2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

'రాయల్ ఎన్‌ఫీల్డ్' ఈ మాట వినగానే ఎంతోమంది యువకుల మనసుపులకించిపోతుంది. దేశీయ మార్కెట్లో ఎదురులేని బ్రాండ్ గా నిలిచిన మోటార్ సైకిల్ రాయల్ ఎన్‌ఫీల్డ్. రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తుంది.

2018 నవంబర్ నెలలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ రెండు మోటార్‌సైకిళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇందులో ఒకటి ఇంటర్‌సెప్టర్ 650 కాగా మరొకటి కాంటినెంటల్ జిటి 650. ఈ రెండు బైకులు ఉత్తమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి.

మేము ఇటీవల బిఎస్ 6 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 బైక్ రైడ్ చేయాము. గతంలో కూడా మేము బిఎస్ 4 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 రైడ్ చేసి దాని గురించి పూర్తి సమాచారం అందించాము. ఇప్పుడు కూడా అదే తరహాలో కొత్త బిఎస్ 6 వెర్షన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 గురించి మరింత సమాచారం ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.. రండి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 డిజైన్ మరియు స్టైల్:

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 బైక్ యొక్క స్టైలింగ్ విషయానికి వస్తే ఇది మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అంటే ఇందులో పెద్దగా మార్పులు జరగలేదని అర్థమవుతుంది. ఈ బైక్ యొక్క ముందు భాగంలో రౌండ్ హెడ్‌ల్యాంప్ ఉండి, అదే రెట్రో డిజైన్‌తో ముందుకు తీసుకెళుతుంది.

ఈ మోటార్‌సైకిల్ ముందు ఉన్న రౌండ్ హెడ్‌ల్యాంప్‌ క్రోమ్ తో ఫినిష్ అయ్యి ఉంటుంది. ఈ హెడ్‌ల్యాంప్‌ని నిశితంగా పరిశీలిస్తే, హాలోజన్-పవర్డ్ హెడ్‌ల్యాంప్ లోపల ఒక చిన్న ఎల్ఈడీ పొజిషన్ లాంప్ ఉందని గుర్తిస్తారు. ఇంటర్‌సెప్టర్ 650 ఎల్లప్పుడూ హెడ్‌ల్యాంప్ ఆన్ ఫీచర్‌తో వస్తుంది మరియు కావున ఈ చిన్న ఎల్ఈడీ లైట్ ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉంటుంది.

హెడ్‌ల్యాంప్ పైన డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇందులో ఎడమవైపు స్పీడోమీటర్ మరియు కుడివైపు టాకోమీటర్ ఉన్నాయి. టాకోమీటర్ లోపల కొన్ని టెల్-టేల్ లైట్లు ఉన్నాయి, అదేవిధంగా స్పీడోమీటర్ లోపల ఫ్యూయెల్ గేజ్, ట్రిప్ మీటర్స్ మరియు ఓడోమీటర్ వంటి వాటి కోసం ఒక చిన్న LCD స్క్రీన్ ఉంది.

ఈ బైక్ యొక్క ఫ్రంట్ సస్పెన్షన్‌లోని ఫోర్క్ గేటర్‌లు ఫ్రంట్ ఎండ్ పూర్తిగా కనిపించేలా చేస్తాయి, అయితే క్రోమ్డ్ మిర్రర్స్ ప్రీమియం ఫీల్‌ని కలిగిస్తాయి. సైడ్ ప్రొఫైల్ నుండి చూసినప్పుడు, అనేక డిజైన్ ఎలిమెంట్స్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇందులో ఫ్యూయెల్ ట్యాంక్ కూడా చూడవచ్చు. ఇంటర్‌సెప్టర్ 650 రెండు వైపులా రాయల్ ఎన్‌ఫీల్డ్ చిహ్నంతో పూర్తయిన ఫ్యూయెల్ ట్యాంక్‌ను పొందుతుంది. ఇది మోన్జా స్టైల్ ఫ్యూయెల్ ఫిల్లర్ క్యాప్ క్రోమ్ లో పూర్తయింది.

మేము ఇక్కడ రైడ్ చేసిన ఇంటర్‌సెప్టర్ 650 'వెంచురా బ్లూ కలర్' లో ఉంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ యొక్క డిజైన్‌ను మరింత మెరుగుపరిచే విధంగా ఇందులో పొడవైన సింగిల్-పీస్ సీట్‌ ఉంటుంది. ఇది వాహనదారునికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఇంటర్‌సెప్టర్ 650 యొక్క ఆకర్షణను పెంచడంలో పెద్ద ప్యారలల్-ట్విన్ ఇంజిన్ మరియు క్రోమ్‌లో పూర్తయిన ట్విన్ ఎగ్జాస్ట్ పైపులు కూడా పెద్ద పాత్ర పోషిస్తాయి. ఇంజిన్ సైడ్ కవర్‌లు క్రోమ్‌లో, సిలిండర్లు బ్లాక్‌లో మరియు ఇంజిన్ హెడ్ సిల్వర్‌లో ఫినిష్ చేయబడ్డాయి. ఇవన్నీ కూడా బైక్ ని చాలా ఆకర్షణీయంగా ఉండే విధంగా చేస్తాయి.

ఇంటర్‌సెప్టర్ 650 యొక్క సైడ్ ప్యానెల్స్ బ్లాక్‌లో పూర్తయ్యాయి, వాటిపై ఇంటర్‌సెప్టర్ లోగోను కూడా ఉంటుంది. ఈ బైక్ యొక్క వెనుక భాగం సాధారణ సెటప్‌తో వస్తుంది. వెనుక ఫెండర్‌పై హాలోజన్ బల్బుతో నడిచే టెయిల్ ల్యాంప్ మరియు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌తో పాటు ఇండికేటర్స్ అమర్చబడి ఉంటాయి. వెనుక నుండి చూసినప్పుడు, ట్విన్ అప్‌స్వీప్డ్ ఎగ్జాస్ట్ అవుట్‌లెట్‌లు 650 బైక్ కి ఒక పెద్ద బైక్ రూపాన్ని అందిస్తాయి. మొత్తం మీద ఒక్క మాటలో చెప్పాలంటే బిఎస్ 6 ఇంటర్‌సెప్టర్ 650 అదిరిపోయే డిజైన్ కలిగి చాలా సింపుల్ గా ఉంటుంది.

ఇంజిన్ మరియు పర్ఫామెన్స్:

2021 బిఎస్ 6 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 బైక్ 'ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్, 648 సిసి ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌' కలిగి ఉంటుంది. ఈ కొత్త బైక్ యొక్క ఇంజిన్ బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్నప్పటికీ, పవర్ మరియు టార్క్ అవుట్‌పుట్ ఒకే విధంగా ఉంటాయి. ఇది 7,150 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 47 బిహెచ్‌పి పవర్ మరియు 5,250 ఆర్‌పిఎమ్ వద్ద 52 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ప్రారంభించిన వెంటనే దూకుడుగా, పెద్ద శబ్దంతో ప్రారంభమవుతుంది. ఇందులోని ట్రాన్స్‌మిషన్ డ్యూటీలు స్లిప్పర్ క్లచ్ సహాయంతో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా నిర్వహించబడతాయి. ఇది రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. పెద్ద క్రూయిజర్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే ఇది మొదటి గేర్‌లోకి స్లాట్ చేయబడినప్పుడు శబ్దం చేస్తుంది. క్లచ్ లివర్‌ని నెమ్మదిగా విడుదల చేసినప్పుడు ప్యారలల్ ట్విన్ మోటార్ ద్వారా ఉత్పత్తి చేయబడిన లో ఫినిషింగ్ టార్క్ కారణంగా మోటార్‌సైకిల్ ఎటువంటి త్రాటల్ ఇన్‌పుట్ లేకుండా కూడా వెళుతుంది.

టార్క్‌లో 80 శాతానికి పైగా 3,000 ఆర్‌పిఎమ్ కంటే తక్కువ సమయంలో వస్తుంది, కావున ఇది తక్కువ వేగంలో మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఐతే కాకుండా ఏ గేర్‌లోనైనా వేగాన్ని అందుకోవడం చాలా సులభం.

ఈ బైక్ హైవేలో 4,200 ఆర్‌పిఎమ్ వద్ద గంటకు 100 కిమీ వరకు మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద గంటకు 120 వేగంతో వెల్తుంది. ఇంత వేగంలో కూడా బైక్ ను సులభంగా కంట్రోల్ చేయవచ్చు. ఈ బైక్ కేవలం 7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

ఈ బైక్ యొక్క మైలేజ్ విషయానికి వస్తే ఆకారంలో లీటరుకు 23 కిమీ మరియు హైవేలో లీటరుకు 28 కిమీ మైలేజ్ అందించింది. మొత్తానికి ఈ బైక్ అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

రైడింగ్ మరియు హ్యాండ్లింగ్:

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 బైక్ వాహనదారునికి మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ బైక్ ప్రారంభం నుంచి కూడా చాలా స్మూత్ రైడింగ్ పొందవచ్చు. ఈ బైక్ హైవేపై చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ 2018 లో మొదటిసారిగా ప్రారంభించినప్పుడు, 650 ట్విన్ పిరెల్లి ఫాంటమ్ స్పోర్ట్ కాంప్ టైర్లతో ప్రయాణించారు. అయితే ఇప్పుడు ఈ బైక్స్ పిరెల్లిస్ స్థానంలో సీట్ టైర్లు ఉన్నాయి.

ఈ టైర్లు రోడ్డుపై మంచి పట్టును అందిస్తాయి. డ్రై టార్మాక్‌లో, టైర్లు చాలా బాగుంటాయి మరియు రోడ్లు తడిగా ఉన్నప్పుడు మాత్రమే గ్రిప్ లెవల్స్ కొద్దిగా తగ్గుతాయి.

ఇందులోని సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుకవైపు ట్విన్ షాక్‌లు సెటప్ ఉంటుంది. ప్రీలోడ్ కోసం వెనుక షాక్‌లు అడ్జస్ట్ చేయబడతాయి. ఇవన్నీ కలిగి ఉండటం వల్ల ఎలాంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

ఈ బైక్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందువైపు 320 మిమీ డిస్క్ మరియు వెనుకవైపు 240 మిమీ డిస్క్ కలిగి అద్భుతంగా పనిచేస్తాయి. ఇది డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ సిస్టం ఐ కూడా కలిగి ఉంటుంది. ఈ బైక్ లో రైడింగ్ స్థానం చాలా సూటిగా మరియు నిటారుగా ఉంటుంది. కానీ చాలా సౌలభ్యంగా ఉంటుంది.

మేము రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 బైక్ పై 300 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాము. ఇది సుదూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కూడా విసుగులేకుండా చేస్తుంది. అయితే ఇందులోకి సీటు కొంచెం వెడల్పుగా మరియు మెత్తగా ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది. అయితే కంపెనీ ఈ బైక్ కోసం ఆప్సనల్ సీటు కూడా అందిస్తుంది. మొత్తం మీద రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 రహదారి పరిస్థితులతో సంబంధం లేకుండా రైడింగ్ చేయడానికి ఒక అద్భుతమైన మోటార్‌సైకిల్.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ఫీచర్స్:

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 బిఎస్ 6 ప్రమాణాలకు అనుకూలంగా మారినప్పటికీ దాని ఫీచర్స్ మాత్రం దాదాపు మూడు సంవత్సరాలుగా ఎటువంటి మార్పు చెందలేదు. ఇందులో డిజిటల్-అనలాగ్ ఇన్స్ట్రుమెంటేషన్, స్పీడోమీటర్ లోపల ఉన్న చిన్న ఎల్‌సిడి స్క్రీన్ మాత్రమే 2021 మోటార్‌సైకిల్ అని గుర్తు చేస్తుంది.

మేము ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లో ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్‌తో పూర్తి చేసిన ఒక పెద్ద ఎల్సిడి లేదా TFT యూనిట్ ఉంటుందని ఆశించాము. అయితే ఇది తరువాత దశలో అయినా అందుబాటులో ఉంటుందని భావిస్తున్నాము.

అయితే ఇందులోని పెయింట్ స్కీమ్ మరియు కలర్ ఆప్షన్‌లు ఫీచర్స్ గా లెక్కించబడవు. అయినప్పటికీ వినియోగదారులకు బైక్ యొక్క కలర్ అనేది చాలా ముఖ్యం. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 అనేక కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇందులో మేము రైడ్ చేసిన బైక్ వెంచురా బ్లూ కలర్‌లో ఉంది. ఈ సంవత్సరం లైనప్‌లో చేర్చబడిన నాలుగు కొత్త కలర్స్ లో ఇది కూడా ఒకటి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 కలర్ ఆప్షన్స్:

 • మార్క్ 2
 • కాన్యన్ రెడ్
 • వెంచురా బ్లూ
 • ఆరెంజ్ క్రష్
 • డౌన్‌టౌన్ డ్రాగ్
 • బేకర్ ఎక్స్‌ప్రెస్
 • సన్ సెట్ స్ట్రిప్
 • ప్రత్యర్థులు:

  బిఎస్ 6 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 బైక్ ధరను పరిగణనలోకి తీసుకుంటే, ఇది కెటిఎమ్ 390 డ్యూక్ మరియు కవాసకి నింజా 300 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అదేవిధంగా క్యారెక్టర్ మరియు నిర్మించిన విధానం పరంగా, ఇది కవాసకి డబ్ల్యు800, ట్రయంఫ్ స్ట్రీట్ ట్విన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

  ధర :

  రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 బైక్ రంగును బట్టి ధర నిర్ణయించబడుతుంది.

  2021 Royal Enfield Interceptor 650 Colour Price
  RE Interceptor 650 Canyon Red ₹2.81 Lakh
  RE Interceptor 650 Orange Crush ₹2.81 Lakh
  RE Interceptor 650 Ventura Blue ₹2.81 Lakh
  RE Interceptor 650 Sunset Strip ₹2.89 Lakh
  RE Interceptor 650 Downtown Drag ₹2.89 Lakh
  RE Interceptor 650 Baker Express ₹2.89 Lakh
  RE Interceptor 650 Mark 2 ₹3.03 Lakh

  వారంటీ & రోడ్‌సైడ్ అసిస్ట్:

  రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 మోటార్‌సైకిల్ ప్రామాణికంగా 2-సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్ల వారంటీతో వస్తుంది అంతే కాకుండా కొనుగోలుదారులు 2-సంవత్సరాలు మరియు 20,000 కిలోమీటర్ల పొడిగించిన వారంటీని ఎంచుకోవచ్చు. ఇది 1-సంవత్సరం రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్యాకేజీని ప్రామాణికంగా అందుకుంటుంది.

  రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో మేక్ ఇట్ యువర్స్ కస్టమైజేషన్ ప్రోగ్రాం కూడా ఉంది. ఇంటర్‌సెప్టర్ 650 కొనుగోలుదారులు తమ అభిరుచికి తగినట్లుగా వివిధ రకాల యాక్ససరీస్ తో మోటార్‌సైకిల్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు.

  డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

  మేము మొదటిసారి 2018 లో ఈ మోటార్‌సైకిల్‌ రైడ్ చేసినప్పుడు, ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ విజయవంతమైన అధ్యాయానికి నాంది అని చెప్పాము. అది ఇప్పుడు నిజమైంది. ప్రస్తుతం బిఎస్ 6 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 బైక్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండి, అద్భుతమైన రైడింగ్ అనుభవాన్ని అందించింది.

  రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 బైక్ ఎల్ఈడీ లైటింగ్ మరియు TFT స్క్రీన్ వంటి మరిన్ని టెక్నాలజీలను కలిగి ఉండాలని మేము ఆశిస్తున్నాము. ఈ రెండు ఫీచర్స్ ఇందులో అందుబాటులో ఉంటే నిజంగా ఈ బైక్ మార్కెట్లో ఒక తిరుగులేని బైక్ గా నిలిచిపోతుందని మేము ఖచ్చితంగా చెప్పగలము.

Most Read Articles

English summary
2021 royal enfield interceptor 650 review performance specs features riding impressions more details
Story first published: Friday, August 13, 2021, 12:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X