కొత్త ఫార్చ్యూనర్‌లో ఇన్నోవా ఇంజన్‌ను అమర్చిన టొయోటా

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టొయోటా కిర్లోస్కర్ మోటార్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ ప్రీమియం ఎస్‌యూవీ 'ఫార్చ్యూనర్'లో కంపెనీ తాజాగా ఓ కొత్త 4x4 వేరియంట్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ కొత్త వేరియంట్ కాకుండా కంపెనీ తమ ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో మరో చవక వేరియంట్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో, కంపెనీ విక్రయిస్తున్న ఇన్నోవా ఎమ్‌పివిలో ఉపయోగించిన 2.5 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు.

టొయోటా ఫార్చ్యూనర్ 2.5 లీటర్ వెర్షన్ రెండు వేరియంట్లలో (మ్యాన్యువల్, ఆటోమేటిక్) లభిస్తుంది. ఇందులోని 2494సీసీ (2.5 లీటర్) టర్బో-డీజిల్ ఇంజన్ గరిష్టంగా 3400 ఆర్‌పిఎమ్ వద్ద 144 పిఎస్‌ల శక్తిని, 1600-2800 ఆర్‌పిఎమ్ వద్ద 34.9 కెజిఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇండన్ 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. కాగా.. ఈ 2.5 లీటర్ వెర్షన్ టొయోటా ఫార్చ్యూనర్‌లో ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ అందుబాటులో లేదు.

Toyota Fortuner

టొయోటా ఫార్చ్యూనర్ 2.5 లీటర్ వేరియంట్‌లో టొయోటా రేసింగ్ డెవలప్‌మెంట్ (టిఆర్‌డి) బాడీ ప్యాకేజ్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా.. డ్యూయెల్ టోన్ రేడియేటర్ గ్రిల్, సైడ్ స్కర్ట్స్, రియర్ స్పాయిలర్ మరియు అధనపు బాడీ గ్రాఫిక్స్ లభిస్తాయి. అయితే ఫార్చ్యూనర్ 3.0 లీటర్ వేరియంట్లో ఆఫర్ చేసిన హెచ్ఐడి లైట్లకు బదులుగా ఈ కొత్త ఫార్చ్యూనర్ 2.5 లీటర్ వేరియంట్లో రెగ్యులర్ హ్యాలోజెన్ హెడ్‌ల్యాంప్స్‌ని ఆఫర్ చేస్తున్నారు.

లెథర్ సీట్స్, పవర్డ్ డ్రైవర్ సీట్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, క్లైమేట్ కంట్రోల్, రియర్ కెమెరా, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లు ఈ కొత్త ఫార్చ్యూనర్ 2.5 లీటర్ వేరియంట్లో స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌గా లభిస్తాయి. ఇందులో ముందు వైపు రెండు ఎయిర్‌బ్యాగ్స్ కూడా ఉంటాయి. దేశీయ విపణిలో ఈ కొత్త టొయోటా ఫార్చ్యూనర్ 2.5 వేరియంట్ ధరలు ఇలా ఉన్నాయి:

  • టొయోటా ఫార్చ్యూనర్ 2.5లీ - రూ.24.44 లక్షలు (మ్యాన్యువల్)
  • టొయోటా ఫార్చ్యూనర్ 2.5లీ - రూ.25.44 లక్షలు (ఆటోమేటిక్)

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

Most Read Articles

English summary
Toyota has added a cheaper version of the Fortuner SUV equipped with a 2.5-litre diesel engine, which does duty in Innova MPV. The Toyota Fortuner 2.5-litre is available in two variants and is priced at Rs 24.44 lakh for the manual-gearbox version while the automatic costs Rs 25.44 lakh (Ex-showroom, Delhi).
Story first published: Friday, January 9, 2015, 15:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X