బెంగుళూరు మార్కెట్లో హోండా యాక్టివా ఐ స్కూటర్ లాంచ్

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా గడచిన జూన్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త ఆటోమేటిక్ స్కూటర్‌ హోండా యాక్టివా-ఐ (Honda Activa-i) ఇప్పుడు బెంగుళూరు మార్కెట్లో కూడా లభ్యం కానున్నట్లు కంపెనీ పేర్కొంది. హోండా నుంచి అత్యంత సరమైన ధరకే లభ్యమవుతున్న యాక్టివా ఐ స్కూటర్‌ను తాజాగా కర్ణాటక మార్కెట్లో విడుదల చేశారు.

కర్ణాటక మార్కెట్లో హోండా యాక్టివా ఐ స్కూటర్ ధర రూ.47,104 (ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)గా ఉంది. హోండా అందిస్తున్న యాక్టివా సిరీస్‌లోనే ఈ కొత్త స్కూటర్‌ను అందిస్తున్నారు. ఇంజన్ పరంగా రెండు యాక్టివా స్కూటర్లలో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న యక్టివా స్కూటర్‌‌లో ఉపయోగించిన 109సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్‌నే ఈ కొత్త యాక్టివా-ఐ స్కూటర్‌లోను ఉపయోగించారు.

ఈ ఇంజన్ గరిష్టంగా 8 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా హోండా ఈకో టెక్నాలజీతో అభివృద్ధి చేయబడి లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. యాక్టివా, యాక్టివా-ఐ స్కూటర్‌కు డిజైన్ పరంగా అనేక మార్పులు ఉన్నాయి. ఈ స్కూటర్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఇంజన్

ఇంజన్

హోండా యాక్టివాలో ఉపయోగించిన 109.2సీసీ ఇంజన్‌నే ఈ కొత్త యాక్టివా-ఐ స్కూటర్‌లోను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 8 బిహెచ్‌పిల శక్తిని, 8.74 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మైలేజ్

మైలేజ్

హోండా యాక్టివా-ఐ స్కూటర్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని మైలేజ్. ప్రస్తుతం హోండా ఇంజన్లలో ఉపయోగిస్తున్న 'హోండా ఈకో టెక్నాలజీ' (హెచ్ఈటి) వలన ఈ స్కూటర్ లీటరు పెట్రోలుకు 60 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

కాంబీ బ్రేక్ సిస్టమ్

కాంబీ బ్రేక్ సిస్టమ్

ఈ స్కూటర్‌లో మరొక విశిష్టమైన ఫీచర్ ఈ కాంబీ బ్రేక్ సిస్టమ్ (సిబిఎస్). అత్యవసర సమయాల్లో ఇది చక్కగా ఉపయోగపడుతుంది. కాంబీ బ్రేక్ సిస్టమ్‌లో ముందు, వెనుక బ్రేక్‌లు ఒకేసారి అప్లయ్ అయ్యి, బ్రేక్ దూరాన్ని తగ్గిస్తాయి, ఫలితంగా ప్రమాద అవకాశాలు కూడా చాలా వరకు తగ్గుతాయి.

ట్యూబ్‌లెస్ టైర్లు

ట్యూబ్‌లెస్ టైర్లు

ఈ స్కూటర్‌లో కూడా ట్యూబ్‌లెస్ టైర్లను ఉపయోగించారు. ట్యూబ్‌లెస్ టైర్లు పంక్చర్ అయినప్పుడు, తక్షణమే గాలిపోకుండా ఉండేందుకు సహకరిస్తాయి. ఫలితంగా మీ ప్రయాణంలో అసౌకర్యం ఉండదు.

పొడవాటి సీట్, హగ్గర్ ఫెండర్

పొడవాటి సీట్, హగ్గర్ ఫెండర్

ఈ స్కూటర్‌లోని పొడవాటి సీట్ కారణంగా, స్కూటర్ నడిపే వారకి, వెనుక కూర్చునే వారికి సౌకర్యంగా ఉంటుంది. ఈ స్కూటర్‌లో మరొక విశిష్టమైన ఫీచర్ హగ్గర్ ఫెండర్. ఇది వెనుక టైరుకు కాస్తంత పైభాగంలో అమర్చబడి ఉంటుంది. ఇది మడ్ గార్డ్ మాదిరిగా పనిచేస్తుంది. వర్షాకాలంలో ఇది ఎంతో చక్కగా పనిచేస్తుంది. ఇంజన్‌పై అలాగే వెనుక సీటుపై కూర్చునే వారిపై నీటి తుంపర్లు, బురద పడకుండా ఇది కాపాడుతుంది.

స్టీట్ క్రింద్ స్టోరేజ్ స్పేస్

స్టీట్ క్రింద్ స్టోరేజ్ స్పేస్

హోండా యాక్టివా-ఐ స్కూటర్ క్రింద 128 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఇందులో ఓ ఫుల్ ఫేస్ హెల్మెట్ లేదా లంచ్ బాక్స్ లేదా ఇతర లగేజ్‌ను భద్రపరచుకోవచ్చు.

డిజైన్ ఫీచర్స్

డిజైన్ ఫీచర్స్

స్టయిలిష్ ట్రెండీ మీటర్ కన్సోల్స్‌తో కూడిన కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇండికేటర్లు మరియు బ్రేక్ లైట్ కాంబినేషన్‌తో కూడిన టైల్ లైట్, కర్వ్ లైన్‌తో కూడిన సైలెన్సర్ గార్డ్, ముందువైపు పొడవాటి ఇండికేటర్ లైట్స్, పవర్‌ఫుల్ హెడ్‌ల్యాంప్, డీసెంట్ బాడీ గ్రాఫిక్స్ తదితర ఫీచర్లు ఈ కొత్త హోండా యాక్టివా-ఐ స్కూటర్ సొంతం.

హైలైట్స్

హైలైట్స్

హోండా యాక్టివా-ఐ ఈ సెగ్మెంట్లో కెల్లా అత్యంత చవకైన స్కూటర్. ఇది మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీ. మొత్తం బరువును 103 కేజీలు. కొత్త డిజైన్, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త టెయిల్ లైట్స్, వెడల్పాటి సీట్, హగ్గర్ ఫెండర్, స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్.

కలర్స్

కలర్స్

ఇది పర్పల్ మెటాలిక్, ఆల్ఫా రెడ్ మెటాలిక్, పెరల్ సన్‌బీమ్ వైట్, బీజ్ మెటాలిక్ అనే నాలుగు ఆకర్షనీయమైన రంగులలో లభ్యమవుతుంది

Most Read Articles

English summary
Honda Motorcycle & Scooter India Pvt. Ltd. (HMSI) today announces the availability of Activa i at your nearest dealership in Bangalore. Activa i is Honda’s first ever “Light weight personal compact” automatic scooter and it is Most Affordable too.
Story first published: Monday, August 19, 2013, 18:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X