హ్యాండ్ కార్ వాష్ కన్నా ఆటోమేటెడ్ కార్ వాషే బెస్ట్: అధ్యయనం

By Ravi

మనం కార్లను సాధారణంగా చేతుల్తో శుభ్రం (హ్యాండ్ వాష్) చేస్తుంటాం. ఇలా చేయటం వలన మన కారును మనం జాగ్రత్తగా, కారుపై ఎలాంటి గీతలు పడకుండా ఉండేలా శుభ్రం చేసుకోవచ్చని అనుకుంటాం. ఖరీదైన ఆటోమేటిక్ కార్ వాష్ చేయింటానికి చాలా మంది ఇష్టపడరు. ఆటోమేటిక్ కార్ వాష్ చేయిస్తే, కారుపై చిన్నపాటి గీతలు (స్క్రాచెస్) పడుతాయని భావిస్తారు.

కానీ తాజా అధ్యయనం ప్రకారం, హ్యాండ్ వాష్ కన్నా ఆటోమేటిక్ కార్ వాష్ చాలా ఉత్తమమైనదని తేలింది. పెయింట్ రీసెర్స్ అసోషియేషన్ (పిఆర్ఏ) నిర్వహించిన ఓ పరీక్షలో కార్లను రెగ్యులర్ హ్యాండ్ వాష్ చేయటం కన్నా అధునాతన టెక్నాలజీతో కూడిన ఆటోమేటిక్ వాష్ చేయటమే సురక్షితమైనదని తేలింది. హ్యాండ్ వాష్‌లో కంటికి తెలియని అనేక స్క్రాచ్‌లు పడి, కొద్ది కాలం తర్వాత అవి కారు పెయింట్‌పై ప్రభావం చూపుతుందని పిఆర్ఏ పేర్కొంది.

ఇది కూడా చదవండి: కార్ వాష్ చేస్తూ అందాలు ఆరబోసిన సెలబ్రిటీలు


ఇది కూడా చదవండి: ఇంట్లో ఉపయోగించే వస్తువులతోనే 'కార్ క్లీనింగ్'

ఏదేమైనప్పటికీ, ఈ ఆటోమేటెడ్ కార్ వాషింగ్ సేవలు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు, ఒకవేళ ఉన్నా ఇందుకోసం సర్వీస్ సెంటర్లు చార్జ్ చేసే డబ్బులు ఎక్కువగా ఉండచ్చు. చింతించాల్సిన అవసరం లేదు. ఆటోమేటెడ్ కార్ వాష్ సర్వీస్ ఎంత మెరుగైన క్లీనింగ్ అందించినప్పటికీ, మన ఇళ్లల్లో నిత్యం ఉపయోగించే కొన్ని రకాలు వస్తువులతోనే కారును తళతలలాడించవచ్చు.

IMO Car wash

వారాతంపు రోజుల్లో ఖాలీగా ఉండే సమయాన్ని వృధా చేసుకోకుండా కారు క్లీనింగ్ కోసం ఓ గంట వ్యవధిని కేటాయిస్తే చాలు. మీ కారును కొత్త పెళ్లికూతురిలా తళతళా మెరిపించేయవచ్చు. కార్ క్లీనింగ్ కోసం ఖరీదైన కార్ పాలిష్‌లే ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉపయోగించే వస్తువులతోనే కారును శుభ్రం చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Most Read Articles

English summary
The study, conducted by the PRA – the world’s most complete surface coatings advisor, found that hand-washing your car was the most damaging to paint work recording the highest scratch count, thus turning the ‘hand-wash is better’ myth on its head. 
Story first published: Thursday, November 7, 2013, 11:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X