17,000 దాటిన 'ఒబెన్ రోర్' బుకింగ్స్.. డెలివరీ టైమ్ కూడా వెల్లడించింది

భారతీయ మార్కెట్లో బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ కంపెనీ 'ఒబెన్ ఈవీ', దేశీయ విఫణిలో తన కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'ఓబెన్ రోర్'ను ఇప్పటికే విడుదల చేసింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్ కోసం ఇప్పటికి మంచి బుకింగ్స్ పొందింది.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 'ఓబెన్ రోర్' ఎలక్ట్రిక్ బైక్ కోసం 17,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు మరియు డెలివరీలను 2023 మొదటి త్రైమాసికంలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. నిజానికి కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైకులను గత దీపావళి సందర్భంగా డెలివరీలను చేయాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కాస్త ఆలస్యమైంది. అయితే 2023 లో తప్పకుండా డెలివరీలు ప్రారంభమవుతాయి.

17,000 దాటిన ఒబెన్ రోర్ బుకింగ్స్

కంపెనీ త్వరలోనే ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క టెస్ట్ రైడ్ వంటి వాటిని కూడా ప్రారంభించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అంతే కాకూండా తన కార్య కార్యకలాపాలను బెంగళూరులో ప్రారంభించిన తరువాత దేశ వ్యాప్తంగా మరో తొమ్మిది నగరాల్లో తన కార్య కలాపాలను ప్రారభించే అవకాశం ఉంది. ఆ తరువాత మరిన్ని నగరాలలో విస్తరించనుంది. కంపెనీ దీని కోసం చేయవలసిన అన్ని ప్రయత్నాలను చేస్తోంది.

ఓవెన్ రోర్ యొక్క తయారీ కేంద్ర బెంగళూరుకు సమీపంలో ఉంది. ఇక్కడ కంపెనీ సంవత్సరానికి 3,00,000 కంటే ఎక్కువ యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది. దీని కోసం అంచెలంచెలుగా ముందుకు వెళ్ళడానికి కొన్ని ప్రణాళికలను కూడా తయారు చేసుకుంది. కావున కంపెనీ త్వరలోనే తన ఎలక్ట్రిక్ బైకును దేశం మొత్తంమీద విస్తరించనుంది. ఈ ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర రూ. 99,999 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ, ఫేమ్ సబ్సిడీ తరువాత).

ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ ముందు భాగంలో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్‌తో కూడిన రౌండ్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్‌లు మరియు ఎల్ఈడి టెయిల్‌ లాంప్‌ వంటి వాటిని పొందుతుంది. ఇది చూడటానికి ట్రెడిషనల్ ఐసి పవర్డ్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే కనిపిస్తుంది. అయితే ఇంజన్ స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, కాబట్టి ఇంజన్ నేలపై నుండి ఎత్తులో ఉన్నట్లు కనిపిస్తుంది.

ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ విశాలమైన హ్యాండిల్‌ బార్, ఛార్జింగ్ పోర్ట్, స్ప్లిట్ సీట్లు, ఎల్ఈడి వింకర్‌లతో కూడిన మస్కులర్ ప్యానెల్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్, షార్ప్ లుకింగ్ సైడ్ ప్యానెల్‌లు మరియు అండర్ కౌలింగ్ మొదలైన డిజైన్ ఎలిమెంట్స్ కూడా ఇందులో చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. బాడీ ప్యానెల్స్ మూడు కలర్స్ లో ఉంటుంది. అవి ఆరెంజ్, సిల్వర్ మరియు బ్లాక్ కలర్స్.

ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది బైక్ యొక్క స్పీడ్, బ్యాటరీ స్టేటస్, రైడింగ్ రేంజ్ వంటి సమాచారం అందిస్తుంది. అంతే కాకుండా రైడర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండటానికి ఇందులో డ్రైవర్ అలర్ట్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ అలారం, నావిగేషన్, వెహికల్ డయాగ్నస్టిక్స్, సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్‌ను గుర్తించడం వంటి కనెక్టింగ్ టెక్నాలజీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ ఫిక్స్డ్ 4.4 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ మరియు 13.4 బిహెచ్‌పి మరియు 62 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటాయి. ఒక ఫుల్ ఛార్జ్‌పై గరిష్టంగా 200 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది కేవలం 3 సెకన్లలో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 100కిమీ, కాగా ఇందులోని బ్యాటరీ కేవలం 2 గంటల సమయంలో ఫుల్ ఛార్జ్ చేసుకోగలదు.

Most Read Articles

English summary
Oben rorr pre booking reaches 17000 units and delivery details
Story first published: Thursday, December 1, 2022, 13:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X