భారత్‌లో మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కరించిన 'మ్యాటర్' [Matter]: కొత్త డిజైన్ & అద్భుతమైన ఫీచర్స్

ఎలక్ట్రిక్ వాహనాలకు (కార్లు మరియు బైకులు) దేశీయ మార్కెట్లో రోజు రోజుకి విపరీతమైన డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇందులో భాగంగానే కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తన సత్తా చాటుకోవడానికి 'మ్యాటర్ ఎనర్జీ' (Matter Energy) తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుందాం.

భారత్‌లో మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కరించిన Matter

మ్యాటర్ ఎనర్జీ ఆవిష్కరించిన కొత్త ఆధునిక ఎలక్ట్రిక్ బైక్ అద్భుతమైన డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 5.0 కిలోవాట్ లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ ఉంటుంది. ఇది IP67 రేటెడ్ పొందిన ఎలక్ట్రిక్ బ్యాటరీ, కావున దుమ్ము మరియు దూళి నుంచి రక్షణ పొందుతుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 125 కిమీ నుంచి 150 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ధృవీకరించబడింది.

అయితే వాస్తవ ప్రపంచంలో వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఈ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇది 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇది స్టాండర్డ్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 5 గంటలు.

డిజైన్ విషయానికి వస్తే, ఇది ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో LED టర్న్ సిగ్నల్స్ ఫ్యూయల్ ట్యాంక్‌పైన చూడవచ్చు. అదే సమయంలో స్ప్లిట్ సీట్లు, క్లిప్ ఆన్ హ్యాండిల్‌బార్లు మరియు పిలియన్ కోసం స్ప్లిట్ గ్రాబ్ రైల్‌ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా బై ఫంక్షనల్ LED హెడ్‌లైట్ చాలా కొత్తగా ఉంటుంది. ఇది చూపరులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

కొత్త మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఫీచర్స్ గమనించినట్లయితే, ఇందులో 7.0 ఇంచెస్ LCD టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ లభిస్తుంది. దీని ద్వారా రైడర్ బైక్ గురించేయ్ చాలా సమాచారం పొందవచ్చు. ఇందులో రిమోట్ లాక్/అన్‌లాక్, జియోఫెన్సింగ్, లైవ్ లొకేషన్ ట్రాకింగ్, వెహికల్ హెల్త్ మానిటరింగ్, ఛార్జింగ్ స్టేటస్ మరియు పుష్ నావిగేషన్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

భారత్‌లో మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కరించిన Matter

ఈ కొత్త ఎలక్ట్రిక్ బైకులో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, ఇందులో ఛార్జింగ్ సాకెట్‌ను కలిగి ఉన్న 'ట్యాంక్'పై చిన్న 5 లీటర్ గ్లోవ్‌బాక్స్‌ అందుబాటులో ఉంది. ఇలాంటి ఫీచర్స్ మరే ఇతర బైకులలో లేకపోవడం గమనార్హం. ఈ బైక్ మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. అవి స్పోర్ట్, ఎకో మరియు సిటీ మోడ్స్. ఇవన్నీ బైక్ వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

కొత్త మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. గ్రే అండ్ నియాన్, బ్లూ అండ్ గోల్డ్, బ్లేక్ అండ్ గోల్డ్ మరియు రెడ్/బ్లాక్/వైట్ కలర్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బైక్ యొక్క బుకింగ్స్ 2023 మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతాయి. డెలివరీలు 2023 ఏప్రిల్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Matter energy unveiled india s first electric motorcycle with 4 speed gearbox bookings will open soo
Story first published: Monday, November 21, 2022, 17:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X