రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఓ కొత్త 400సీసీ ఇంజన్!

By Ravi

బుల్లెట్ మోటార్‌సైకిళ్లను తయారు చేసే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు ఓ సరికొత్త ఇంజన్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న 350సీసీ ఇంజన్‌కు ఎగువన అలాగే 500సీసీ దిగువన ఉండేలా ఓ కొత్త 400సీసీ ఇంజన్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారు చేయనుంది.

రానున్న రోజుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉత్పత్తి చేయనున్న ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిళ్లలో ఈ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ కొత్త 400సీసీ ఇంజన్‌ను ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న సింగిల్ సిలిండర్ 346సీసీ ఇంజన్ ఆధారంగా చేసుకొనే అభివృద్ధి చేస్తున్నారు.

ఈ కొత్త ఇంజన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకోండి..!

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఓ కొత్త 400సీసీ ఇంజన్

రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్తుతం మార్కెట్లో అందిస్తున్న మోటార్‌సైకిళ్లలో సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ 346సీసీ ఇంజన్‌ను మరియు 499సీసీ ఇంజన్‌లను ఉపయోగిస్తుంది. ఈ రెండు ఇంజన్లకు మధ్యలో ఈ కొత్త 400సీసీ ఇంజన్‌ను ప్రవేశపెట్టనున్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఓ కొత్త 400సీసీ ఇంజన్

ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న 346సీసీ ఇంజన్ గరిష్టంగా 20 హెచ్‌పిల శక్తిని, 28 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా, 499సీసీ ఇంజన్ గరిష్టంగా 28 హెచ్‌పిల శక్తిని, 41 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా.. ఈ కొత్త 400సీసీ ఇంజన్ గరిష్టంగా 22 హెచ్‌పిల శక్తిని, 25 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేయవచ్చని అంచనా.

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఓ కొత్త 400సీసీ ఇంజన్

రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న 346సీసీ ఇంజన్ కలిగిన బైక్ ధర రూ.1 లక్షకు ఎగువన మరియు 499సీసీ ఇంజన్ కలిగిన బైక్ ధర రూ.1.5 లక్షలకు పైగా ఉన్న నేపథ్యంలో.. ఈ కొత్త 400సీసీ ఇంజన్ కలిగిన బైక ధర ఈ రెండింటికి మధ్యలో ఉండొచ్చని (సుమారు 1.2 లక్షలు) అంచనా.

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఓ కొత్త 400సీసీ ఇంజన్

వాస్తవానికి ఈ కొత్త 400సీసీ ఇంజన్ ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న 346సీసీ ఇంజన్ లార్జర్ వెర్షన్ అనే చెప్పాలి. ఈ ఇంజన్‌ను మోడిఫై చేసి, ట్యూనింగ్‌ను పెంచి కొత్త 400సీసీ ఇంజన్‌ను తయారు చేయనున్నట్లు సమాచారం. ఇలా చేయటం వలన కొత్త ఇంజన్ ఉత్పాదక వ్యయం చాలా వరకు తగ్గుతుంది, ఫలితంగా సరమైన ధరకే ఈ బైక్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఓ కొత్త 400సీసీ ఇంజన్

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇదివరకే ఈ తరహా ప్రయోగం చేసింది. కంపెనీ అందిస్తున్న 499సీసీ ఇంజన్‌ను మోడిఫై చేసి సింగిల్ సిలిండర్ 535సీసీ ఇంజన్‌ను సృష్టించింది. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న కాంటినెంటల్ జిటి కెఫే రేసర్ స్టయిల్ మోటార్‌సైకిల్‌లో ఉపయోగిస్తున్నది ఈ 535సీసీ ఇంజన్‌నే. ఇది గరిష్టంగా 29 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఓ కొత్త 400సీసీ ఇంజన్

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంజన్ ఫ్యామిలీలో ఈ కొత్త 400సీసీ ఇంజన్ వచ్చి చేరితే, భారత్‌లో కంపెనీ ఆఫర్ చేయనున్న ఇంజన్ల సంఖ్య నాలుగుకి చేరుకోనుంది.

Most Read Articles

English summary
Royal Enfield is said to be developing a new engine. But do not get too excited just yet because the ‘new' engine is said to be a 400cc unit that will be based on the existing single cylinder 346cc unit that powers the company's entry level motorcycles.
Story first published: Tuesday, March 4, 2014, 10:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X