అమ్మకాల్లో కొత్త మైలురాయి చేరుకున్న TVS iQube: ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం..

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'టీవీఎస్' సాధారణ పెట్రోల్ టూ వీలర్స్ మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కూడా విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ TVS iQube ను ఇప్పటికే మంచి సంఖ్యలో విక్రయించబడింది.

టీవీఎస్ కంపెనీ ఇప్పటి వరకు ఏకంగా 50,000 యూనిట్ల TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు తెలిసింది. కంపెనీ దేశీయ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అమ్మకాలను మెరుగుపరచడంతో పాటు ఎప్పటికప్పుడు ఈ స్కూటర్ యొక్క సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ కారణంగానే కంపెనీ దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందగలుగుతోంది. రానున్న రోజుల్లో ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

అమ్మకాల్లో కొత్త మైలురాయి చేరుకున్న TVS iQube

టీవీఎస్ యొక్క ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన డిజైన్ కలిగి, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం మూడు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి స్టాండర్డ్, ఎస్ మరియు ఎస్టీ వేరియంట్లు. 2022 టీవీఎస్ ఐక్యూబ్ మరియు ఐక్యూబ్ ఎస్ రెండూ కూడా ఒకే 3.4kwh బ్యాటరీ ప్యాక్ తో పనిచేస్తాయి. ఇవి పూర్తి ఛార్జ్‌ పై గరిష్టంగా 100 కిమీ రేంజ్ ను అందిస్తాయి.

ఇక టాప్ వేరియంట్ అయిన ఐక్యూబ్ ST 5.1 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇది ఒక ఛార్జ్ తో 140 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మూడు వేరియంట్‌లు కూడా కేవలం 4.2 సెకన్లలో గంటకు గరిష్టంగా 0-140 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతాయి. అంతే కాకుండా ఐక్యూబ్ మరియు ఐక్యూబ్ S యొక్క టాప్ స్పీడ్ 78 కిమీ/గం కాగా, టాప్ వేరియంట్ ST యొక్క టాప్ స్పీడ్ 84 కిమీ/గం.

టీవీఎస్ ఐక్యూబ్ మరియు ఐక్యూబ్ ఎస్ ఎలక్ట్రిక్ యొక్క రెండు వేరియంట్లు కూడా 650W మరియు 950W ఛార్జర్ కి సపోర్ట్ చేస్తాయి. ఇవి 650W ఛార్జర్‌తో చార్జ్ చేసినప్పుడు కేవలం నాలుగున్నర గంటల సమయంలో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోగలదు. అదే 950W ఛార్జర్ తో అయితే ఆ సమయాన్ని కేవలం 2 గంటల 50 నిమిషాలలో 100 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. ఐక్యూబ్ ఎస్‌టి వేరియంట్ 950W మరియు 1.5kW ఛార్జర్లను సపోర్ట్ చేస్తుంది.

ఐక్యూబ్ ఎస్‌టి వేరియంట్ 950W ఛార్జర్‌ ద్వారా 4 గంటల 6 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోగలదు. కావున ఛార్జింగ్ పరంగా కూడా కస్టమర్లు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. టీవీఎస్ ఐక్యూబ్ స్టాండర్డ్ వెర్షన్ ధర రూ .99,130 కాగా, 'ఎస్' వేరియంట్ ధర రూ. 1.04 లక్షలు. టీవీఎస్ కంపెనీ ఐక్యూబ్ ఎస్టీ ధరలను ఇంకా వెల్లడించలేదు. ఇది ఇటీవల జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది.

కంపెనీ యొక్క అమ్మకాల గణాంకాల ప్రకారం 2022 ఏప్రిల్ నెలవు కేవలం 1420 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. అయితే 2022 చివరి నాటికి అంటే 2022 డిసెంబర్ నాటికి కంపెనీ అమ్మకాలు 11,071 యూనిట్లకు చేరింది. దీన్ని బట్టి చూస్తే దేశీయ మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్ యొక్క అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రారంభంలో అమ్మకాలు కొంత తక్కువగా ఉన్నప్పటికీ, క్రమంగా ఈ అమ్మకాలు భారీగా పెరిగాయి.

ఇటీవల 2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన అప్డేటెడ్ టీవీఎస్ ఐక్యూబ్ ఆధునిక డిజైన్ కలిగి ఉండటమే కాకుండా, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, రియర్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్‌లు, ఫ్రంట్ 220 మిమీ డిస్క్ బ్రేక్‌లు, వెనుక 130 డ్రమ్ బ్రేక్, ఎల్ఈడి లైటింగ్, మల్టిపుల్ రైడ్ మోడ్‌లు, రివర్స్ మోడ్, కీలెస్ అన్‌లాకింగ్, ఇరువైపులా 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి వాటిని పొందుతుంది.

Most Read Articles

English summary
Tvs iqube electric scooter crosses 50000 unit sales details
Story first published: Wednesday, January 25, 2023, 10:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X