2023 ప్రారంభం నుంచి ఖరీదైనవిగా మారనుకున్న Tork Kratos బైకులు: పూర్తి వివరాలు

2023 జనవరి 01వ తేదీ నుంచే చాలా వాహన తయారీ సంస్థలు తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. అయితే ఇప్పుడు ఈ జాబితాలో ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ 'టోర్క్ మోటార్స్' కూడా చేరింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

టోర్క్ మోటార్స్ రానున్న కొత్త సంవత్సరంలో తన ఉత్పత్తులైన 'క్రటోస్ మరియు క్రటోస్ ఆర్' ధరలను రూ. 10,000 వరకు పెంచనుంది. ధరల పెరుగుదల తరువాత వీటి ధరలు వరుసగా రూ. 1,32,499 (క్రటోస్) మరియు రూ. 1,47,499 (క్రటోస్ ఆర్) వరకు ఉంటాయి (ధరలు ఎక్స్-షోరూమ్ మహారాష్ట్ర, FAME-2 మరియు రాష్ట్ర సబ్సిడీల తర్వాత). ఈ కొత్త ధరలు 2023 జనవరి 01 నుంచి అమలులోకి వస్తాయి.

2023 ప్రారంభం నుంచి ఖరీదైనవిగా మారనుకున్న Tork Kratos బైకులు

నిజానికి దేశీయ మార్కెట్లో విడుదలైనప్పుడు ఈ 'క్రటోస్ మరియు క్రటోస్ ఆర్' ధరలు రూ. 1,07,999 మరియు రూ. 1,22,999 వద్ద ఉన్నాయి (ధరలు ఎక్స్-షోరూమ్ మహారాష్ట్ర, FAME-2 మరియు రాష్ట్ర సబ్సిడీల తర్వాత). అయితే రానున్న రోజుల్లో ఈ ధరలు భారీగా పెరుగుతాయని ఇప్పుడే స్పష్టంగా తెలుస్తోంది. దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే భారీ పెరుగుదలను ఈ బైకులు అందుకున్నాయి.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఇప్పటివరకు పెరిగిన ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా ధరలను పెంచవలసి వచ్చిందని తెలిసింది. అయితే ఈ సంవత్సరం (2022 డిసెంబర్) చివరి లోపు కొనుగోలు చేసేవారు మాత్రమే ప్రస్తుత ధరల వద్ద కొనుగోలు చేయగలరు. ఆ తరువాత జనవరి 01 నుంచుము కొత్త ధరలు అమలులోకి వస్తాయి. అప్పుడు ఈ బైక్ ధరలు ఆ కొత్త ధరల వద్ద మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.

క్రటోస్ బైక్ 7.5kW ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్ 4 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 10బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ ఒక ఫుల్ ఛార్జింగ్‌తో గరిష్టంగా 120 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది కేవలం 4 సెకన్లలో గంటకు 0-40 కిమీ వరకు వేగవంతం కాగా, గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు.

ఇక టోర్క్ క్రటోస్-ఆర్ బైక్ విషయానికి వస్తే, ఇది 9kW ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. ఇది 12 బిహెచ్‌పి పవర్ మరియు 38 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ వేరియంట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్సన్ తో కూడా అందుబాటులో ఉంటుంది. కావున ఇది కేవలం 60 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు.

టోర్క్ మోటార్స్ యొక్క క్రటోస్ మరియు క్రటోస్-ఆర్ రెండు ఎకో, సిటీ మరియు స్పోర్ట్స్ అనే 3 రైడింగ్ మోడ్‌లను పొందుతాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ రివర్స్ మోడ్ కూడా పొందుతాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనోషాక్‌ ద్వారా నిర్వహిచబడుతుంది. క్రటోస్ యొక్క రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో సిబిఎస్ స్టాండర్డ్ గా అందుబాటులో ఉంటుంది.

ఇదిలా ఉండగా టోర్క్ మోటార్స్ తమ క్రటోస్ బైకుల యొక్క డెలివరీలను మరింత వేగవంతం చేయడానికి మహారాష్ట్రలోని చకాన్‌ వద్ద కొత్త ప్లాంట్ సిద్ధం చేస్తోంది. నికి సంబంధించిన అన్ని పనులు కూడా దాదాపు 95 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఇది దాదాపు 60,000 చదరపు అడుగుల విస్తీరణంలో నిర్మించబడి ఉంది. ఇందులో నెలకు 4,000 నుంచి 5,000 యూనిట్లను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Tork kratos electric bike prices hike from 2023 january
Story first published: Tuesday, December 13, 2022, 14:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X