ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన 2022 Honda CB300R: ధర & వివరాలు

భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా ఎట్టకేలకు తన కొత్త 2022 హోండా సిబి300ఆర్ (2022 Honda CB300R) మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ధర రూ. 2.77 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కంపెనీ ఈ కొత్త బైక్‌ కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించింది. కావున ఈ బైక్ కొనాలనుకునేవారు కంపెనీ యొక్క బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లో బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన 2022 Honda CB300R: ధర & వివరాలు

2022 హోండా సిబి300ఆర్ బైక్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. ఇది రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అవి మ్యాట్ స్టీల్ బ్లాక్ మరియు పెరల్ స్పార్టన్ రెడ్ కలర్స్. ఈ బైక్ మొదటి సరి ఇటీవల కాలంలో జరిగిన 2021 ఇండియా బైక్ వీక్ లో ఆవిష్కరించబడింది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన 2022 Honda CB300R: ధర & వివరాలు

ఈ బైక్ లేటెస్ట్ డిజైన్‌లో రెట్రో లుక్‌తో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బైక్ ఎల్ఈడి యూనిట్లు మరియు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు దాని రౌండ్ హెడ్‌ల్యాంప్‌లలో ఇవ్వబడ్డాయి. అంతే కాకుండా ఇందులో ఫుల్ డిజిటల్ డిస్‌ప్లే, మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, స్ప్లిట్ సీట్లు, ఎల్ఈడి టైల్‌లైట్, కాంట్రాస్టింగ్ ఎగ్జాస్ట్, బ్లాక్ అల్లాయ్ వీల్స్ మరియు ఇంజన్ బ్లాక్ ప్రొటెక్టర్ వంటివి కూడా అందుబటులో ఉంటాయి.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన 2022 Honda CB300R: ధర & వివరాలు

ఈ కొత్త బైక్‌లోని కాంపాక్ట్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే బైక్ గురించిన చాలా సమాచారం అందిస్తుంది. ఇందులో ఇంజిన్ ఇన్హిబిటర్‌లతో పాటు గేర్ పొజిషన్ మరియు సైడ్ స్టాండ్ ఇండికేటర్‌ను కూడా పొందుతుంది. కొత్త హోండా CB300R ముందు వైపున 296 మిమీ హబ్-లెస్ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 220 మిమీ రియర్ డిస్క్ బ్రేక్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ పొందుతుంది. ఇక సస్పెన్షన్ సెటప్‌ విషయానికి వస్తే, ఇందులో గోల్డెన్ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్‌లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారునికి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన 2022 Honda CB300R: ధర & వివరాలు

2022 హోండా CB300R పిజిఎమ్-ఎఫ్ఐ టెక్నాలజీతో కూడిన 286 సిసి డిఓహెచ్సి ఫోర్-వాల్వ్ లిక్విడ్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఈ ఇంజన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 30.4 బిహెచ్‌పి పవర్ మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 27.4 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ పొందుతుంది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన 2022 Honda CB300R: ధర & వివరాలు

కొత్త 2022 హోండా CB300R బైక్‌లో డ్యూయల్ ఛానల్ ABS ఫీచర్‌తో పాటు అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్ స్టాండర్డ్‌గా ఉన్నాయి. ఇవి కాకుండా కంపెనీ ఈ బైక్‌లో ఎలాంటి కొత్త మార్పులు చేయలేదు. హోండా సిబి300ఆర్ భారతదేశంలోని కెటిఎమ్ 390 డ్యూక్, బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్ మరియు బజాజ్ డామినార్ 400 వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన 2022 Honda CB300R: ధర & వివరాలు

ఇదిలా ఉండగా కంపెనీ ఇటీవల 2021 డిసెంబర్ అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం, కంపెనీ గత డిసెంబర్‌లో 2,23,621 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు తెలిపింది. ఇందులో దేశీయ మార్కెట్లో 210,612 యూనిట్లను విక్రయించగా 13,009 యూనిట్లను మన దేశం నుంచి ఎగుమతి చేయడం జరిగింది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన 2022 Honda CB300R: ధర & వివరాలు

హోండా మోటార్ సైకిల్ కంపెనీ గత సంవత్సరం 4 ప్రీమియం ఉత్పత్తులను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో CBR650R, CB650R, CB500X మరియు CB350RS ఉన్నాయి. అంతే కాకుండా కంపెనీ ఆఫ్రికా ట్విన్ మరియు గోల్డ్‌వింగ్ మోడల్‌లను కూడా అప్డేట్ చేసింది. మరియు హోండా హైనెస్ CB350 యొక్క యానివెర్సరీ ఎడిషన్‌ను కూడా విడుదల చేసింది, ఇది పెరల్ ఇగ్నియస్ బ్లాక్ మరియు మ్యాట్ మార్షల్ గ్రీన్ రంగులలో లభిస్తుంది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన 2022 Honda CB300R: ధర & వివరాలు

2021 సంవత్సరంలో, కంపెనీ స్పెషల్ ఎడిషన్స్ కూడా విడుదల చేసింది. ఇందులో Grazia125 మరియు CB200 యొక్క Repsol వంటివి ఉన్నాయి. వీటితో పాటు కంపెనీ Activa125 యొక్క ప్రీమియం వెర్షన్ కూడా ప్రారంభించింది. హోండా కంపెనీ తన ద్విచక్ర వాహన వ్యాపారాన్ని భారతదేశం వెలుపల కూడా విస్తరించాలని యోచిస్తోంది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన 2022 Honda CB300R: ధర & వివరాలు

హోండా టూ వీలర్స్ ఇండియా దేశీయ విపణిలో 50 మిలియన్ల వాహనాల విక్రయాల మైలురాయిని అధిగమించింది. 16 ఏళ్లలో మొదటి 25 మిలియన్ల కస్టమర్లను పొందగలిగింది, తరువాత 25 మిలియన్ల కస్టమర్లను కేవలం ఐదేళ్లలో పూర్తి చేసింది. ఇది నిజంగా కంపెనీ సాధించిన గొప్ప విషయం అనే చెప్పాలి.

Most Read Articles

English summary
New honda cb300r launched in india price features details
Story first published: Wednesday, January 12, 2022, 17:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X