, 4G కనెక్టివిటీ వంటివి అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి OXO యాప్ ద్వారా స్పీడ్ కంట్రోల్, జియో-ఫెన్సింగ్, యాంటీ-థెఫ్ట్ సిస్టమ్ వంటి అనేక ఫీచర్స్ యాక్సెన్స్ చేయవచ్చు. ఇవన్నీ బైక్ రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటాయి.

కొత్త HOP OXO ఎలక్ట్రిక్ బైక్ చాలా స్టైలిష్ డిజైన్ కలిగి ఉంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్‌, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ మరియు సింగిల్ పీస్ సీట్ మొదలైన ఉంటాయి. ఈ బైక్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ యూనిట్లు మరియు వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్‌ ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు మరియు వెనుక వైపు డిస్క్ బ్రేక్‌లను పొందుతాయి. మొత్తం మీద ఈ లేటెస్ట్ బైక్ చాలా అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Hop oxo electric bike test rides date details
Story first published: Saturday, November 12, 2022, 9:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X