బజాజ్ డిస్కవర్‌లో మరొక కొత్త వేరియంట్‌ను విడుదల

తగ్గుముఖం పడుతున్న బైక్ సేల్స్‌ను పెంచుకునేందుకు గాను బజాజ్ ఆటో కొత్త ప్రణాళికలతో ముందుకు వస్తోంది. ఇందులో భాగంగా, తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించుకోవటంతో పాటుగా తక్కువ ధర కలిగిన మోడళ్లను కూడా మార్కెట్లో విడుదల చేస్తోంది. తాజాగా, బజాజ్ ఆటో అందిస్తున్న డిస్కవర్ బ్రాండ్‌లో మరొక కొత్త వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది.

బజాజ్ ఆటో ఇటీవలే దేశీయ విపణిలో ప్రవేశపెట్టిన 'డిస్కవర్ 125 ఎస్‌టి' (స్పోర్ట్స్ టూరర్) ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఇందులో 'డిస్కవర్ 125టి' అనే లో ఎండ్ వేరియంట్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. పై రెండు మోడళ్లలో డిజైన్, ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. కొత్తగా ప్రవేశపెట్టిన డిస్కవర్ 125టి వేరియంట్‌లో మోనోషాక్ అబ్జార్వర్ స్థానంలో నైట్రాక్స్ షాక్ అబ్జార్వర్లను ఉపయోగించారు.

డిస్కవర్ 125టి డ్రమ్ బ్రేక్, డిస్క్ బ్రేక్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. వాటి ధరల వివరాలు ఉన్నాయి:

  • డిస్కవర్ 125టి డ్రమ్ బ్రేక్: రూ.54,022
  • డిస్కవర్ 125టి డిస్క్ బ్రేక్: రూ.57,070

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, చెన్నై)

Bajaj Auto Launches New Discover 125T

ఈ కొత్త బైక్‌లో డిటిఎస్-ట్విన్ స్పార్క్ టెక్నాలజీ కలిగిన ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 13 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. స్పోర్టీ లుక్‌నిచ్చే కొత్త డిస్కవర్ 125టిలో 5-స్పీడ్ గేర్ బాక్స్, రీడిజైన్ చేయబడిన ఫ్యూయెల్ ట్యాంక్, షార్ప్ ఎడ్జ్‌లు కలిగిన పవర్‌ఫుల్ హెడ్‌ల్యాంప్, స్టయిలిష్ అల్లాయ్ వీల్స్, ఎలాంటి రోడ్లపై అయినా సౌకర్యవంతంగా ప్రయాణించేలా రూపొందించిన యాంటీ వైబ్రేషన్ ఫ్రేమ్, మరింత సురక్షితమైన బ్రేకింగ్ కోసం అమర్చిన పెటల్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లున్నాయి.
Most Read Articles

English summary
Bajaj Auto has launched new Discover 125T in Chennai. New Bajaj Discover 125T gets gas-charged nitrox suspension system instead of monoshock suspension system. The new Discover packs best in Class power in the 125cc segment with a high quality 4 valve single cylinder petrol engine that produces 13 PS of power 9000 RPM. The engine which features a CV type carburettor is mated to a 5 speed manual transmission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X