ఆటో ఎక్స్‌పో 2023: iQube నుంచి మరో వేరియంట్ ఆవిష్కరించిన TVS

టీవీఎస్ కంపెనీ దేశీయ మార్కెట్లో 2023 ఆటో ఎక్స్‌పో వేదికగా అప్‌డేట్ చేయబడిన iQube ST ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించింది. టీవీఎస్ యొక్క ఈ ఆధునిక iQube ST ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

టీవీఎస్ కంపెనీ ఆవిష్కరించిన 2023 TVS iQube టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు వాయిస్ అసిస్ట్ రూపంలో రెండు కొత్త ఫీచర్‌లను పొందింది. నిజానికి కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని గత సంవత్సరంలోనే ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో ఎల్‌ఈడీ లైట్, సింగిల్ పీస్ సీటు మరియు గ్రాబ్ రైల్‌ వంటివి ఉంటాయి.

iQube నుంచి మరో వేరియంట్ ఆవిష్కరించిన TVS

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఇప్పుడు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది టైర్ ప్రెజర్‌ మీద నిఘా ఉంచడానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో గమనించదగిన మరో ఫీచర్ వాయిస్ అసిస్ట్. ఇది కూడా ఈ ఆధునిక కాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో USB ఛార్జింగ్ పోర్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, రైడ్ మోడ్‌లు, కాల్ మరియు మ్యూజిక్ కంట్రోల్స్, పార్క్ అసిస్ట్, జియో-ఫెన్సింగ్ మరియు థెఫ్ట్ అలర్ట్ వంటివి ఉన్నాయి.

కొత్త అప్డేటెడ్ టీవీఎస్ ఐక్యూబ్ లో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక అడ్జస్టబుల్ ట్విన్ షాక్‌లు, ఫ్రంట్ 220 మిమీ డిస్క్ బ్రేక్‌లు, వెనుక 130 డ్రమ్ బ్రేక్, ఎల్ఈడి లైటింగ్, మల్టిపుల్ రైడ్ మోడ్‌లు, రివర్స్ మోడ్, కీలెస్ అన్‌లాకింగ్, సోషల్ మీడియా, ఇరువైపులా 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి మరియు వాటిపై 90/90-12 సెక్షన్ టైర్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

iQube నుంచి మరో వేరియంట్ ఆవిష్కరించిన TVS

ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, TVS iQube ST ఎలక్ట్రిక్ స్కూటర్ 4.56 kWh బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్‌పై క్లెయిమ్ చేసిన 145 కిలోమీటర్ల పరిధిని అనుమతిస్తుంది. ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో, iQube ST కేవలం నాలుగు గంటలలోపు ఫుల్ ఛార్జ్ చేసుకుంటుంది. గతంలో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కేవలం 2.2kWh బ్యాటరీ ప్యాక్‌ని మాత్రమే ఉపయోగించేది.

కొత్త టీవీఎస్ iQube ST మోటార్ 140 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 4.2 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గన్తకు 82 కిమీ వరకు ఉంటుంది. ఇందులోని బ్యాటరీ ప్యాక్ IP67 మరియు AIS156 సర్టిఫైడ్ చేయబడి, UL2271, ISO 12405 మరియు UN38.3 నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. కావున ఇది కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

iQube నుంచి మరో వేరియంట్ ఆవిష్కరించిన TVS

గతంలో టీవీఎస్ ఐక్యూబ్ ST మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులోకి రానుంది. అవి స్టార్‌లైట్ బ్లూ గ్లోసీ, టైటానియం గ్రే మ్యాట్, కోరల్ శాండ్ గ్లోసీ మరియు కాపర్ బ్రాంజ్ మ్యాట్ కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటాయి. ఇప్పుడు కొనుగోలుదారులు నచ్చిన కలర్ ఆప్సన్ ఇందులో ఎంచుకోవచ్చు. కంపెనీ ఆవిష్కరించిన టీవీఎస్ iQube ST ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. బహుశా ధరలను కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంటుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో అద్భుతమైన మరియు అధునాతన మోడల్స్ ఆవిష్కరించడ్డాయి మరియు విడుదలయ్యాయి. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన/విడుదలైన వాహనాలను గురించి తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి. అదే విధంగా కొత్త వాహనాలను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా అధికారిక సోషల్ మీడియా పేజీలను అనుసరిస్తూ మీకు కావాల్సిన సమాచారం పొందండి.

Most Read Articles

English summary
Auto expo 2023 tvs iqube st showcased design range features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X