భారత్‌లో 'సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఈఎక్స్' లాంచ్: ధర & వివరాలు

దేశీయ మార్కెట్లో 'సుజుకి మోటార్‌సైకిల్' ఎట్టకేలకు తన కొత్త 'బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఈఎక్స్' (Burgman Street EX) లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ ధర రూ. 1,12,300 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇప్పటి వరకు 125 సిసి విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఇప్పుడు బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఈఎక్స్ రూపంలో భారతీయ విఫణిలో అడుగుపెట్టింది. ఈ కొత్త స్కూటర్ మొత్తం మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి మెటాలిక్ మ్యాట్ ప్లాటినం సిల్వర్, మెటాలిక్ రాయల్ బ్రాంజ్ మరియు మెటాలిక్ మ్యాట్ బ్లాక్ కలర్స్. ఇప్పటికే ఈ కొత్త మోడల్ విదేశీ మార్కెట్లో అమ్మకానికి ఉంది.

భారత్‌లో బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఈఎక్స్ లాంచ్

బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఈఎక్స్ 125 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్‌తో పనిచేస్తుంది. అయితే ఇది తక్కువ ఆర్‌పిఎమ్ వద్ద దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా 0.1 హెచ్‌పి తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. కానీ టార్క్ (10Nm) మాత్రం అదే విధంగా ఉంటుంది. ఈ ఇంజిన్ ఇప్పుడు ఆటో స్టాప్/స్టార్ట్ సిస్టమ్ మరియు సైలెంట్ స్టార్టర్ సిస్టమ్‌తో పాటుగా అందుబాటులో ఉంటుంది.

ఇప్పుడు బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఈఎక్స్ లో అందుబాటులో ఉన్న ఇంజిన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్ స్కూటర్ యొక్క ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. ఇప్పటికే విక్రయించబడుతున్న బర్గ్‌మాన్ స్ట్రీట్ వేరియంట్‌లతో పోలిస్తే, EX వేరియంట్ 100/80-12 టైర్ మరియు 10 ఇంచెస్ స్థానాల్లో 12 ఇంచెస్ రియర్ వీల్ అమర్చబడి ఉంటుంది. ఈ కొత్త మోడల్ దాని మునుపటి కంటే కూడా కొంత ఎక్కువ బరువుని కలిగి ఉంటుంది.

భారత్‌లో బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఈఎక్స్ లాంచ్

కొత్త బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఈఎక్స్ బరువు ఇప్పుడు 111 కేజీల వరకు ఉంటుంది, కాగా వీల్‌బేస్‌ పొడవు 25 మిమీ వరకు ఉంటుంది. ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా 5 మిమీ తక్కువ. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది ఎల్ఈడీ హెడ్ లైట్, బ్లూటూత్ ఎనేబుల్ ఎల్సిడి మరియు USB-ఛార్జింగ్ సాకెట్‌ వంటి వాటిని పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

భారతీయ మార్కెట్లో మ్యాక్సీ స్కూటర్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే సుజుకి కంపెనీ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ విడుదల చేసింది. అయితే ఇప్పుడు మరికొన్ని అప్డేట్స్ తో బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ EX రూపంలో తీసుకువచ్చింది. ఇది దాని స్టాండర్డ్ బర్గ్‌మ్యాన్ కంటే రూ. 22,400 మరియు రైడ్ కనెక్ట్ వెర్షన్ కంటే కూడా రూ. 19,000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంటుంది.

కొత్త సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఈఎక్స్ స్కూటర్ దేశీయ మార్కెట్లో ఈ విభాగంలో ఏప్రిలియా SXR 125 మ్యాక్సీ స్కూటర్ కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. మ్యాక్సీ స్కూటర్ విభాగంలో ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ కూడా మంచి అమ్మకాలు పొందుతున్న స్కూటర్. కావున గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఈఎక్స్ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఇప్పుడు ఈఎక్స్ రూపంలో విడుదల కావడం వల్ల ఈ స్కూటర్ లో అప్డేట్స్ కోరుకునే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. కావున మార్కెట్లో మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడంతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు, బైకుల గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Suzuki burgman street ex launched in india price features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X