ఇలా ఎలా అనిపించిన 'ఓలా ఎలక్ట్రిక్'.. 2022 నవంబర్ అమ్మకాల్లో మళ్ళీ రికార్డ్

ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' 2022 నవంబర్ నెల అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం కంపెనీ గత నెలలో 20,000 యూనిట్లను విక్రయించగలిగింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతదేశంలో పండుగ సీజన్ పూర్తయిపోయిన తరువాత కంపెనీ అమ్మకాలు ఏ మాత్రం తగ్గలేదు అనటానికి ఇదే నిదర్శనం. 2022 అక్టోబర్ నెలలో కూడా కంపెనీ 20,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించగలిగింది. అమ్మకాల విషయంలో వేగంగా ముందుకు సాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఎలక్ట్రిక్ టూవీలర్ అమ్మకాల్లో అగ్రగామిగా నిలిచింది. రానున్న రోజుల్లో కూడా కంపెనీ యొక్క అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 2022 నవంబర్ అమ్మకాల్లో మళ్ళీ రికార్డ్

కంపెనీ యొక్క అమ్మకాలను గురించి ఓలా ఎలక్ట్రిక్ CEO భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయించడానికి కంపెనీలు పోటీపడుతున్నాయి. అయినప్పటికీ ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేయగలిగింది. అంతే కాకుండా 2025 నాటి భారతీయ టూ వీలర్ విభాగంలో అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే ఉండే అవకాశం ఉందని కూడా ఆయన వెల్లడించారు.

ఓలా ఎలక్ట్రిక్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్లు తమిళనాడులోని కృష్ణగిరి కంపెనీ ఫ్యాక్టరీలో తయారుచేయబడతాయని అందరికి తెలుసు. కంపెనీ ఇప్పటి వరకు దేశీయ మార్కెట్లో ఓలా ఎస్1, ఎస్1 ప్రో మరియు ఎస్1 ఎయిర్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసి మంచి అమాంకాలను పొందుతోంది. కాగా కంపెనీ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కారుని కూడా విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచారం కూడా వెల్లడైంది.

ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలను మరింత పెంచుకోవడానికి మరియు కస్టమర్లకు మరింత చేరువ కావడానికి దేశం మొత్తమ్ మీద ఎక్స్పీరియన్స్ సెంటర్లను వేగంగా ప్రారభిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పటికే మొత్తమ్ 11 నగరాల్లో 14 కొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ప్రారంభించింది. ఇప్పటి వరకు బెంగళూరులో 3, పూణేలో రెండు, అహ్మదాబాద్‌, డెహ్రాడూన్‌, ఢిల్లీ, హైదరాబాద్‌, కోట, భోపాల్‌, నాగ్‌పూర్‌, రాంచీ, వడోదర వంటి ప్రాంతాల్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించింది.

భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్ 2023 మార్చి నెల నాటికి 200 ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించడానికి తగిన ప్రయత్నాలను చేస్తుంది. ఇదే జరిగితే కంపెనీ ఎలక్ట్రిక్ వాహన రంగంలో కొత్త శకం ప్రారభించే అవకాశం ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లన్నీ కూడా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను గురించి తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా.. టెస్ట్ రైడ్ వంటి వాటికి సంబంధించిన చాలా విషయాలను తెలుసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

ఇదిలా ఉండగా గత దీపావళి సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ 'ఎస్1 ఎయిర్' స్కూటర్ లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 84,999 (ఎక్స్-షోరూమ్). ఇది ఒక ఫుల్ చార్జ్ తో గరిష్టంగా 101 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులో 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మరియు 4.5 కిలోవాట్ హబ్-మౌంటెడ్ మోటారు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లవరకు ఉంటుంది.

దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ కాకుండా టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ ఎనర్జీ స్కూటర్లు మరియు బజాజ్ చేతక్ వంటి వున్నాయి. రానున్న రోజుల్లో కొత్త ఉత్పత్తులు కూడా పుట్టుకొచ్చే అవకాశం ఉంది. కావున ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఉత్పత్తులు వేగంగా పెరుగుతాయి. కావున మార్కెట్లో గట్టి పోటీ ఏర్పడుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Ola electric sales in 2022 november
Story first published: Saturday, December 3, 2022, 6:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X