అఫీషియల్: డ్యూకాటి 1199 సూపర్‌లెగ్గెరా ఆవిష్కరణ

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా స్వాధీనం చేసుకున్న ఇటాలియన్ మోటార్‌సైకిల్ కంపెనీ డ్యూకాటి మరో పవర్‌ఫుల్ సూపర్‌బైక్‌ను ఆవిష్కరించింది. 'డ్యుకాటి 1199 సూపర్‌లెగ్గెరా' (Ducati 1199 Superleggera) పేరుతో అక్టోబర్ 22న కంపెనీ ఈ సూపర్‌బైక్‌ను ఆవిష్కరించింది. ఈ పేరులో సూపర్‌లెగ్గెరా అంటే తేలికైనది అని అర్థం.

పేరుకు తగినట్లుగా ఈ బైక్ కూడా తేలికగా ఉంటుంది. డ్యుకాటి 1199 సూపర్‌లెగ్గెరా బైక్‌ను డ్యుకాటి 1199 పనిగేల్ ఆర్ (రోడ్ వెర్షన్ పనిగేల్‌కు స్పోర్టీ వెర్షన్) బైక్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేశారు. అధిక వేగంతో దూసుకు వెళ్లేలా ఈ కారును తయారు చేసేందుకు దీని బరువును గణనీయంగా తగ్గించారు. ఈ సూపర్‌బైక్‌కు సంబంధించిన సూపర్ విశేషాలను తెలుసుకుందాం రండి..!

డ్యూకాటి 1199 సూపర్‌లెగ్గెరా

ముందుగా.. డ్యుకాటి 1199 సూపర్‌లెగ్గెరా సూపర్‌బైక్ ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ మాత్రమే. వీటిని కేవలం 500 యూనిట్లు మాత్రమే తయారు చేయనున్నారు.

డ్యూకాటి 1199 సూపర్‌లెగ్గెరా

దీని అర్థం, పనిగేల్ ఆర్ మాదిరిగా సూపర్‌లెగ్గెరా రేసింగ్ కోసం తయారు చేసిన బైక్ కాదని తెలుస్తోంది. కేవలం ప్రైవేట్ ట్రాక్ డేస్‌లలో ఉపయోగించుకునేందుకే దీనిని తయారు చేశారు.

డ్యూకాటి 1199 సూపర్‌లెగ్గెరా

రెగ్యులర్ పనిగేల్ ఆర్ ఫుల్ ట్యాంక్ ఇంధనంతో కలిపి 189 కేజీల బరువును కలిగి ఉంటుంది. అయితే, ఈ మోడల్ ఆధారంగా చేసుకొని తయారు చేసిన సూపర్‌లెగ్గెరా ఖాలీ ఇంధన ట్యాంక్‌తో 155 కేజీల బరువును, 90 శాతం నిండిన ఇంధన ట్యాంకుతో 177 కేజీల బరువును కలిగి ఉంటుంది.

డ్యూకాటి 1199 సూపర్‌లెగ్గెరా

డ్యుకాటి 1199 సూపర్‌లెగ్గెరా బైక్‌లో రీట్యూన్ చేయబడిన సూపర్‌క్వాడ్రో 1198సీసీ, వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 200 హెచ్‌పిలకు పైగా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. (ఈ శక్తిని పనిగేల్ ఆర్ శక్తి కన్నా 10 హెచ్‌పిలు అధికం).

డ్యూకాటి 1199 సూపర్‌లెగ్గెరా

ఈ బైక్ ఇంజన్ విడి భాగాలను టైటానియం మరియు ఇతర మెటీరియళ్లను ఉపయోగించి బరువును, ఇంటర్నల్ ఫ్రిక్షన్‌ను తగ్గించారు.

డ్యూకాటి 1199 సూపర్‌లెగ్గెరా

ఈ బైక్ ఇంజన్ విడి భాగాలను టైటానియం మరియు ఇతర మెటీరియళ్లను ఉపయోగించి బరువును, ఇంటర్నల్ ఫ్రిక్షన్‌ను తగ్గించారు.

డ్యూకాటి 1199 సూపర్‌లెగ్గెరా

మోనోకాక్ ఫ్రేమ్ మరియు సబ్-ఫ్రేమ్‌లను మెగ్నీషియంతో తయారు చేశారు. ఇకపోతే పూర్తి బాడీని ప్లాస్టిక్‌తో కాకుండా, కార్బన్ ఫైబర్ మెటీరియల్‌తో తయారు చేశారు.

డ్యూకాటి 1199 సూపర్‌లెగ్గెరా

పూర్తి ఎగ్జాస్ట్ సిస్టమ్, బోల్టులు, ఫాస్ట్‌నర్స్ వంటి అనేక ఇతర భాగాలను కూడా టైటానియంతో తయారు చేశారు.

డ్యూకాటి 1199 సూపర్‌లెగ్గెరా

ఫ్రంట్ ఫోర్క్‌గా లైట్ వెయిట్ ఓహ్లిన్స్ ఎఫ్ఎల్916 యూనిట్లను ఉపయోగించారు.

డ్యూకాటి 1199 సూపర్‌లెగ్గెరా

వెనుక వైపు టైటానియం స్ప్రింగ్‌తో కూడిన ఓహ్లిస్ టిటిఎక్స్36 మోనోషాక్ సస్పెన్షన్‌ను ఉపయోగించారు.

డ్యూకాటి 1199 సూపర్‌లెగ్గెరా

ఇందులోని చక్రాలను మార్చెసినీ సరఫరా చేసింది, వీటిని మెగ్నీషియంతో తయారు చేశారు. వీటికి బ్రెమ్బూ ఎమ్50 కాలిపర్స్‌ను జోడించారు.

డ్యూకాటి 1199 సూపర్‌లెగ్గెరా

హ్యాండిల్స్‌కు రేసింగ్ స్పెక్ బ్రేక్ మాస్టర్ సిలిండర్, రిమోట్ అడ్జస్టర్స్ ఉంటాయి.

డ్యూకాటి 1199 సూపర్‌లెగ్గెరా

దీని గరిష్ట వేగాన్ని కంపెనీ వెల్లడించలేదు, అయితే ఇది సులువుగా గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని అధిగమించగలదు.

డ్యూకాటి 1199 సూపర్‌లెగ్గెరా

అమెరికా మార్కెట్లో ఈ లిమిటెడ్ ఎడిషన్ డ్యుకాటి 1199 సూపర్‌లెగ్గెడ్ బైక్ ధర 65,000 డాలర్లుగా ఉంది.

Most Read Articles

English summary
Ducati 1199 Superleggera can be termed as the god among motorcycles. Officially revealed by Ducati on October 22, the Superleggera in the name means super light and that's exactly what this bike is all about.
Story first published: Wednesday, October 23, 2013, 10:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X