హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ బస్సులను విడుదల చేసిన టాటా మోటార్స్

Written By:

ప్రపంచ వ్యాప్తంగా ట్రక్కులు మరియు బస్సులు తయారు చేసే సంస్థల టాప్ 10 జాబితాలో ఉన్న టాటా మోటార్స్ ఇప్పుడు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రెండు బస్సులను విడుదల చేసింది. పూనే లోని బస్సుల తయారీ ప్లాంటును వేదికగా చేసుకుని హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ బస్సులను విడుదల చేసింది.

టాటా మోటార్స్ స్టార్ బస్ ఎలక్ట్రిక్ 9ఎమ్, స్టార్ బస్ ఎలక్ట్రిక్ 12ఎమ్ మరియు స్టార్ బస్ హైబ్రిడ్ 12 అనే బస్సులను ఆవిష్కరించింది. ఈ బస్సులు ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించుకునే విధంగా డిజైన్ మరియు డెవలప్ చేయబడ్డాయి.

అంతే కాకుండా టాటా మోటార్స్ భారత దేశపు మొదటి ఫ్యూయల్ సెల్ బస్ (12ఎమ్), ఎల్‌పిజి తో నడిచే బస్సు (12ఎమ్) మరియు 18ఎమ్ ఆర్టికులేటెడ్ బస్సులను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించింది.

ప్రస్తుతం టాటా మోటార్స్ కు దేశీయంగా ఉన్న పూనే, దార్వాడ్, పాట్నా నగర్ మరియు లక్నో లోని ప్లాంట్లలో డిజైన్, డెవలప్‌మెంట్ మరియు ప్రొడక్షన్ జరుగుతున్నాయి.

అంతే కాకుండా గోవాలో ఏసిజిఎల్ భాగస్వామ్యంతో మరియు బ్రెజిల్‌కు చెందిన బస్సు బాడీల తయారీ సంస్థ మార్కొపోలో ఎస్.ఎ భాగస్వామ్యంతో కూడా బస్సుల అభివృద్ది మరియు నిర్మాణం చేపడుతోంది.

రోజూ వారి అవసరాలకు ఉపయోగపడే అన్ని రకాల బస్సుల తయారీలో టాటా మోటార్స్ భారత దేశపు అతి పెద్ద బస్సుల తయారీ సంస్థగా నిలిచింది. ప్రతి నిత్యం ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో బస్సుల వినియోగం పెరుగుతోంది.

నూతన టెక్నాలజీలను అభివృద్ది చేసి అన్నింటి పరంగా ముందు వరుసలో నిలవడం మాత్రమే కాకుండా. విభిన్న నగరాల అవసరాలకు, వివిధ రకాల రహదారులకు అనువుగా, భద్రత పరంగా మరియు దూర ప్రాంత ప్రయాణాలకు ఇలా అనేక అంశాల పరంగా టాటా మోటార్స్ బస్సులను ప్రత్యేకంగా అభివృద్ది చేసి అందిస్తోంది.

నూతన బస్సుల విడుదల వేదిక మీద టాటా కమర్షియల్ వాహనాల విభాగపు ఎక్జ్సిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్ర పిషరోడియా మాట్లాడుతూ, నూతన పరిజ్ఞానంతో హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ బస్సులను మార్కెట్లోకి విడుదల చేసినందుకు గర్వంగా ఉందన్నారు.

భవిష్యత్తులో పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్గార రహిత వాహనాలను అభివృద్ది చేస్తున్నట్ల తెలిపాడు.

2017 లో విడుదల కానున్న మూడవ తరానికి చెందిన మారుతి సుజుకి స్విప్ట్ హ్యాచ్‌బ్యాక్ ఫోటో గ్యాలరీ...

 

English summary
Tata Motors Launches Hybrid And Electric Buses
Please Wait while comments are loading...

Latest Photos