అల్ట్రావయోలెట్ F77 vs కెటిఎమ్ ఆర్‌సి 390: ఇందులో బెస్ట్ ఏదంటే?

భారతీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిపోతున్న సమయంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహన విభాగం మీదనే దృస్టి సారిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల బెంగళూరు EV స్టార్టప్ కంపెనీ 'అల్ట్రావయోలెట్' తన కొత్త 'ఎఫ్77' ఎలక్ట్రిక్ బైక్ విడుదల చేసింది.

కొత్త అల్ట్రావయోలెట్ F77 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌ తప్పకుండా భావితరాలకు కూడా ఇష్టమైన బైక్ అవుతుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ ఇప్పటికే దేశీయ మార్కెట్లో అమ్మకాల్ని ఉన్న కెటిఎమ్ 'ఆర్‌సి 390' బైకుకి ప్రత్యర్థిగా ఉంటుంది. ఒక ఎలక్ట్రిక్ బైక్ పెట్రోల్ బైకుకి ప్రత్యర్థిగా ఉంటుందా, ఉంటే వీటి డిజైన్, ఫీచర్స్ మరియు పర్ఫామెన్స్ వంటి వాటిలో ఎలాంటి వ్యత్యాసం ఉంది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అల్ట్రావయోలెట్ F77 vs కెటిఎమ్ ఆర్‌సి 390

ధరలు:

ఏ బైక్ అయినా మార్కెట్లో విడుదలైతే దాని ధర గురించి తెలుసుకోవడం సహజం, కావున ఈ రెండు బైకుల యొక్క ధరల విషయానికి వస్తే, అల్ట్రావయోలెట్ ఎఫ్77, రీకాన్ మరియు లిమిటెడ్ ఎడిషన్ అనే మూడు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు వరుసగా రూ.3.80 లక్షలు, రూ.4.55 లక్షలు మరియు రూ.5.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). కెటిఎమ్ ఆర్‌సి 390 బైక్ రూ.3.14 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంటుంది.

పవర్‌ప్లాంట్స్:

అల్ట్రావయోలెట్ ఎఫ్77 వేరియంట్ 7.1kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 207 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. అదే సమయంలో రీకాన్ వేరియంట్ 10.3kWh బ్యాటరీ ప్యాక్ కలిగి 307 కిమీ రేంజ్ అందిస్తుంది. అంటే ఎఫ్77 వేరియంట్ కంటే కూడా రీకాన్ వేరియంట్ రేంజ్ 100 కిమీ ఎక్కువ అని స్పష్టంగా అర్థమవుతోంది. లిమిటెడ్ ఎడిషన్ కూడా 307 కిమీ రేంజ్ అందిస్తుంది.

కెటిఎమ్ ఆర్‌సి 390 బైక్ 373 సిసి సింగిల్-సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9000 ఆర్‌పిఎమ్ వద్ద 42.9 బిహెచ్‌పి పవర్ మరియు 7000 ఆర్‌పిఎమ్ వద్ద 37 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఇది 13.7 లీటర్ల కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉంటుంది, కావున ఒక ఫుల్ ట్యాంక్‌తో 427 కిమీ మైలేజ్ అందిస్తుంది.

డిజైన్ & ఫీచర్స్:

అల్ట్రావయోలెట్ ఎఫ్77 ఎలక్ట్రిక్ బైక్ యొక్క ముందు భాగంలో ఎల్ఈడీ లైట్, వెనుక స్ప్లిట్ LED టైల్‌లైట్లు ఉంటాయి. ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 5 ఇంచెస్ TFT డాష్‌తో టర్న్-బై-టర్న్ నావిగేషన్ మరియు నోటిఫికేషన్ అలర్ట్‌లు వంటి ఫీచర్లను ఎనేబుల్ చేయవచ్చు. అంతే కాకుండా.. ఇందులో రైడ్ అనలిటిక్స్, రియల్ టైమ్ లొకేషన్, క్రాష్ డిటెక్షన్ మరియు బ్యాటరీ స్టాటిస్టిక్స్ వంటి ఫీచర్లను గమనించవచ్చు.

కెటిఎమ్ ఆర్‌సి 390 దాని మునుపటి మోడల్ కన్నా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బైక్ ముందు భాగంలో మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇందులో మునుపటి బైక్‌లోని వెర్టికల్ ట్విన్ పాడ్ హెడ్‌లైట్ స్థానంలో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన పెద్ద సింగిల్ ఎల్ఈడి యూనిట్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఉన్న కొత్త టిఎఫ్‌టి డిస్‌ప్లే యూనిట్ యాంబియంట్ లైట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్:

అల్ట్రావయోలెట్ ఎఫ్77 స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది, ఈ బైక్ యొక్క ముందువైపు 41 మిమీ USD ఫోర్క్ మరియు వెనుకవైపు ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్‌ ఉంటుంది. బ్రేకులా విషయానికి వస్తే, ముందువైపు 320 మిమీ డిస్క్ మరియు వెనుకవైపు 230 మిమీ డిస్క్ ఉంటుంది. ఇది డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కలిగి ఉంటుంది. మొత్తమ్ మీద బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ సెటప్ చాలా అద్భుతంగా ఉంటుంది.

కెటిఎమ్ ఆర్‌సి 390 బైక్ 17 ఇంచ్ వీల్స్ కలిగి కొత్త 5-స్పోక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో 120 మిమీ ట్రావెల్‌తో కూడిన అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్‌లు మరియు వెనుకవైపు 150 మిమీ ట్రావెల్‌తో మోనోషాక్‌ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 158 మిమీ కాగా, ఇది రేసింగ్ బ్లూ మరియు ఎలక్ట్రిక్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Most Read Articles

English summary
Ultraviolette f77 vs ktm rc 390 power price and details
Story first published: Monday, November 28, 2022, 8:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X