Hero Vida ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవి తప్పకుండా తెలుసుకోండి

గత కొన్ని రోజులుగా హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'హీరో విడా' (Hero Vida) విడుదల చేయనున్నట్లు చెబుతూనే ఉంది. అయితే ఎట్టకేలకు నిన్న (అక్టోబర్ 07) భారతీయ విఫణిలో 'విడా' ఎలక్ట్రిక్ స్కూటర్ అధికారికంగా విడుదల చేసింది. అయితే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారు ఈ స్కూటర్ ధరలు మాత్రమే కాకుండా ఇతర ఫీచర్స్ మరియు రేంజ్ వంటి వాటిని కూడా తెలుసుకోవాలనుకుంటారు. అలాంటి వారికోసం ఈ కథనంలో హీరో విడా స్కూటర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Hero Vida ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవి తప్పకుండా తెలుసుకోండి

వేరియంట్స్ మరియు ధరలు:

మొదటగా ఎవరైనా ఒక వాహనం కొనాలకున్నప్పుడు ధరలను గమనిస్తారు. అంతే కాకుండా ఆ ధరకు తగిన ఫీచర్స్ అందులో ఉన్నాయా..? లేదా..? అని కూడా గమనిస్తారు. కావున హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి 'విడా వి1 ప్రో' కాగా మరొకటి 'విడా వి1 ప్లస్' ఎలక్ట్రిక్ స్కూటర్. వీటి ధరలు వరుసగా రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Hero Vida ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవి తప్పకుండా తెలుసుకోండి

బుకింగ్స్ మరియు డెలివరీలు:

హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ అక్టోబర్ 10 నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. కావున ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే కస్టమర్లు రూ. 2,499 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఈ సంవత్సరం చివరి నాటికి అంటే డిసెంబర్ లో ప్రారంభమవుతాయి.

Hero Vida ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవి తప్పకుండా తెలుసుకోండి

టాప్ స్పీడ్ మరియు రేంజ్:

కొత్త హీరో విడా V1 Plus ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 143 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ. అదే సమయంలో ఇది కేవలం 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

Hero Vida ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవి తప్పకుండా తెలుసుకోండి

ఇక Vida V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 165 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ వరకు ఉంటుంది. కాగా ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవతం అవుతుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు రిమూవబుల్ బ్యాటరీ కలిగి ఉంటాయి.

Hero Vida ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవి తప్పకుండా తెలుసుకోండి

డిజైన్ మరియు ఫీచర్స్:

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఈడీ లైటింగ్, ఫాలో-మీ హోమ్ హెడ్లాంప్, కీలెస్ ఎంట్రీ, ఎస్ఓఎస్ అలర్ట్ వంటివి వాటితో పాటు 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ కూడా పొందుతుంది.

Hero Vida ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవి తప్పకుండా తెలుసుకోండి

విడా ఎలక్ట్రిక్ స్కూటర్ పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ కూడా పొందుతుంది. దీని కెపాసిటీ 26లీటర్ల వరకు ఉంటుంది. ఇది స్పీట్ సీటుని పొందుతుంది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ మరియు ఫీచర్స్ చాలా అధునాతనంగా ఉంటాయి. కావున తప్పకుండా వాహన వినియోగదారులను ఆకర్శించనుంది.

Hero Vida ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవి తప్పకుండా తెలుసుకోండి

ప్రత్యర్థులు:

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికి 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) స్కూటర్ మరియు 'ఏథర్ 450ఎక్స్' (Ather 450X) ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యర్థిగా ఉంటాయి. ఈ రెండూ కూడా మార్కెట్లో ఉత్తమైన అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి.

Hero Vida ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవి తప్పకుండా తెలుసుకోండి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 'హీరో విడా' (Hero Vida) ని విడుదల చేసింది. ధర కూడా ఆకర్షణీయంగా ఉండటమే కాకూండా, ఆ ధరకు తగిన ఫీచర్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. కావున కొనుగోలుదారులు ఇవన్నీ గమనించి కొనుగోలు చేయవచ్చు.

భారతీయ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని ఆసితున్నాము. అయితే ఎలాంటి అమ్మకాలు పొందుతుంది అనేది త్వరలోనే తెలుస్తుంది. అప్పటివరకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి మరియు కొత్త కార్లు మారియు కొత్త బైకులు గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
New hero vida electric scooters range battery charging range and performance
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X