ఇండియా బైక్ వీక్ 2015: ట్రైయంప్ మోటార్‌సైకిళ్ల ప్రదర్శన

By Ravi

బ్రిటీష్ మోటార్‌సైకిల్ కంపెనీ 'ట్రైయంప్' గడచిన నవంబర్ 2013 నుంచి భారత మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసినదే. ఇటీవల గోవాలో జరిగిన బైకర్ల ఫెస్టివల్ ఇండియా బైక్ వీక్ 2015లో ట్రైయంప్ తమ పాపులర్ టైగర్ సిరీస్ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిళ్లలో రెండు కొత్త వేరియంట్లతో పాటుగా మొత్తం ఉత్పత్తుల శ్రేణిని ప్రదర్శనకు ఉంచింది.

ప్రస్తుతం ట్రైయంప్ ఇండియా దేశీయ విపణిలో 10కి పైగా మోడళ్లను విక్రయిస్తోంది. ఇందులో కొన్నింటిని సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో విడిభాగాలను దిగుమతి చేసుకొని భారత మార్కెట్లో అసెంబ్లింగ్ చేస్తుండగా, మరికొన్నింటిని సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో పూర్తిగా విదేశాల్లో తయారైన బైక్‌లను ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది.

Tiger XCx

గడచిన సంవత్సరం నవంబర్ నెలలో మిలాన్‌లో జరిగిన ఈఐసిఎమ్ఏలో తొలిసారిగా ట్రైయంప్ ఆవిష్కరించిన 2015 టైగర్ ఎక్స్‌సిఎక్స్, టైగర్ ఎక్స్ఆర్ఎక్స్ మోడళ్లను ఇండియన్ బైక్ వీక్ 2015లో కంపెనీ ప్రదర్శించింది. ఈ రెండు మోడళ్లను త్వరలోనే భారత మార్కెట్లో విడుదల చేస్తామని ట్రైయంప్ ఇండియా ప్రకటించింది.

ఇవి రెండూ కూడా అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లు. ఈ రెండింటిలోను ఒకేరకమైన ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ బైక్‌లలోని త్రీ-సిలిండర్, లిక్విడ్ కూల్డ్ 800సీసీ ఇంజన్ గరిష్టంగా 92.68 హార్స్‌పవర్‌ల శక్తిని, 79 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

Tiger XRx

ట్రైయంప్ ఎక్స్‌సిఎక్స్, ఎక్స్ఆర్ఎక్స్ ఫీచర్లు:
  • ట్యూబ్లర్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్
  • అల్యూమినియం కాస్ట్ స్వింగ్‌ఆర్మ్
  • క్రూయిజ్ కంట్రోల్
  • ఏబిఎస్
  • ఫోర్-వే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్
  • ట్విన్ పవర్ సాకెట్స్ (టైగర్ ఆర్ఎక్స్ఆర్ మోడల్‌లో మాత్రమే)
  • అల్లాయ్ వీల్స్ (టైగర్ ఆర్ఎక్స్ఆర్ మోడల్‌లో మాత్రమే)
  • 45మి.మీ. అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ (220 మి.మీ. ట్రావెల్ లెన్త్)
  • షోవా రియర్ మోనోషాక్ విత్ హైడ్రాలిక్ ప్రీలోడ్, డ్యాంపింగ్ అండ్ రీబౌండ్ అడ్జస్ట్‌మెంట్
Most Read Articles

English summary
Triumph Motorcycles India lifted the covers off their 2015 Tiger XCx and Tiger XRx models. They will be launched in India soon and were earlier showcased at the EICMA motor show in November, 2014. Also present at the stands was their complete range of motorcycle with a few custom crafted models.
Story first published: Monday, February 23, 2015, 15:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X