హోండా సిబి125ఎఫ్ తొలుతగా యూకే మార్కెట్లో విడుదల

By Ravi

జపనీస్ ద్విచక్ర వాహన దిగ్గజం హోండా తమ సరికొత్త 125సీసీ బైక్‌ను ఇటీవలే యూరోపియన్ మార్కెట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. హోండా సిబి125ఎఫ్ (Honda CB125F) పేరుతో ఈ బైక్‌ను ఆవిష్కరించారు. కంపెనీ ఇదివరకు యూరోపియన్ మార్కెట్లలో విక్రయిస్తూ వచ్చిన హోండా సిబిఎఫ్125 మోడల్‌కు రీప్లేస్డ్ వెర్షనే ఈ కొత్త హోండా సిబి125ఎఫ్.

హోండా సిబి ట్రిగ్గర్ మోటార్‌సైకిల్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన ఈ కొత్త హోండా సిబి125ఎఫ్ కమ్యూటర్ మోటార్‌సైకిల్‌ను స్టయిలిష్‌, స్పోర్టీ, ప్రీమియంగా తీర్చిదిద్దారు. ఈ బైక్ ముందుగా యారోపియన్ మార్కెట్లలో విడుదల కానుంది. ఆ తర్వాత భారత మార్కెట్లో విడుదలయ్యే ఆస్కారం ఉంది. యూరప్‌లో జరిగిన మోటార్‌సైకిల్ లైవ్ కార్యక్రమంలో హోండా ఈ కొత్త బైక్‌ని ప్రదర్శనకు ఉంచింది.

హోండా సిబి125ఎఫ్ మోటార్‌సైకిల్‌కి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకోండి.

హోండా సిబి125ఎఫ్

హోండా సిబి125ఎఫ్ ఒక నేక్డ్ బైక్. యూరప్ మార్కెట్లో ఇది సిబి300ఎఫ్, సిబి500ఎఫ్ వంటి సిబి రేంజ్ మోడళ్ల సరసన చేరనుంది.

హోండా సిబి125ఎఫ్

హోండా సిబి125ఎఫ్ బైక్‌లో 124.7సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10.5 హార్స్‌పవర్‌ల శక్తిని, 10.1 న్యూటన్ మీటర్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

హోండా సిబి125ఎఫ్

బెటర్ మైలేజ్ కోసం హోండా, ఇదివరకటి మోడల్ కన్నా, ఈ కొత్త మోడల్ పవర్ అవుట్‌పుట్‌ని తగ్గించింది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం ఇది లీటరుకు 42.68 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

హోండా సిబి125ఎఫ్

సరికొత్త షాషీపై హోండా సిబి125ఎఫ్ మోడల్‌ను తయారు చేశారు. బ్యాలన్సర్ షాఫ్ట్‌తో కూడిన ఈ షాషీ బైక్ వైబ్రేషన్‌ను తగ్గిస్తుంది. ఈ బైక్‌లో 6-స్పోక్ 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఇంప్రూవ్డ్ థ్రోటల్ రెస్పాన్స్ అండ్ యాక్సిలరేషన్ వంటి మార్పులు ఉన్నాయి.

హోండా సిబి125ఎఫ్

హోండా తమ సిబి125ఎఫ్ ధరను ఇంకా వెల్లడించలేదు. మరికొద్ది రోజుల్లోనే ఇది యూరోపియన్ మార్కెట్లలో విడుదల కానుంది. ఆ సమయంలో కంపెనీ దీని ధరను ప్రకటించే అవకాశం ఉంది.

హోండా సిబి125ఎఫ్

వచ్చే ఏడాది (2015)లో ఇది భారత మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. లేటెస్ట్ అప్‍‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Honda has now unveiled their CB125F, which will go on sale in 2015 in Europe first. They showcased this commuter bike at Motorcycle Live. The motorcycle will be powered by an all new 124.7 cc single cylinder engine. It will be capable of generating 10.5 horsepower, along with 11.35 Nm of peak torque.
Story first published: Wednesday, November 26, 2014, 16:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X