ఇలా చేస్తే కార్ల దొంగలకు పూర్తిగా చెక్ పెట్టినట్లే!

దేశంలో ఏదో ఒక చోట నిత్యం కార్ల దొంగతనాలు జరుగుతున్న సంగతి తెలిసినదే. కార్లను అపహరించేందుకు దొంగలు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. మన కార్ల విషయంలో మనం అప్రమత్తంగా లేకుండా, ఏ క్షణంలోనైనా కారు తస్కరణకు గురికావచ్చు.

ఇలా చేస్తే కార్ల దొంగలకు పూర్తిగా చెక్ పెట్టినట్లే!

దొంగల బారి నుండి కార్లను సురక్షితంగా రక్షించుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఇలా చేస్తే కార్ల దొంగలకు పూర్తిగా చెక్ పెట్టినట్లే!

సురక్షితమైన ప్రదేశంలో పార్కింగ్:

కార్ల విషయంలో పార్కింగ్ అనే చాలా ముఖ్యమైనది. కారును ఎల్లప్పుడూ సురక్షితమైన ప్రదేశంలోనే పార్క్ చేయటానికి ప్రయత్నించాలి. మెట్రో నగరాల్లో అయితే, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకమైన స్థలాలు కూడా ఉంటాయి, ఇవి అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంటాయి.

ఇలా చేస్తే కార్ల దొంగలకు పూర్తిగా చెక్ పెట్టినట్లే!

కార్లను ఎప్పుడైనా సరే బహిరంగ ప్రదేశంలో పార్క్ చేయకూడదు. ఒకేవళ మీకు సరైన పార్కింగ వసతి లేక అలా పార్క్ చేయాల్సి వచ్చినట్లయితే, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటో కూడా ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇలా చేస్తే కార్ల దొంగలకు పూర్తిగా చెక్ పెట్టినట్లే!

కారులో సేఫ్టీ అలారం:

సాధారణంగా, అన్ని మోడ్రన్ కార్లు సేఫ్టీ ఆలారంను కలిగి ఉంటాయి. ఒకవేళ మీరు ఉపయోగిస్తున్నది పాత మోడల్ కార్ అయితే, ఆఫ్టర్ మార్కెట్‌లో ఇప్పటికే కార్ సేఫ్టీ అలారం‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి అలారంలను కలిగి ఉన్న కార్లను ఎవరైనా దొంగిలించాలని చూస్తే, పెద్ద శబ్ధంతో అలారం మ్రోగుతుంది. అది విని దొంగలు పారిపోయే అవకాశం ఉంది.

ఇలా చేస్తే కార్ల దొంగలకు పూర్తిగా చెక్ పెట్టినట్లే!

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ కలిగి కార్లలో అయితే, జియో ఫెన్సింగ్ ఉంటుంది. దీని సాయంతో కారు ఎక్కడుందో ఇట్టే పట్టేయవచ్చు. ఇలాంటి మోడ్రన్ కార్లను ఎవరైనా దొంగిలించాలని ప్రయత్నించినా, వెంటనే కారు ఓనర్ ఫోన్‌కి అలెర్ట్ మెసేజ్ కూడా వెళ్లిపోతుంది.

ఇలా చేస్తే కార్ల దొంగలకు పూర్తిగా చెక్ పెట్టినట్లే!

సీసీటీవీ కెమెరా:

ఇంటి లోపల కానీ లేదా బయట కానీ పార్క్ చేసే ప్రాంతంలో సీసీటీవీ కెమెరాను అమర్చుకోవటం ఉత్తమమైన మార్గం. చాలా దొంగలు ఖంగారులో సీసీటీవీలను గుర్తించలేక దొరికిపోతుంటారు. కాబట్టి, కారు దొంగతనాలను నియంత్రిచడం లేదా దుండగులను పట్టించడంలో ఇవి కీలకంగా వ్యహరిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో చాలా తక్కువ ధరకే సీసీటీవీ కెమెరాలు దొరుకుతున్నాయి.

ఇలా చేస్తే కార్ల దొంగలకు పూర్తిగా చెక్ పెట్టినట్లే!

అలాకాకుండా, కార్ డ్యా‌ష్‌బోర్డులో అమర్చుకునేందుకు వీలుగా కూడా కొన్ని డ్యాష్‌క్యామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి జి సెన్సార్లను కలిగి ఉండి, కారు చలనం అయిన వెంటనే యాక్టివేట్ అయ్యేలా ఉంటాయి. ఎవరైనా దొంగలు కారును దొంగిలించడానికి విఫల యత్నం చేస్తే, వారి ముఖాలు అందులో రికార్డ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది.

ఇలా చేస్తే కార్ల దొంగలకు పూర్తిగా చెక్ పెట్టినట్లే!

జిపిఎస్ ట్రాకర్:

కారుకి జిపిఎస్ ట్రాకర్‌ను అమర్చినట్లయితే, ఒకవేళ వాహనం దొంగిలించబడినా వెంటనే దాన్ని గుర్తించేందుకు వీలుగా ఉంటుంది. ముఖ్యంగా, దొంగిలించబడిన సమయంలో వాహనం ఎటు వైపు వెళ్తుందో అనే సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇందులో లైవ్ ట్రాకింగ్ సదుపాయం కూడా ఉంటుంది. ఆఫ్టర్ మార్కెట్లో కూడా ఇవి లభిస్తాయి.

ఇలా చేస్తే కార్ల దొంగలకు పూర్తిగా చెక్ పెట్టినట్లే!

స్టీరింగ్ లాక్ మరియు గేర్ లాక్:

కారు దొంగలబారిన పడకుండా ఉండటానికి ఓ ముఖ్యమైన మరియు పాతదైన పద్ధతి స్టీరింగ్ లాక్ మరియు గేర్‌లాక్. మనం మన ఇళ్లకు తాళాలు వేసినట్లుగానే, కారులోని స్టీరింగ్ మరియు గేర్‌బాక్స్‌లకు తాళాలు వేసేందుకు యాక్ససరీలు అందుబాటులో ఉన్నాయి. పలు ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ లేదా కార్ యాక్ససరీ షాపుల్లో ఇవి దొరుకుతాయి.

ఇలా చేస్తే కార్ల దొంగలకు పూర్తిగా చెక్ పెట్టినట్లే!

ఈ లాక్స్‌ను స్టీరింగ్ వీల్‌పై లేదా గేర్‌బాక్స్‌పై ఉంచి లాక్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ దొంగలు కారు అద్దాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించినా, వీటికి లాక్స్ ఉండటం వలన దొంగలు స్టీరింగ్‌ని కానీ లేదా గేర్‌బాక్స్‌ని కానీ కదల్చడానికి వీలు ఉండదు. ఇలాంటి లాక్స్‌ని రీఇన్‌ఫోర్స్డ్ మెటల్‌తో తయారు చేస్తారు కాబట్టి, అవి అంత సులువుగా విరిగిపోవు.

ఇలా చేస్తే కార్ల దొంగలకు పూర్తిగా చెక్ పెట్టినట్లే!

ఇటీవలి నివేదికల ప్రకారం, వాహన దొంగతనాలు 2019లో కంటే 2020లోనే చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి, మన వాహనాలను రక్షించడం చాలా అవసరం. పైన పేర్కొన్న చిట్కాలను పాటించినట్లయితే, కార్లను దొంగల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

Most Read Articles

English summary
Follow These Tips To Save Your Vehicle From Theft Risk. Read In Telugu.
Story first published: Sunday, March 14, 2021, 8:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X