షికాగో ఆటో షో 2015: ఇండియన్ డార్క్ హార్స్ ఆవిష్కరణ

By Ravi

అమెరికాకు చెందిన పురాతన మోటార్‌సైకిల్ కంపెనీ 'ఇండియన్ మోటార్‌సైకిల్స్' తాజాగా మరో అద్భుతమైన మోడల్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం షికాగోలో జరుగుతున్న అంతర్జాతీయ మోటార్ షోలో, 2014 ఛీఫ్ క్లాసిక్ మోడల్‌ను ఆధారంగా చేసుకొని, ప్రత్యేకంగా తయారు చేసిన 'డార్క్ హార్స్' (Indian Dark Horse ) మోడల్‌ను ఇండియన్ మోటార్‌సైకిల్ ప్రదర్శనకు ఉంచింది.

ఇండియన్ డార్క్ హార్స్ మోటార్‌సైకిల్‌ను దాని పేరుకు తగినట్లుగా వార్ బానెట్ నుంచి రియర్ ఫెండర్ వరకూ మ్యాట్ బ్లాక్ ఫినిష్‌లో డిజైన్ చేశారు. ఎప్పుడూ తళతళా మెరిసే మోటార్‌సైకిళ్లను తయారు చేసే ఇండియన్, ఇప్పుడు ఈ డార్క్ హార్స్‌తో తమ బ్రాండ్ ప్రియులకు ఓ మంచి విజువల్ ట్రీట్‌ను అందించింది.

Indian Dark Horse Revealed At 2015 Chicago Auto Show

ఇంజన్ పరంగా ఇండియన్ డార్క్ హార్స్‌కి, ఛీఫ్ క్లాసిక్ మోడళ్లకు ఎలాంటి వ్యత్యాసం లేదు. కానీ, దీని ధర మాత్రం ఛీఫ్ క్లాసిక్ కన్నా సుమారు 2,000 డాలర్లు అధికం. ఈ మోటార్‌సైకిల్‌లో సరికొత్త థండర్ స్ట్రోక్ 111 క్యూబిక్ ఇంచ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ 1819సీసీ ఇంజన్ 161 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఒకప్పుడు ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మోటార్‌సైకిల్ కంపెనీ 'ఇండియన్ మోటార్‌సైకిల్స్'ను 1901లో స్థాపించారు. ప్రస్తుతం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఏటివి (ఆల్ టెర్రైన్ వెహికల్) తయారీదారైన, అమెరికాకు చెందిన పోలారిస్ ఇండస్ట్రీస్ 2011లో ఈ సంస్థను స్వాధీనం చేసుకుంది. భారత మార్కెట్లో కూడా ఇండియన్ బ్రాండ్ లగ్జరీ మోటార్‌సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి.

Most Read Articles

English summary
Indian Motorcycles has showcased its Dark Horse model at 2015 Chicago Auto Show. The Indian Chief Dark Horse, mechanically identical to the Chief Classic, but designed it in matt black finish.
Story first published: Monday, February 16, 2015, 11:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X