డిఎస్‌కె బెనెల్లీ బైక్స్ విడుదల: ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

By Ravi

ఇటాలియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బెనెల్లీ భారత మార్కెట్లో నేడు (మార్చ్ 19, 2015) ఐదు సరికొత్త మోటార్‍‌సైకిళ్లను విడుదల చేసింది. వాటి ధరలు వివరాలు ఇలా ఉన్నాయి:

  • బెనెల్లీ టిఎన్‌టి 302 - రూ.2.83 లక్షలు
  • బెనెల్లీ టిఎన్‌టి 600 ఐ - రూ.5.15 లక్షలు
  • బెనెల్లీ టిఎన్‌టి 600 జిటి - రూ.5.62 లక్షలు
  • బెనెల్లీ టిఎన్‌టి 899 - రూ.9.48 లక్షలు
  • బెనెల్లీ టిఎన్‌టిఆర్ 1130 - రూ.11.81 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఈ ఐదు బైక్‌లకు సంబంధించి ఇంజన్ స్పెసిఫికేషన్లు క్రింది ఫొటో ఫీచర్‌లో తెలుసుకోండి..!

బెనెల్లీ టిఎన్‌టి 302

బెనెల్లీ టిఎన్‌టి 302

ఈ బైక్‌లో 300సీసీ, ఫోర్-స్ట్రోక్, పారలల్-ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 36.2 బిహెచ్‌పిల శక్తిని, 2.75 కెజిఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎమ్ఆర్ఎఫ్, పీరెల్లి టైర్ ఆప్షన్లతో లభిస్తుంది.

బెనెల్లీ టిఎన్‌టి 600 ఐ

బెనెల్లీ టిఎన్‌టి 600 ఐ

ఈ బైక్‌లో 600సీసీ, ఫోర్-స్ట్రోక్, ఇన్-లైన్ ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 80.5 బిహెచ్‌పిల శక్తిని, 5.3 కెజిఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

బెనెల్లీ టిఎన్‌టి 600 జిటి

బెనెల్లీ టిఎన్‌టి 600 జిటి

ఈ బైక్‌లో 600సీసీ, ఫోర్-స్ట్రోక్, ఇన్-లైన్ ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 80.5 బిహెచ్‌పిల శక్తిని, 5.3 కెజిఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

బెనెల్లీ టిఎన్‌టి 899

బెనెల్లీ టిఎన్‌టి 899

ఈ బైక్‌లో 898సీసీ, ఇన్-లైన్ త్రీ సిలిండర్, ఫోర్-స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 12.4 బిహెచ్‌పిల శక్తిని, 9 కెజిఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

బెనెల్లీ టిఎన్‌టిఆర్ 1130

బెనెల్లీ టిఎన్‌టిఆర్ 1130

ఈ బైక్‌లో 1131సీసీ, ఫోర్-స్ట్రోక్, ఇన్-లైన్ త్రీ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 155.6 బిహెచ్‌పిల శక్తిని, 12.2 కెజిఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
DSK-Benelli has just launched the TNT 302, which is a parallel twin machine. TNT 600i and TNT 600 GT will be their in-line four cylinder motorcycle option. They will also provide TNT 899 and TNT 1130 in-line three cylinder machines.
Story first published: Thursday, March 19, 2015, 13:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X