Just In
- 4 hrs ago
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- 7 hrs ago
కొత్త సంవత్సరంలో కూడా తగ్గని ధరల మోత: XUV700 ధరలు మళ్ళీ పెరిగాయ్..
- 8 hrs ago
మరింత అందంగా మారిపోయిన జావా 42 & యెజ్డీ రోడ్‌స్టర్: ఇవి తప్పకుండా మీ మనసు దోచేస్తాయ్..
- 11 hrs ago
రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన వారికి గొప్ప గుర్తింపు.. వీడియో
Don't Miss
- News
త్రిపురలో 48 మందితో బీజేపీ తొలి జాబితా-మాజీ సీఎం విప్లవ్ కు షాక్-కేంద్రమంత్రి ప్రతిమకు చోటు
- Lifestyle
మీ పార్ట్నర్ ఎప్పుడూ మూడీగా ఉంటారా? వారితో వేగలేకపోతున్నారా? ఈ చిట్కాలు మీకోసమే
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Movies
సీనియర్ నటి జమున బయోపిక్.. ఆ బ్యూటీఫుల్ హీరోయిన్ కోసం చర్చలు!
- Sports
INDvsNZ : ఉమ్రాన్ మాలిక్‌ను తీసేయండి.. రెండో టీ20కి మాజీ లెజెండ్ సలహా!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
అమ్మకాల్లో తిరుగులేని 'హంటర్ 350': రాయల్ ఎన్‌ఫీల్డ్ జోరు మరింత పెరిగిందోచ్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'రాయల్ ఎన్‌ఫీల్డ్' తన కొత్త 'హంటర్ 350' బైకుని కేవలం మూడు నెలలో కాలంలో గొప్ప విక్రయాలను పొందగలిగింది. అమ్మకాలలో ఇది కంపెనీ సాధించిన గొప్ప ఘనత అనే చెప్పాలి.
కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2022 ఆగష్టు, సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలలో ప్రతి నెల 15,000 యూనిట్లకు తగ్గకుండా కొత్త 'హంటర్ 350' విక్రయించబడింది. మొత్తం మీదుగా అమ్మకాల పరంగా ఈ 'రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350' (Royal Enfield Hunter 350) 50,000 యూనిట్లు దాటేసింది. దీన్ని బట్టి చూస్తే దేశీయ మార్కెట్లో హంటర్ 350 కి ఎంత ఆదరణ ఉందొ స్పష్టమవుతుంది.

మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తే, హంటర్ 350 బైక్ 2022 ఆగస్టు నెలలో 18,197 యూనిట్లు, 202 సెప్టెంబర్ నెలలో 17,118 యూనిట్లు మరియు 2022 అక్టోబర్ నెలలో 15,445 యూనిట్లు అమ్మకాలు పొందినట్లు తెలిసింది. ఈ కొత్త బైక్ లేటెస్ట్ డిజైన్, అధునాత ఫీచర్స్ కలిగి ఉండి రూ. 1.50 లక్షల నుంచి రూ. 1.64 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉండటం వల్ల అమ్మకాల్లో శరవేగంగా దూసుకెళ్తోంది.
కొత్త 'రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350' రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి రెట్రో వేరియంట్ మరియు మెట్రో వేరియంట్. ఈ బైక్ ఇతర 350సీసీ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే అదే J-సిరీస్ ప్లాట్‌ఫామ్ పై రూపొందించబడింది. కావున ముందు భాగంలో స్పోర్ట్స్ సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు టర్న్ సిగ్నల్స్‌తో పాటు రౌండ్ సెమీ-డిజిటల్ స్పీడోమీటర్ కన్సోల్ వంటివి ఉన్నాయి, ట్రిప్పర్ డిస్‌ప్లే మాత్రం ఆప్సనల్ గా ఎంచుకోవచ్చు.
టియర్‌డ్రాప్ ఆకారంలో ఉండే ఫ్యూయల్ ట్యాంక్‌కు ఇరువైపులా క్రీజ్‌లు ఉన్నాయి, ఇక సైడ్ ప్యానల్ లో హంటర్ 350 లోగో కూడా చూడవచ్చు. ఈ బైక్ యొక్క దూకుడును మరింత పెంచడానికి ఫుట్‌పెగ్‌లు మరియు సింగిల్ స్టెప్డ్ సీటు వంటివి ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ లో రౌండ్ LED టైల్‌లైట్స్ మరియు టర్న్ ఇండికేటర్‌లతో పాటు స్ప్లిట్ గ్రాబ్ రైల్ సెటప్ కూడా ఉంటుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ 349 సిసి సింగిల్-సిలిండర్, టూ-వాల్వ్, SOHC, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 6100 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పి పవర్ మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ యొక్క పరిధి 36.2 కిమీ/లీ వరకు ఉంటుంది. అదే సమయంలో దీని టాప్ స్పీడ్ 114కిమీ/గంట.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 యొక్క ముందువైపు 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్‌లతో కూడిన ట్విన్ డౌన్‌ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ సెటప్ మరియు 6 వే అడ్జస్టబుల్ ప్రీలోడ్‌తో వెనుకవైపు ట్విన్ షాక్‌లను కలిగి ఉంది. అదే సమయంలో ఈ బైక్ యొక్క ముందు భాగంలో 110/70-17 54P మరియు వెనుకవైపు 140/70 - 17 - 66P ట్యూబ్‌లెస్ టైర్‌లు ఉంటాయి. ఇది 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.
హంటర్ 350 బ్రేకింగ్ విషయానికి వస్తే, దీని ముందు వైపు ట్విన్ పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌తో 300 మిమీ ఫిక్స్‌డ్ డిస్క్ బ్రేక్స్ మరియు వెనుక భాగంలో సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌తో 270 మిమీ బ్రేక్ అందుబాటులో ఉంటుంది. అయితే హంటర్ 350 మెట్రో వేరియంట్లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ అందుబాటులో ఉంటుంది. కానీ హంటర్ 350 రెట్రో వేరియంట్ సింగిల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 పరిమాణం పరంగా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ బైక్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 2,055 మిమీ, వెడల్పు 800 మిమీ, ఎత్తు 1,055 మిమీ కలిగి ఉంటుంది. వీల్‌బేస్ 1,370 మిమీ వరకు ఉంటుంది. ఇక సీట్ ఎత్తు భూమి నుండి 800 మిమీ వరకు ఉంటుంది. కావున రైడర్ కి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.