Yezdi Roadster Vs Royal Enfield Classic 350: ఇందులో ఏది బెస్ట్?

సుదీర్ఘ విరామం తర్వాత యెజ్డీ మోటార్‌సైకిల్స్ (Yezdi Motorcycles) భారతీయ ఆటో మొబైల్ మార్కెట్లో అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే కంపెనీ ఏకంగా మూడు బైకులను విడుదల చేసింది. ఈ మూడు బైకులు కూడా నేరుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు ప్రత్యర్థిగా ఉంటాయి.

అయితే ఇప్పుడు Yezdi బ్రాండ్ యొక్క Yezdi Roadster మరియు Royal Enfield Classic 350 మధ్య తేడాలేంటి, వీటి ధర, ఫీచర్స్ మరియు ఇతర అన్ని వివరాలను గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.. రండి.

Yezdi Roadster Vs Royal Enfield Classic 350: ఇందులో ఏది బెస్ట్?

Yezdi Roadster Vs Royal Enfield Classic 350 - ధర:

మొదటగా Yezdi Roadster యొక్క ధరల విషయానికి వస్తే ఇది దాని కలర్ ఆప్సన్ మీద ఆధారపడి ఉంటుంది. దీని ధర రూ. 1.98 లక్షల నుండి మొదలై రూ. 2.06 లక్షల వరకు ఉంటుంది.

  • యెజ్డీ రోడ్‌స్టర్ డార్క్ - స్మోక్ గ్రే (Yezdi Roadster Dark - Smoke Grey): రూ. 1,98,142
  • యెజ్డీ రోడ్‌స్టర్ డార్క్ - స్టీల్ బ్లూ (Yezdi Roadster Dark - Steel Blue): రూ. 2,02,142
  • యెజ్డీ రోడ్‌స్టర్ డార్క్ - హంటర్ గ్రీన్ (Yezdi Roadster Dark - Hunter Green): రూ. 2,02,142
  • యెజ్డీ రోడ్‌స్టర్ క్రోమ్ - గాలంట్ గ్రే (Yezdi Roadster Chrome - Gallant Grey): రూ. 2,06,142
  • యెజ్డీ రోడ్‌స్టర్ క్రోమ్ - సిన్ సిల్వర్ (Yezdi Roadster Chrome - Sin Silver): రూ. 2,06,142
  • Yezdi Roadster Vs Royal Enfield Classic 350: ఇందులో ఏది బెస్ట్?

    ఇక కొత్త Royal Enfield Classic 350 ధరల విషయానికి వస్తే, వీటి ధరలు రూ. 1.87 లక్షల నుండి రూ. 2.18 లక్షల వరకు ఉంటుంది.

    • REDDITCH - ధర రూ. 1.87 లక్షలు
    • HALCYON - ధర రూ. 1.96 లక్షలు
    • SIGNALS - ధర రూ. 2.07 లక్షలు
    • DARK - ధర రూ. 2.14 లక్షలు
    • CHOROME - ధర రూ. 2.18 లక్షలు
    • Yezdi Roadster Vs Royal Enfield Classic 350: ఇందులో ఏది బెస్ట్?

      Yezdi Roadster Vs Royal Enfield Classic 350 - డిజైన్ & ఫీచర్లు:

      దేశీయ మార్కెక్ట్లో విడుదలైన కొత్త 2022 Yezdi రోడ్‌స్టర్ బైక్ డిజైన్ దాని మునుపటి మోడల్స్ నుండి ప్రేరణ పొందింది. ఈ బైక్‌లో LED హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ LED DRL లు, LED టెయిల్ లైట్లు మరియు LED టర్న్ ఇండికేటర్‌లు ఉన్నాయి. అంతే కాకూండా ఈ బైక్ యొక్క హెడ్‌లైట్ పైన పెద్ద మరియు పొడవైన విండ్‌స్క్రీన్ కూడా ఇన్‌స్టాల్ చేయబడింది. డిజైన్ పరంగా, ఈ బైక్ జావా క్లాసిక్ 300 లాగా కనిపిస్తుంది.

      Yezdi Roadster Vs Royal Enfield Classic 350: ఇందులో ఏది బెస్ట్?

      Yezdi Roadster బైక్‌కు టియర్ డ్రాప్ షేప్ ఫ్యూయల్ ట్యాంక్, డ్యూయల్ సైలెన్సర్, బ్యాక్ రెస్ట్, సర్క్యులర్ ఎల్‌ఇడి టెయిల్ లైట్, స్ప్లిట్ సీట్, సర్క్యులర్ రియర్ వ్యూ మిర్రర్ మరియు సౌకర్యవంతమైన స్థితిలో ఫుట్ రెస్ట్ ఇవ్వబడింది.

      వీటితో పాటు ఈ బైక్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది, ఇది ట్రిప్ మీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్ మరియు టాకోమీటర్ వంటి సమాచారం అందిస్తుంది. బైక్ డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లతో డ్యూయల్ ఛానల్ ABS కూడా పొందుతుంది. ఇది మొబైల్ ఫోన్‌లు లేదా గాడ్జెట్‌లను ఛార్జ్ చేయడానికి USB పోర్ట్‌ను కూడా కలిగి ఉంది. మొత్తానికి ఇది అద్భుతమైన ఫీచర్స్ పొంది ఉంది.

      Yezdi Roadster Vs Royal Enfield Classic 350: ఇందులో ఏది బెస్ట్?

      కొత్త Royal Enfield Classic 350 విషయానికి వస్తే, ఇది రెట్రో క్లాసిక్ డిజైన్ పొందుతుంది. ఇటీవల, కంపెనీ తన కొత్త మోడల్‌ను డిజైన్ మరియు ఫీచర్ అప్‌డేట్‌లతో పరిచయం చేసింది. కొత్త క్లాసిక్ 350 రౌండ్ ఎల్ఈడి హెడ్‌లైట్‌, టెయిల్ లైట్, టియర్ డ్రాప్ ఆకారంలో 13-లీటర్ ఇంధన ట్యాంక్, స్ప్లిట్ సీట్లు మరియు ట్యూబ్యులర్ గ్రాబ్ రెయిల్‌ వంటి వాటిని పొందుతుంది.

      Yezdi Roadster Vs Royal Enfield Classic 350: ఇందులో ఏది బెస్ట్?

      అంతే కాకుండా ఈ కొత్త మోడల్‌లో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. కన్సోల్ స్పీడోమీటర్ మరియు ట్రిప్ మీటర్‌తో పాటు టర్న్-బై-టర్న్ నావిగేషన్ కోసం ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్‌ను పొందుతుంది. ఇది చిన్న డిస్‌ప్లేను కలిగి ఉంటుంది, దీనిలో రైడర్ దిశ గురించి సమాచారాన్ని పొందుతాడు. క్లాసిక్ 350 ఒకే ఛానెల్ మరియు డ్యూయల్ ఛానల్ ABS మోడల్ మధ్య ఎంచుకోవడానికి ఎంపికను పొందుతుంది.

      Yezdi Roadster Vs Royal Enfield Classic 350: ఇందులో ఏది బెస్ట్?

      Yezdi Roadster Vs Royal Enfield Classic 350 - ఇంజిన్:

      కొత్త యెజ్డీ రోడ్‌స్టర్ ఇంజిన్‌ను జావా పెరాక్ నుండి పొందింది. ఇందులో 334 సిసి సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 29.3 బిహెచ్‌పి పవర్ మరియు 29 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది ట్విన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా పొందుతుంది, అదే సమయంలో ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

      Yezdi Roadster Vs Royal Enfield Classic 350: ఇందులో ఏది బెస్ట్?

      కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ 349 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.3 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

      Yezdi Roadster Vs Royal Enfield Classic 350: ఇందులో ఏది బెస్ట్?

      Yezdi Roadster Vs Royal Enfield Classic 350 - సస్పెన్షన్, టైర్స్ & బ్రేకులు

      2022 Yezdi రోడ్‌స్టర్ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌లను మరియు వెనుక వైపున ట్విన్ స్ప్రింగ్ లోడ్ సస్పెన్షన్ సెటప్‌ను పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో 320 మిమీ మరియు వెనుక వైపు 240 మిమీ డిస్క్ బ్రేక్‌లు అందుబాటులో ఉన్నాయి.

      Yezdi రోడ్‌స్టర్ బైక్ ముందువైపు 100/90 సెక్షన్ ట్యూబ్‌లెస్ టైర్‌లతో 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు వెనుకవైపు 130/80 సెక్షన్ టైర్‌లతో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది. దీని బరువు 184 కేజీల వరకు ఉంటుంది. అదే విధంగా ఈ బైక్ 12.5 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది.

      Yezdi Roadster Vs Royal Enfield Classic 350: ఇందులో ఏది బెస్ట్?

      Royal Enfield Classic 350 బైక్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌లను మరియు వెనుక వైపున స్ప్రింగ్‌లోడెడ్ 6-స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ సెటప్‌ను పొందుతుంది. ఈ బైక్ ముందువైపు డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుకవైపు డిస్క్ లేదా డ్రమ్ బ్రేక్‌ ఆప్సన్ అందుబాటులో ఉంటుంది.

      ఈ బైక్ ముందువైపు 100/90 సెక్షన్ టైర్లతో 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు వెనుకవైపు 120/80 సెక్టార్ టైర్లతో 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. బైక్‌లో రెండు టైర్లు ట్యూబ్‌లెస్‌గా ఉన్నాయి. క్లాసిక్ 350 బైక్ బరువు 195 కేజీలు కాగా, ఇది 13 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది.

Most Read Articles

English summary
Yezdi roadster vs royal enfield classic 350 price features specifications comparison
Story first published: Friday, January 14, 2022, 15:46 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X