భారత్‌‌లో 2014 బెంట్లీ ఫ్లయింగ్ స్పౌర్ లగ్జరీ కారు విడుదల

By Ravi

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ బెంట్లీ మోటార్స్, భారత మార్కెట్లో లగ్జరీ కార్ ప్రియుల కోసం ఓ అధునాత కారును ప్రవేశపెట్టింది. గడచిన సంవత్సరంలో జరిగిన 2013 జెనీవా మోటార్ షోలో కంపెనీ తొలిసారిగా ఆవిష్కరించిన '2014 బెంట్లీ ఫ్లయింగ్ స్పౌర్' (2014 Bentley Flying Spur) ఆల్ట్రా లగ్జరీ కారును కంపెనీ నేడు (అక్టోబర్ 1, 2013)న దేశీయ విపణిలో విడుదల చేసింది.

మునుపటి వెర్షన్ ఫ్లయింగ్ స్పౌర్ లగ్జరీ సెలూన్ కన్నా మరింత మెరుగ్గా ఉండే 2014 ఫ్లయింగ్ స్పౌర్‌ను బెంట్లీ తీర్చిదిద్దింది. అయితే, ముందు వైపు డిజైన్‌లో మనకు ఈ రెండు వెర్షన్లకి పెద్దగా మార్పు కనిపించదు. కానీ వెనుక డిజైన్‌లో మాత్రం మార్పు కనిపిస్తుంది. ఇది పాత వెర్షన్ కన్నా సుమారు 50 కేజీలకు పైగా తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఫలితంగా ఇది మంచి పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

కొత్త 2014 బెంట్లీ ఫ్లయింగ్ స్పౌర్ ధర మరియు ఇతర వివరాల కోసం క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

ఇంజన్

ఇంజన్

కొత్త 2014 బెంట్లీ ఫ్లయింగ్ స్పౌర్ బరువును తగ్గించిన కారణంగా ఇప్పుడు ఇందులోని 6.0 లీటర్ డబ్ల్యూ12 ట్విన్ టర్బో ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 616 హెచ్‌పిల టార్క్‌ను, 2000 ఆర్‌పిఎమ్ వద్ద 800 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్సిమిషన్

ట్రాన్సిమిషన్

2014 బెంట్లీ ఫ్లయింగ్ స్పౌర్ లగ్జరీ కారులో అమర్చిన6.0 లీటర్ డబ్ల్యూ12 ట్విన్ టర్బో ఇంజన్, జెడ్ఎఫ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (ఆటోమేటిక్ గేర్‌బాక్స్)తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో క్విక్‌షిఫ్ట్, బ్లాక్ షిఫ్టింగ్, స్టీరింగ్ వీల్‌పై ప్యాడల్‌షిఫ్ట్ ఫీచర్స్ కూడా ఉంటాయి.

పెర్ఫామెన్స్

పెర్ఫామెన్స్

కొత్త బెంట్లీ ఫ్లయింగ్ స్పౌర్ కేవలం 4.3 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది.

గరిష్ట వేగం

గరిష్ట వేగం

ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించే ఈ కారు గరిష్ట వేగం గంటకు 322 కిలోమీటర్లు.

మైలేజ్

మైలేజ్

కొత్త 2014 బెంట్లీ ఫ్లయింగ్ స్పౌర్ లగ్జరీ కారు లీటరుకు 6.8 కిలోమీటర్ల మైలేజీని (14.7 లీ./100 కి.మీ.) ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

సిఓ2 ఎమిషన్స్

సిఓ2 ఎమిషన్స్

బెంట్లీ ఫ్లయింగ్ స్పౌర్ కిలోమీటరుకు కేవలం 343 గ్రాముల కర్భన ఉద్ఘారాలను (సిఓ2 ఎమిషన్స్) విడుదల చేస్తుందని కంపెనీ తెలిపింది.

ఇన్ఫోటైన్‌మెంట్

ఇన్ఫోటైన్‌మెంట్

డ్రైవర్‌కు కావల్సిన అన్ని సమాచారాలను అందించేందుకు, వినోదాన్ని పంచేందుకు ఇందులో ఓ 8ఇంచన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 1100 వాట్ల సౌండ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉన్నాయి.

ఫీచర్స్

ఫీచర్స్

వెనుక సీట్లో కూర్చునే ప్రయాణికుల వినోదం కోసం రెండు 10 ఇంచ్‌ల ఎల్‌సిడి స్క్రీన్స్, వై-ఫై వంటి ఫీచర్లతో వివిధ విలాసవంతమైన ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

ధర

ధర

భారత మార్కెట్లో 2014 బెంట్లీ ఫ్లయింగ్ స్పౌర్ ధరను రూ.3.10 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.

Most Read Articles

English summary
British luxury car company Bentley Motors has lunched its 2014 Bentley Flying Spur in India at price tag of Rs. 3.1 crore ex showroom Delhi. This car was earlier showcased at 2013 Geneva Motor Show.
Story first published: Tuesday, October 1, 2013, 17:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X